ఆ విషయంలో కేంద్రనిదే చారిత్రాత్మకమైన నిర్ణయం! విశాఖ స్టీల్ ప్లాంట్ కొత్త దశలోకి!

Header Banner

ఆ విషయంలో కేంద్రనిదే చారిత్రాత్మకమైన నిర్ణయం! విశాఖ స్టీల్ ప్లాంట్ కొత్త దశలోకి!

  Sat Jan 18, 2025 17:09        Politics

కూటమి ప్రభుత్వంతోనే ఏపీ అభివృద్ధి చెందుతుందని తాము మొదటి నుంచీ చెబుతూనే ఉన్నామని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీకి రూ.11, 440కోట్లు కేటాయించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, నిర్మలా సీతారామన్, కుమారస్వామిలకు ధన్యవాదాలు తెలిపారు. ఇది కూటమి ప్రభుత్వం సాధించిన ఘనత అని చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకోవడం అభినందనీయమని చెప్పారు. అమృతరావు, తెన్నేటి విశ్వనాధం కృషి, వేలాదిమంది తెలుగువారి పోరాటం ఫలితంగా 32మంది ప్రాణాలు కోల్పోయిన సందర్భంలో విశాఖలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం జరిగిందని గుర్తుచేశారు.


ఇంకా చదవండినామినేటెడ్ పదవులకు రెండు కేటగిరీలుగా విభజన - తాజా లిస్టువేతనాలు ఫిక్స్ - మరో కీలక నిర్ణయం! 


ఆనాడు 64 గ్రామాల ప్రజలు స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి సహకారం అందించిన చరిత్ర ఉందని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అప్పుల ఊబిలో కూరుకుపోవడం, క్యాపిటల్ మైన్స్ లేని పరిస్థితి ఉందన్నారు. అక్కడ పని చేసే ఉద్యోగులు, కార్మికులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితికి వచ్చిందని చెప్పారు. ఒక నెల 30శాతం, మరో నెల 60శాతం మాత్రమే జీతాలు ఇచ్చారని గుర్తుచేశారు. కార్మిక సంఘాల ప్రతినిధులను కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, కుమారస్వామి వద్దకు సీఎం చంద్రబాబు నాయుడు తీసుకెళ్లి పరిస్థితిని వివరించారని అన్నారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 


విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు.. ఆర్థిక సాయం అందజేసే ఆలోచన ఉన్నట్లు తమకు కేంద్ర మంత్రి కుమార స్వామి చాలా సందర్భాల్లో ధైర్యం చెప్పారని అన్నారు. ఎంతోమంది కృషి ఫలించి నేడు కేంద్ర ప్రభుత్వం రూ.11,440కోట్లు ఆర్థిక ప్యాకేజీ అందించడం ఆనందంగా ఉందని అన్నారు. గతంలో ఆనాటి ప్రధాని వాజ్ పేయ్ హయాంలో కూడా ఆర్థిక ఇబ్బందుల కారణంగా ప్యాకేజీ ప్రకటించి స్టీల్ ప్లాంట్ను ఆదుకున్నారని చెప్పారు. ఇప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో మరోసారి రుజువైందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు.


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


ఏపీ వాసులకు గుడ్ న్యూస్.. రూ.11500 కోట్ల ఆర్థిక ప్యాకేజీకి కేంద్ర కేబినెట్ ఆమోదం! ఇక వారికి పండగే పండగ!

  

2025 జనవరి మహీంద్రా కార్లపై రూ. 1.25 లక్షల వరకు తగ్గింపు.. భారీ ఆఫర్లతో.. ఈ అవకాశం పోతే రాదు!

 

మీకు ఈ బ్యాంకుల్లో ఖాతా ఉందావెంటనే చెక్ చేసుకోండి! 

 

ఏపీలో మందుబాబులకు మరో గుడ్ న్యూస్! ఆ బాటిల్‌పై భారీగా తగ్గింపు..

  

ఇంటి దగ్గరే ఈజీగా ఇలా చేయండి చాలు.. ఈ ఆహారాలతో - మీ కిడ్నీలు పూర్తిగా క్లీన్ అయిపోతాయి!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #kutami #governament #vizagsteelplant #todaynews #flashnews #latestupdate