తిరుపతి తొక్కిసలాట ఘటనపై జ్యుడిషియల్ విచారణ! రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో!

Header Banner

తిరుపతి తొక్కిసలాట ఘటనపై జ్యుడిషియల్ విచారణ! రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో!

  Wed Jan 22, 2025 22:15        Others

వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ సందర్భంగా తిరుపతిలో జరిగిన తొక్కిసలాటకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జ్యూడిషియల్ విచారణకు కమిషన్ ను నియమించింది. రిటైర్డ్ జడ్జి సత్యనారాయణ మూర్తి నేతృత్వంలో జ్యూడిషియల్ విచారణ జరగనుంది తిరుపతి పద్మావతి పార్క్ దగ్గర ఈ నెల 8న జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు చనిపోయారు.. వైకుంఠ ఏకాదశి దర్శన టోకెన్లు ఇచ్చే విషయంలో తొక్కిసలాట జరిగింది.. సీఎం చంద్రబాబు ఈ సంఘటనలో సీరియస్ అయ్యారు.. కొంతమంది అధికారుల బదిలీ కూడా జరిగింది.


ఇంకా చదవండినామినేటెడ్ పదవులకు రెండు కేటగిరీలుగా విభజన - తాజా లిస్టువేతనాలు ఫిక్స్ - మరో కీలక నిర్ణయం!


తొక్కిసలాట సంఘటనకు సంబంధించి ప్రభుత్వం జ్యూడిషియల్ విచారణకు నిర్ణయం తీసుకుంది.. భవిష్యత్ లో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి..? ఈ ఘటనకు కారణాలు ఏంటి..? బాధ్యతా రాహిత్యంగా ఎవరు ఉన్నారు..? అనేది విచారణలో తేలనుంది.. ఆరు నెలల కాలంలో విచారణ నిర్వహించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలి. తిరుమల తిరుపతి అంశంపై ఇప్పటికే అనేక రకాలుగా చర్చ జరుగుతోంది. దీంతో తొక్కిసలాట తర్వాత మరింత చర్చనీయాంశంగా టీటీడీ మారింది.. జ్యూడిషియల్ విచారణ తర్వాత ఎలాంటి విషయాలు బయటకు వస్తాయో చూడాలి.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 


కాగా, ఈ నెల 8న తిరుపతిలో వైకుంఠ ఏకాదశి దర్శనం టోకెన్ల జారీ కోసం జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మరణించిన ఘటన తీవ్ర కలకలం రేపుతుండగా.. ఈ ఘటనపై జ్యూడీషియల్ విచారణకు ఆదేశించింది ప్రభుత్వం.. ఏపీ హైకోర్టు రిటైర్డ్ జడ్జి ఎం.సత్యనారాయణ మూర్తి నేతృత్వంలో జ్యుడిషియల్ విచారణ జరగనుంది.. ఆరు నెలల్లో విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం పేర్కొంది.. విచారణ జరిపేందుకు అన్ని రకాల అధికారాలను కమిషన్ కు ఇచ్చింది ప్రభుత్వం. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు సీఎస్ విజయానంద్..


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు


ఆదివారం ఆ రంగు డ్రెస్ నాకు డేంజర్.. ఓసారి అలా.. బాల‌కృష్ణ‌ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు!

  

వైసీపీకి షాక్.. మాజీ ఎమ్మెల్యే పై కేసు నమోదు! 15 రోజుల క్రితం..

 

ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీ! ఒకేసారి 27 మంది.. ఫుల్ డీటెయిల్స్ ఇవిగో!

 

దావోస్ లో ఎన్నారై టీడీపీ సభ్యులతో చంద్రబాబులోకేష్ మీట్ అండ్ గ్రీట్! 20 దేశాల నుంచి... ఆనందంలో ఎన్నారైలు!

 

నారా లోకేష్ డిప్యూటీ సిఎం పదవి డిమాండ్ల పై క్లారిటీ ఇచ్చిన టీడీపీ అధిష్ఠానం! కీలక ఆదేశాలు జారీ!

 

టాలీవుడ్ కి గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు! సినీ కార్మికులకు ఇళ్ల స్థలాలపై కీలక నిర్ణయం! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #thirupathi #vaikunta #entrance #tickets #todaynews #flashnews #latestupdate