నారా లోకేష్ డిప్యూటీ సీఎం పదవిపై పొలిట్ బ్యూరో సభ్యులు ఏం అన్నారు అంటే..! పరిశీలించాలని హైకమాండ్‌కి విజ్ఞప్తి!

Header Banner

నారా లోకేష్ డిప్యూటీ సీఎం పదవిపై పొలిట్ బ్యూరో సభ్యులు ఏం అన్నారు అంటే..! పరిశీలించాలని హైకమాండ్‌కి విజ్ఞప్తి!

  Sun Jan 19, 2025 13:15        Politics

ఏపీ డిప్యూటీ సీఎం పదవిని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ కు  ఇవ్వాలనే డిమాండ్ టీడీపీలో బలంగా వినిపిస్తోంది. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామరాజు కూడా లోకేశ్ను డిప్యూటీ సీఎంను చేయాలని తన మనసులోని మాటను బయటపెట్టారు. తాజాగా మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈ డిమాండ్ను వినిపించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా సోమిరెడ్డి ట్వీట్ చేశారు. “డిప్యూటీ సీఎం పదవికి లోకేష్ బాబు అన్ని విధాలా అర్హులే. నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలన్న పొలిట్ బ్యూరో సభ్యుడు ఆర్.



ఇంకా చదవండిరోజూ ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌లో వీటిని తినండి! రోజంత‌టికీ కావ‌ల్సిన శ‌క్తి ల‌భిస్తుంది! 



శ్రీనివాసులు రెడ్డి ప్రతిపాదనను నేను సమర్థిస్తున్నాను. ఆ పదవికి లోకేష్ వందశాతం అర్హులే. రాజకీయంగా అనేక సవాళ్లు ఎదుర్కొని, అవమానాలు పడిన తర్వాత యువగళం పాదయాత్రతో తనలోని నాయకత్వ లక్షణాలను లోకేష్ నిరూపించుకున్నారు. లోకేష్ పోరాటపటిమను చూసి టీడీపీ కేడర్తో పాటు రాష్ట్ర ప్రజానీకం కూడా అండగా నిలిచి ఆయన నాయకత్వాన్ని జైకొట్టింది. డిప్యూటీ సీఎం పదవికి అన్ని విధాలా అర్హుడైన లోకేష్ పేరును ఈ పదవికి పరిశీలించాలని టీడీపీ హై కమాండ్ను కోరుతున్నాను” అని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

రేషన్ కార్డుల జారీపై ప్రభుత్వ నుంచి బిగ్ అప్‌డేట్! ఇలా కూడా అప్లై చేసుకోవచ్చు!

 

వైసీపీకి మరో బిగ్ షాక్! బీజేపీ లోకి జంప్ అయిన కీలక నేత!

 

ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్పై టీడీపీ అధిష్ఠానం ఫైర్..! విషయం ఇదే..!

 

ఏపీకి మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు! దేశంలోనే తొలి ప్రైవేట్ వెహికల్ పార్క్! 1200 ఎకరాల్లో!

 

ఆ విషయంలో కేంద్రనిదే చారిత్రాత్మకమైన నిర్ణయం! విశాఖ స్టీల్ ప్లాంట్ కొత్త దశలోకి! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #andhrapravasi #deputycm #naralokesh #politbeuro #todaynews #flashnews #latestupdate