పోస్టాఫీస్‌లో ఇలా పెట్టుబడి పెడుతున్నారా? అయితే నష్టం మీకే!

Header Banner

పోస్టాఫీస్‌లో ఇలా పెట్టుబడి పెడుతున్నారా? అయితే నష్టం మీకే!

  Sun Jan 19, 2025 13:43        Business

పోస్టాఫీస్ పథకాలు పొదుపు, పెట్టుబడికి అత్యంత విశ్వసనీయమైన మార్గాలుగా పరిగణిస్తారు. ఫిక్స్‌డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు ప్రజల్లో మంచి ప్రాచుర్యం పొందాయి. అయితే, ఈ రెండు పథకాల మధ్య ఏది ఉత్తమమవుతుంది, ఏది ఎక్కువ లాభం ఇస్తుందో అనేది మీరు పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్న లక్ష్యాలపై ఆధారపడి ఉంటుంది. FD, RD ముఖ్యమైన వివరాలు, లాభాలు, వాటి మధ్య తేడాలు తెలుసుకోవడం అవసరం.

 

ఫిక్స్‌డ్ డిపాజిట్లు: FD అనేది ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి చేసి ఆ మొత్తం పై వడ్డీ పొందే పథకం. దీనివల్ల మీరు మీ డబ్బును భద్రంగా ఉంచడమే కాకుండా, వడ్డీ ద్వారా అదనపు ఆదాయాన్ని పొందవచ్చు. FD లో వడ్డీ రేట్లు వృద్ధి చెందుతున్నాయి, ముఖ్యంగా 5 సంవత్సరాల FD పథకాలు అధిక వడ్డీ రేటు, పన్ను ప్రయోజనాలను అందిస్తాయి.

 

వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి: 1 సంవత్సరం FD పై 6.9%, 5 సంవత్సరాలు FD పై 7.5%, కనీస పెట్టుబడి పై రూ. 1,000 నుంచి ప్రారంభించవచ్చు. పెద్ద మొత్తంలో పెట్టుబడి చేయగలిగినవారికి FD ఉత్తమ ఎంపిక. 5 సంవత్సరాల FD పథకాలు పన్ను ఆదా ప్రయోజనాలను అందిస్తాయి. ఉదాహరణకు, రూ. 6 లక్షల పెట్టుబడితో 7.5% వడ్డీ రేటు వద్ద, మీరు 5 సంవత్సరాల తర్వాత రూ. 8,69,969 పొందగలరు.

 

ఇంకా చదవండిరోజూ ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌లో వీటిని తినండి! రోజంత‌టికీ కావ‌ల్సిన శ‌క్తి ల‌భిస్తుంది! 

 

ఇంకా చదవండినామినేటెడ్ పదవులకు రెండు కేటగిరీలుగా విభజన - తాజా లిస్టువేతనాలు ఫిక్స్ - మరో కీలక నిర్ణయం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

రికరింగ్ డిపాజిట్లు: RD అనేది నెలవారీగా ఒక నిర్దిష్ట మొత్తాన్ని పెట్టుబడి చేసి పొదుపు చేసే పథకం. ఇది చిన్న మొత్తాల్లో పొదుపు చేయాలనుకుంటే, RD ఉత్తమ ఎంపిక. RD లో నెలవారీగా స్థిరమైన మొత్తాలను పెట్టుబడి చేయడం వల్ల, చిన్న మొత్తాలతో మీ పొదుపు పెరిగిపోతుంది.

 

వడ్డీ రేటు ఇలా ఉన్నాయి: ఇందులో వడ్డీ రేటు 6.7% ఉంటుంది. పెట్టుబడి పద్ధతి నెలవారీగా 5 సంవత్సరాలు పాటు ఒక స్థిరమైన మొత్తం పెట్టుబడి చేయాలి. నెలవారీగా ఆదాయం పొందే వారికీ RD ఉత్తమ ఎంపిక. ఖచ్చితమైన మెచ్యూరిటీ కాలంతో పొందవచ్చు. ఉదాహరణకు, రూ. 6 లక్షల పెట్టుబడితో 6.7% వడ్డీ రేటు వద్ద, మీరు 5 సంవత్సరాల తర్వాత రూ. 7,13,659 పొందగలరు.

 

ఎక్కువ మొత్తంలో డబ్బు పెట్టుబడి చేయాలనుకుంటే, FD ఉత్తమ ఎంపిక అవుతుంది. FD, అధిక వడ్డీ రేటును అందిస్తుంది, పన్ను ప్రయోజనాలను అందిస్తుంది. మరోవైపు, నెలవారీగా చిన్న మొత్తాలు పొదుపు చేయాలనుకుంటే, RD మంచి ఎంపిక అవుతుంది. RD మీరు వడ్డీతో పాటు ఒక ఖచ్చితమైన మెచ్యూరిటీ కాలాన్ని పొందగలుగుతారు. FD, RD రెండూ విశ్వసనీయమైన, లాభదాయకమైన పెట్టుబడి పథకాలు. మీరు ఎంచుకునే పథకం, మీ పొదుపు లక్ష్యాలు, పెట్టుబడి విధానం, వ్యక్తిగత అవసరాలు ఆధారపడి ఉంటుంది. పెద్ద మొత్తంలో పెట్టుబడిని ఎంచుకునే వారు FDని ఎంచుకోవచ్చు, అలాగే నెలవారీగా పొదుపు చేయాలనుకునే వారు RDని ఎంచుకోవడం ఉత్తమం. మీకు సరైన పథకాన్ని ఎంచుకుని, భవిష్యత్తులో మంచి లాభాలు పొందేందుకు సిద్ధపడండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

రేషన్ కార్డుల జారీపై ప్రభుత్వ నుంచి బిగ్ అప్‌డేట్! ఇలా కూడా అప్లై చేసుకోవచ్చు!

 

వైసీపీకి మరో బిగ్ షాక్! బీజేపీ లోకి జంప్ అయిన కీలక నేత!

 

ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్పై టీడీపీ అధిష్ఠానం ఫైర్..! విషయం ఇదే..!

 

ఏపీకి మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు! దేశంలోనే తొలి ప్రైవేట్ వెహికల్ పార్క్! 1200 ఎకరాల్లో!

 

ఆ విషయంలో కేంద్రనిదే చారిత్రాత్మకమైన నిర్ణయం! విశాఖ స్టీల్ ప్లాంట్ కొత్త దశలోకి! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #Business #GovernmentSchemes #Savings