స్వచ్ఛ ఆంధ్ర- స్వచ్ఛ దివస్' ప్రారంభించిన సీఎం చంద్రబాబు! ప్రతి పౌరుని భాగస్వామిగా మార్చే పిలుపు!

Header Banner

స్వచ్ఛ ఆంధ్ర- స్వచ్ఛ దివస్' ప్రారంభించిన సీఎం చంద్రబాబు! ప్రతి పౌరుని భాగస్వామిగా మార్చే పిలుపు!

  Sat Jan 18, 2025 18:35        Politics

స్వచ్ఛ ఆంధ్ర' కోసం అందరూ కలిసి పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. కడప జిల్లా మైదుకూరులో 'స్వచ్ఛ ఆంధ్ర- స్వచ్ఛ దివస్'ను సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. “మన దేశం పరిశుభ్రంగా ఉండాలని గాంధీజీ తపించారు. ప్రధాని మోదీ సారథ్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టాం. పారిశుద్ధ్య సాధన దిశగా దేశ ప్రజలంతా చేతులు కలపాలి. జపాన్లో రోడ్లు కూడా ఎంతో పరిశుభ్రంగా ఉంటాయి. అక్కడ కాగితం కూడా జేబులో పెట్టుకుని ఇంట్లోని చెత్తబుట్టలో వేస్తారు.



ఇంకా చదవండినామినేటెడ్ పదవులకు రెండు కేటగిరీలుగా విభజన - తాజా లిస్టువేతనాలు ఫిక్స్ - మరో కీలక నిర్ణయం! 



మనం మాత్రం ఇంట్లో ఉండే చెత్తను రోడ్డుపై పోస్తున్నాం. గతంలో ఏ ఊరు వెళ్లినా చెత్తాచెదారం కనిపించేది. గ్రామాల్లో మహిళల పరిస్థితి చూసి ఎంతో బాధపడేవాడిని. ఆరోజుల్లో వంట చేయడం మహిళలకు నరకంగా ఉండేది. దీపం కార్యక్రమం కింద ఆనాడు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాం. ఇప్పుడు దీపం-2 కింద ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. ఆరోజు మేం ఇచ్చిన నివేదిక మేరకు స్వచ్ఛభారత్ కార్పొరేషన్ తెచ్చారు. స్వచ్ఛ ఆంధ్ర కోసం సేవకులుగా పనిచేస్తామని చాలా మంది వచ్చారు.



అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 



సమాజహితం కోసం కష్టపడేవారిని మనమంతా గుర్తించాలి. మైదుకూరులో సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టాం. ప్రతినెలా మూడో శనివారం స్వచ్ఛ ఆంధ్ర కోసం పని చేయాలి. తరతరాలుగా వస్తున్న అలవాట్లు త్వరగా పోవు. మంచి అలవాట్లు పాటించేందుకు చాలా సమయం పడుతుంది. చెడు ఆలోచనలు, చెడు పనులు చేయకుండా మన మైండ్ను నిత్యం మనమే కంట్రోల్ చేయాలి. ఇల్లు, పరిసరాలు బాగుంటేనే మంచి ఆలోచనలు వస్తాయి. ఆహ్లాదకర వాతావరణం ఉంటేనే ఏదైనా సాధించగలం. పని ప్రాంతాన్ని కూడా అందరూ శుభ్రంగా ఉంచుకోవాలి" అని సీఎం సూచించారు.


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ వాసులకు గుడ్ న్యూస్.. రూ.11500 కోట్ల ఆర్థిక ప్యాకేజీకి కేంద్ర కేబినెట్ ఆమోదం! ఇక వారికి పండగే పండగ!

  

2025 జనవరి మహీంద్రా కార్లపై రూ. 1.25 లక్షల వరకు తగ్గింపు.. భారీ ఆఫర్లతో.. ఈ అవకాశం పోతే రాదు!

 

మీకు ఈ బ్యాంకుల్లో ఖాతా ఉందావెంటనే చెక్ చేసుకోండి! 

 

ఏపీలో మందుబాబులకు మరో గుడ్ న్యూస్! ఆ బాటిల్‌పై భారీగా తగ్గింపు..

  

ఇంటి దగ్గరే ఈజీగా ఇలా చేయండి చాలు.. ఈ ఆహారాలతో - మీ కిడ్నీలు పూర్తిగా క్లీన్ అయిపోతాయి!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #swatchbharath #swatchandhra #APCM #CBN #todaynews #flashnews #latestupdate