తిరుమలలో నూతన కౌంటర్ ప్రారంభం! ఇకపై మరింత సులభంగా దర్శనం టికెట్లు!
Wed Nov 13, 2024 13:43 Devotionalతిరుమలలో ఇచ్చే ఆఫ్ లైన్ శ్రీవాణి దర్శన టికెట్ల కేటాయింపు ప్రక్రియను మరింత సులభతరం చేసినట్లు టీటీడీ అడిషనల్ ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి తెలియజేశారు. గోకులం సమావేశ మందిరం వెనుక వైపు శ్రీవాణి దర్శన టికెట్ల నూతన కౌంటర్ ను ఆయన బుధవారం ఉదయం ప్రారంభించారు. కౌంటర్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్వయంగా భక్తుల వద్ద వివరాలు తీసుకుని మొదటి టికెట్ ను కేటాయించారు.
ఇంకా చదవండి: ఆమెకు ఆ అరబి కుటుంబం దేవుడుతో సమానం! పొగడ్తల తో ముంచేత్తుతున్న తెలుగు ఆడ పడుచు! ఇంతకీ ఆమెకు ఏమి జరిగిందంటే! 14
ఈ సందర్భంగా అడిషనల్ ఈఓ మీడియాతో మాట్లాడుతూ గతంలో ఉన్న శ్రీవాణి కౌంటర్ క్యూలైన్లలో వర్షం పడినప్పుడు భక్తులు ఇబ్బంది పడటాన్ని గుర్తించి ప్రత్యేక కౌంటర్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శ్రీవాణి భక్తులు ఇకపై ఎలాంటి అసౌకర్యం కలగకుండా టికెట్లు పొందవచ్చని పేర్కొన్నారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
రోజుకు 900 టికెట్లను ఆఫ్ లైన్ ద్వారా కేటాయిస్తున్నట్లు తెలిపారు. గతంలో టికెట్ కేటాయింపునకు మూడు నుండి నాలుగు నిమిషాలు పట్టేదనీ, ప్రస్తుతం ఒక నిమిషంలో భక్తులకు టికెట్ కేటాయించేలా అప్లికేషన్లో మార్పులు చేసినట్లు పేర్కొన్నారు. ఐదు కౌంటర్ల ద్వారా భక్తులు సులభతరంగా టికెట్లు కొనుగోలు చేయవచ్చని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ సీఈ శ్రీ సత్య నారాయణ, డిప్యూటీ ఈవో శ్రీ రాజేంద్ర, వీజీవో శ్రీ సురేంద్ర, ఏఈవో శ్రీ కృష్ణయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
గుడ్‌న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం.. నవంబర్ 22న ప్రారంభం! అస్సలు మిస్ అవకండి - డబ్బులే డబ్బులు!
మూడవ విడత నామి నేటెడ్ పోస్టులు విడుదల! ఆ లిస్ట్ మీకోసం! ఒక్కో కార్పొరేషన్‌కు 15 మంది!
అసెంబ్లీ భోజనంపై స్పీకర్ అయ్యన్నపాత్రుడి తీవ్ర ఆగ్రహం! పద్ధతి మార్చుకోవాలంటూ హెచ్చరిక!
"ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! ఎవరో తెలుసా.?
APSRTC మరో శుభవార్త.. నిరుద్యోగులకు అదిరిపోయే అవకాశం ఇది! ఎలాంటి రాత పరీక్ష లేకుండానే!
లెక్క తేలుస్తాం.. పవన్ కళ్యాణ్ సీరియస్ వార్నింగ్! మామూలుగా లేదు!
రూ.2.94 లక్షల కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్! రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం!
ఏపీలో రూ.40వేల కోట్లతో టాటాపవర్ ప్రాజెక్టులు! 10వేల ఉద్యోగాలతో ఐటీ డెవలప్మెంట్ సెంటర్!
మూడవ నామినేటెడ్ పోస్టుల లిస్ట్ విడుదల? ఏ ఏ పదవులు అంటే!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #Devotional #Tirumala #TTD #Tirupati
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.