ఏపీలో విపత్తుల నివారణకు కేంద్ర మద్దతు అత్యవసరం - సీఎం చంద్రబాబు! ఎన్డీఆర్ఎఫ్ ఆవిర్భావ వేడుకల్లో...!

Header Banner

ఏపీలో విపత్తుల నివారణకు కేంద్ర మద్దతు అత్యవసరం - సీఎం చంద్రబాబు! ఎన్డీఆర్ఎఫ్ ఆవిర్భావ వేడుకల్లో...!

  Sun Jan 19, 2025 15:39        Politics

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొండపావులూరులో జరిగిన ఎన్డీఆర్ఎఫ్ ఆవిర్భావ వేడుకల్లో మాట్లాడారు. రాష్ట్రంలో ఎన్డీఆర్ఎఫ్ ప్రాంగణాన్ని 5 రాష్ట్రాలకు శిక్షణ ఇవ్వగలిగేలా ఏర్పాటు చేశామని, ఎన్డీఆర్ఎఫ్, ఎన్ఐడీఎం ప్రాంగణాలకు 50 ఎకరాల భూమి కేటాయించామని తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్, ఎన్ఐడీఎం ప్రాంగణాలను పూర్తి చేసినందుకు కేంద్రాన్ని అభినందించారు. ఏ విపత్తు వచ్చినా గుర్తొచ్చేది నేషనల్ డిజాస్టర్ రిస్పాన్స్ ఫోర్సే అని, దీనికి విదేశాల్లోనూ సేవలు అందించగలిగే ప్రతిభ ఉందని పేర్కొన్నారు. జపాన్, నేపాల్, టర్కీ వంటి దేశాల్లో ఎన్డీఆర్ఎఫ్ కీలక సేవలు అందించిందని గుర్తుచేశారు. రాష్ట్ర యంత్రాంగం పరిష్కరించలేని సమస్యలను ఎన్డీఆర్ఎఫ్ పరిష్కరించిందని ప్రశంసించారు.


ఇంకా చదవండిరోజూ ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌లో వీటిని తినండి! రోజంత‌టికీ కావ‌ల్సిన శ‌క్తి ల‌భిస్తుంది! 


కేంద్ర హోంమంత్రి అమిత్ షా సేవలను కొనియాడిన చంద్రబాబు, ఆయన వినూత్న ఆలోచనల వల్ల దేశంలో శాంతి భద్రతలు మెరుగయ్యాయని తెలిపారు. అమిత్ షా కష్టపడే తీరు చూసి తనకు అసూయ కలుగుతుందని హాస్యాస్పదంగా వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణంలో కూడా వినూత్న ఆలోచనలు కావాలని అమిత్ షా సూచించారని వెల్లడించారు.
ఎన్డీఆర్ఎఫ్ విజయానికి, కేంద్రం మార్గదర్శకంతో పోలవరం ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. విశాఖ ఉక్కుకు రూ.11,440 కోట్ల ఆర్థిక సహాయం కేంద్రం అందించిందని, అలాగే ప్రధాని మోదీ రైల్వే జోన్‌కు శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుకు కూడా కేంద్రం మద్దతు అవసరమని చంద్రబాబు తెలిపారు.


ఇంకా చదవండినామినేటెడ్ పదవులకు రెండు కేటగిరీలుగా విభజన - తాజా లిస్టువేతనాలు ఫిక్స్ - మరో కీలక నిర్ణయం!

 
అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


రేషన్ కార్డుల జారీపై ప్రభుత్వ నుంచి బిగ్ అప్‌డేట్! ఇలా కూడా అప్లై చేసుకోవచ్చు!

 

వైసీపీకి మరో బిగ్ షాక్! బీజేపీ లోకి జంప్ అయిన కీలక నేత!

 

ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్పై టీడీపీ అధిష్ఠానం ఫైర్..! విషయం ఇదే..!

 

ఏపీకి మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు! దేశంలోనే తొలి ప్రైవేట్ వెహికల్ పార్క్! 1200 ఎకరాల్లో!

 

ఆ విషయంలో కేంద్రనిదే చారిత్రాత్మకమైన నిర్ణయం! విశాఖ స్టీల్ ప్లాంట్ కొత్త దశలోకి! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #andhrapravasi #andhrapradesh #APCM #CBN #NDRF #todaynews #flashnews #latestupdate