ఏపీని వర్షాల విషయంలో వదల బొమ్మాలీ అంటున్న బంగాళాఖాతం! ఆ జిల్లాల వారు జాగ్రత్త!

Header Banner

ఏపీని వర్షాల విషయంలో వదల బొమ్మాలీ అంటున్న బంగాళాఖాతం! ఆ జిల్లాల వారు జాగ్రత్త!

  Thu Oct 31, 2024 16:49        Environment

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని వర్షాలు వీడటం లేదు. నిత్యం రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాలలో వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. నిన్న నైరుతి బంగాళాఖాతం, ఏపీ దక్షిణ తీరంలో ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం కూడా కొనసాగుతుందని ఐఎండి పేర్కొంది. ఇది సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల మధ్య ఇది విస్తరించి ఉన్నట్టుగా భారత వాతావరణ శాఖ వెల్లడించింది.బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉత్తర దక్షిణ కోస్తా ప్రాంతంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇక రాయలసీమలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. కొన్నిచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. వర్షాలు పడే ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

 

ఇంకా చదవండి: చంద్రబాబు విజయనగరం జిల్లా పర్యటనలో మార్పు! ఎందుకో తెలుసా..?

 

రాష్ట్రవ్యాప్తంగా ప్రతిరోజు అనేకచోట్ల వర్ష ప్రభావం ఉంటుంది. ప్రస్తుతం మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు అల్లూరి సీతారామరాజు జిల్లా, గుంటూరు జిల్లా, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్య సాయి, చిత్తూరు, తిరుపతి, వైయస్సార్, అన్నమయ్య జిల్లాలలోని కొన్ని ప్రాంతాలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినట్టు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. వర్షాలు పడే ప్రాంతాలలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శీతాకాలం వచ్చిన తర్వాత కూడా వరుసగా బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనాల కారణంగా వర్షాలు కురుస్తున్నాయి. నిన్న తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం సూర్యారావుపేట గ్రామంలో కురిసిన వర్షాలతో పాటు పిడుగు పడటంతో పిడుగుపాటుకు బాణాసంచా తయారీ కర్మాగారంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. పదిమంది గాయపడ్డారు. గాయపడిన వారిని తణుకు ఆసుపత్రిలో చేర్పించే చికిత్స అందిస్తున్నారు.

ఇంకా చదవండి: ఆమెకు ఆ అరబి కుటుంబం దేవుడుతో సమానం! పొగడ్తల తో ముంచేత్తుతున్న తెలుగు ఆడ పడుచు! ఇంతకీ ఆమెకు ఏమి జరిగిందంటే! 14

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఈరోజే నామినేటెడ్ పోస్టుల రెండవ లిస్టు విడుదల? టీటీడీ చైర్మన్ ఆయనేనా?

 

పోలీసుల వేషంలో కిడ్నాప్ డ్రామా...చంపుతామని బెదిరింపు! వాహన తనిఖీలో నిందితులు అరెస్ట్!

 

మద్యంపై చేసే ఖర్చులో తెలుగు రాష్ట్రాలే టాప్! సంవత్సరానికి ఎంతో తెలుసా?

 

ఏపీలో మందుబాబులకు వెరైటీ ఆఫర్! ఒక బాటిల్ కొంటే అవి ఫ్రీ!

 

గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ నియామక వివాదం! ఫోన్ సంభాషణ సోషల్ మీడియాలో హల్ చల్!

 

విభజన తర్వాత ఢిల్లీలో కొత్త ఏపీ భవన్ నిర్మాణానికి పచ్చ జెండా! నవంబర్ లోపు గుత్తేదారులకు ఆహ్వానం!

 

ఈ-చలాన్‌ పేరుతో కొత్త స్కామ్‌! ఒక్క క్లిక్ తో బ్యాంక్ అకౌంటు ఖాళీ! హెచ్చరికలు జారీ చేసిన కేంద్రం!

 

పార్లమెంట్ ఉభయసభలు ప్రత్యేక సమావేశం! ఎప్పుడు - ఎందుకు?

 

"ప్రజా వేదిక" కార్యక్రమంలో ఈరోజు పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! మీ కోసం!

 

ఉచిత గ్యాస్ సిలిండర్ స్కీమ్‌పై మరో కీలక అప్‌డేట్! 24 గంటల్లో గ్యాస్ సిలిండర్లు డెలివరీ! వాళ్లు డబ్బులు కట్టాల్సిందే!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Rain #AndhraPradesh #APSDMA #Weather