సరస్వతి పవర్ ప్లాంట్ భూములపై అధికారులు కీలక నిర్ణయం! అసైన్డ్ ల్యాండ్స్ రిజిస్ట్రేషన్ రద్దు!

Header Banner

సరస్వతి పవర్ ప్లాంట్ భూములపై అధికారులు కీలక నిర్ణయం! అసైన్డ్ ల్యాండ్స్ రిజిస్ట్రేషన్ రద్దు!

  Wed Jan 22, 2025 20:49        Others

సరస్వతి భూముల్లో అసైన్డ్ ల్యాండ్స్ ఉన్నాయన్న అధికారుల నివేదికతో కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.. సరస్వతి పవర్ ప్లాంట్ కు కేటాయించిన అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్ రద్దు చేసింది.. పలనాడు ప్రాంతంలో సరస్వతి పవర్ ప్లాంట్స్ కు కేటాయించిన భూముల్లో 24.85 ఎకరాల అసైన్డ్ ల్యాండ్స్ ఉన్నట్లు గుర్తించింది అధికార యంత్రాంగం.. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, అసైన్డ్ ల్యాండ్స్ కేటాయింపును రద్దు చేశారు.. ఆ భూములను వెనక్కి తీసుకోవాలని అధికారులు ఆదేశించారు.. దీంతో సరస్వతి భూముల్లో నుండి 24.85 ఎకరాలను వెనక్కి తీసుకుంటూ, ఆ భూముల రిజిస్ట్రేషన్ లను రద్దు చేశారు అధికారులు. పల్నాడు జిల్లాలో సరస్వతి పవర్ ప్లాంట్స్ కు కేటాయించిన 24.84 ఎకరాల అసైన్ ల్యాండ్స్ రిజిస్ట్రేషన్ ను రద్దు చేసింది ప్రభుత్వం..


ఇంకా చదవండినామినేటెడ్ పదవులకు రెండు కేటగిరీలుగా విభజన - తాజా లిస్టువేతనాలు ఫిక్స్ - మరో కీలక నిర్ణయం!


చెన్నయపాలెం, వేమవరం, పిన్నెల్లి, తంగెడ గ్రామాల్లో మొత్తం 1,250 ఎకరాలను రైతు నుండి కొనుగోలు చేసింది సరస్వతీ పవర్ ప్లాంట్ యాజమాన్యం. అయితే, అప్పటినుండి ఆ భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేయలేదన్న ఆరోపణలు స్థానికుల నుండి వినిపించాయి. ఇదే భూముల్లో అటవీ శాఖ భూములు కూడా ఉన్నాయన్న వివాదం ఉండటంతో, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా ఈ ప్రాంతంలో పర్యటించారు.. ఆ తర్వాత మరింత లోతుగా దర్యాప్తు చేయాలని డిప్యూటీ సీఎం ఆదేశాలతో అధికార యంత్రాంగం సరస్వతి పవర్ ప్లాంట్స్ భూములపై సర్వే చేసింది.. అయితే, ఈ భూముల్లో అటవీ భూములు తేలలేదు.. కానీ, అసైన్డ్ ల్యాండ్స్ మాత్రం బయటపడ్డాయి. గత నవంబర్ లో అసైన్డ్ లైన్స్ కు సంబంధించిన వ్యవహారంపై సర్వే నిర్వహించారు, రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు..



అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 



అయితే, ఇందులో భాగంగా వేమవరం పిన్నెల్లి గ్రామాల్లో 24.84 ఎకరాల అసైన్డ్ ల్యాండ్ ఉన్నట్లు గుర్తించారు.. వేమవరంలో 20 ఎకరాలు, పిన్నిలిలో 4.84 సెంట్లు అసైన్డ్ భూములు ఉన్నాయని గుర్తించారు అధికారులు. దీంతో, ఈ భూముల రిజిస్ట్రేషన్ ను రద్దు కోరుతూ ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చారు. ఈ నేపథ్యంలో పల్నాడు జిల్లా కలెక్టర్, అరుణ్ బాబు, సరస్వతీ పవర్ ప్లాంట్స్ కు రిజిస్టర్ అయిన అసైన్డ్ ల్యాండ్ ల రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు, బుధవారం పిడుగురాళ్ల ఇంచార్జ్ సబ్ రిజిస్టర్ సురేష్ బాబు.. సరస్వతి పవర్ ప్లాంట్స్ భూమిలోని అసైన్డ్ ల్యాండ్స్ రిజిస్ట్రేషన్ లను రద్దు చేశారు………


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

ఆదివారం ఆ రంగు డ్రెస్ నాకు డేంజర్.. ఓసారి అలా.. బాల‌కృష్ణ‌ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు!

  

వైసీపీకి షాక్.. మాజీ ఎమ్మెల్యే పై కేసు నమోదు! 15 రోజుల క్రితం..

 

ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీ! ఒకేసారి 27 మంది.. ఫుల్ డీటెయిల్స్ ఇవిగో!

 

దావోస్ లో ఎన్నారై టీడీపీ సభ్యులతో చంద్రబాబులోకేష్ మీట్ అండ్ గ్రీట్! 20 దేశాల నుంచి... ఆనందంలో ఎన్నారైలు!

 

నారా లోకేష్ డిప్యూటీ సిఎం పదవి డిమాండ్ల పై క్లారిటీ ఇచ్చిన టీడీపీ అధిష్ఠానం! కీలక ఆదేశాలు జారీ!

 

టాలీవుడ్ కి గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు! సినీ కార్మికులకు ఇళ్ల స్థలాలపై కీలక నిర్ణయం! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #saraswathi #lands #government #todaynews #assignedlands #flashnews #latestupdate