ఏపీ లో భూముల రిసర్వే మళ్ళీ షురూ! ఎప్పటి నుంచి ఆంటే? కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం!

Header Banner

ఏపీ లో భూముల రిసర్వే మళ్ళీ షురూ! ఎప్పటి నుంచి ఆంటే? కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం!

  Sun Jan 19, 2025 18:57        Politics

ఏపీ లో భూముల రిసర్వే మళ్ళీ షురూ అయింది. ప్రతి మండలంలోనూ ఎంపిక చేసిన ఒక గ్రామంలోనూ ప్రభుత్వ భూముల్ని కొలుస్తున్నారు. జనవరి 10వ తేదీ నుంచే ఈ ప్రక్రియ నడుస్తోది. ఇక ఈనెల 20వ తేదీ నుంచి ప్రైవేట్, వ్యవసాయ భూములను కొలువనున్నారు. రాష్ట్రంలో భూముల రీ సర్వే మళ్లీ మొదలైంది. జనవరి 10వ తేదీ నుంచి సర్కార్ భూముల లెక్కలను తీస్తున్నారు. పక్కాగా కొలుస్తూ రికార్డు చేస్తున్నారు. ఇందుకోసం ప్రతి మండలంలోనూ ఎంపిక చేసిన ఒక గ్రామాన్ని ఎంచుకున్నారు. అయితే ఇక రేపట్నుంచి(జనవరి 20) ప్రైవేట్, వ్యవసాయ భూములకు కొలతలు వేయనున్నారు. ఈ మేరకు రెవెన్యూ యంత్రాంగం రంగం సిద్ధం చేసింది.
భూముల రీసర్వేకు సిద్ధమైన నేపథ్యంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి కీలక ప్రకటన చేశారు. భూ యజమానుల సమక్షంలోనే రీసర్వే చేస్తామని స్పష్టం చేశారు. హద్దుల విషయంలో సరైన స్పష్టత ఇస్తామని చెప్పారు. యజమానులు భూమి వద్దకు వచ్చి హద్దులు చూపించేందుకు 3 సార్లు అవకాశం కల్పిస్తామని వెల్లడించారు. కొలుతల సమయంలో యజమాని రాకుంటే... వీడియో కాల్ ద్వారా ప్రక్రియను పూర్తి చేస్తామని క్లారిటీ ఇచ్చారు. ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూప్ల ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సమాచారం అందజేస్తామని వివరించారు.


ఇంకా చదవండిరోజూ ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌లో వీటిని తినండి! రోజంత‌టికీ కావ‌ల్సిన శ‌క్తి ల‌భిస్తుంది! 


గత వైసీపీ ప్రభుత్వ హయాంలోనే ఏపీలో భూముల రీసర్వే చేపట్టారు. అయితే ఇందులో అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయని కూటమి ప్రభుత్వం చెబుతోంది. వీటిని సరి చేసేందుకే భూములను రీసర్వే చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. అయితే ప్రస్తుతం జరగబోయే సర్వేకు సంబంధించిన ముఖ్య వివరాలు ఇక్కడ చూడండి...
ఏపీలో భూముల రీసర్వే - 10 ముఖ్యమైన అంశాలు
1. వైసీపీ ప్రభుత్వంలో రీసర్వే చేయగా అనేక లోపాలు ఉన్నాయని కూటమి ప్రభుత్వం గుర్తించింది. గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి... దరఖాస్తులను స్వీకరించింది.
2. రెవెన్యూ సదస్సుల్లో లక్షా 80 వేలకు పైగా ఫిర్యాదులు వచ్చాయని ఏపీ ప్రభుత్వం తెలిపింది. ముఖ్యంగా 22-ఎ జాబితాలో అక్రమంగా ప్రజల భూములను చేర్చారని గుర్తించింది. ఈ లోపాలన్నింటిని సరి చేసేందుకు పకడ్బందీగా భూముల రీసర్వే చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.


ఇంకా చదవండినామినేటెడ్ పదవులకు రెండు కేటగిరీలుగా విభజన - తాజా లిస్టువేతనాలు ఫిక్స్ - మరో కీలక నిర్ణయం!


3. ముందుగా ప్రభుత్వ భూములను కొలిచేందుకు జనవరి 10వ తేదీ నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని ప్రతి మండలంలోనూ ఎంపిక చేసిన ఒక గ్రామాన్ని ఎంచుకున్నారు. ఈ గ్రామాల్లో సర్వే నడుస్తోంది.
4. జనవరి 20వ తేదీ నుంచి ప్రైవేట్, వ్యవసాయ భూముల్లో రీసర్వే చేపడుతారు. ప్రతి మండలంలో ఎంపిక చేసిన గ్రామంలో పైలట్ ప్రాజెక్టు కింద రీ-సర్వే ప్రారంభిస్తారు.
5. గ్రామాన్ని బ్లాకులుగా విభజించి రీసర్వే కార్యక్రమాన్ని చేపట్టనుంది. ప్రతి బ్లాక్ లో 250 ఎకరాలకు మించుకుండా చర్యలు చేపట్టనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు.
6. ప్రతి బ్లాక్కు ఇద్దరు సర్వేయర్లు, వీఆర్వో, ఒక వీఆర్ఎ ఉంటారు. ఈ బృందం సర్వే నంబర్ల ఆధారంగా భూముల యజమానులతో వాట్సప్ గ్రూప్ క్రియేట్ చేయనుంది. ఈ గ్రూప్ ల ద్వారా ఎప్పకికప్పుడు సమాచారం అందిస్తారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


7. భూ యజమానుల సమక్షంలోనే రీ-సర్వే చేయనున్నారు. ఇదే విషయాన్ని మంత్రి అనగాని వెల్లడించారు. హద్దుల గుర్తింపు విషయంలో జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు. భూ యజమాని ఫీల్డ్ వద్దకు రాకపోతే... వీడియో కాల్ ద్వారా హద్దులు చూపించే అవకాశం ఉండనుంది.
8. గతంలో నిర్వహించిన సర్వేలో ఏకపక్షంగా సర్వే చేశారని..అనేక తప్పులు దొర్లాయని.. అలాంటి పరిస్థితి ప్రస్తుత సర్వేలో ఉండొద్దని అధికారులకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలను ఇచ్చింది.
9. గతంలో జరిపిన రీసర్వే ఫిర్యాదులను పరిష్కరించాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. వాటన్నింటినీ కూడా పరిష్కరించి కొత్త పాస్ పుస్తకాలు ఇవ్వనుంది.
10. గతంలో మాదిరిగా కాకుండా పాస్ బుక్ రూపం కూడా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పాస్ పుస్తకంపై రాజముద్రతోపాటు క్యూర్ కోడ్ ఉండనుంది.


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

రేషన్ కార్డుల జారీపై ప్రభుత్వ నుంచి బిగ్ అప్‌డేట్! ఇలా కూడా అప్లై చేసుకోవచ్చు!

 

వైసీపీకి మరో బిగ్ షాక్! బీజేపీ లోకి జంప్ అయిన కీలక నేత!

 

ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్పై టీడీపీ అధిష్ఠానం ఫైర్..! విషయం ఇదే..!

 

ఏపీకి మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు! దేశంలోనే తొలి ప్రైవేట్ వెహికల్ పార్క్! 1200 ఎకరాల్లో!

 

ఆ విషయంలో కేంద్రనిదే చారిత్రాత్మకమైన నిర్ణయం! విశాఖ స్టీల్ ప్లాంట్ కొత్త దశలోకి! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #andhrapravasi #APlands #Resurvey #pasbooks #todaynews #flashnews #latestupdate