సింగపూర్: తెలంగాణ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో ! శ్రీ రాముడి అక్షింతల కోసం భారీ గా తరలి వచ్చిన భక్తులు!

Header Banner

సింగపూర్: తెలంగాణ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో ! శ్రీ రాముడి అక్షింతల కోసం భారీ గా తరలి వచ్చిన భక్తులు!

  Wed Jan 24, 2024 09:45        Associations, Singapore

సింగపూర్: తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ (TCSS) వారు భారత దేశం నుండి ప్రత్యేకంగా తెప్పించిన అయోధ్య శ్రీ రాముల వారి ప్రాణ ప్రతిష్ట అక్షింతలు సింగపూర్ లో నివసిసిస్తున్న భక్తులకు అందజేసే శుభకార్యాన్ని సరిగ్గా ప్రాణప్రతిష్ట రోజైన జనవరి 22న చాంగి విలేజ్ లో ఉన్న శ్రీ రాముని గుడి లో, రాముల వారి సన్నిధిలో ఎంతో కన్నుల పండుగ గా నిర్వహించింది. ఈ పవిత్రమైన కార్యక్రమం అక్కడి దేవాలయాల్లో నిర్వహించే అవకాశం దక్కడం సొసైటీ కి దక్కిన పుణ్యం అని సొసైటీ సభ్యులు తెలిపారు. ఈ పవిత్ర కార్యంలో స్థానిక భక్తులందరూ భక్తిశ్రద్ధలతో రామ నామ స్మరణ చేస్తూ ఈ కార్యక్రమం లో పాల్గొని ప్రసాదం తో పాటు అక్షింతలు స్వీకరించి శ్రీ రాముని పూజ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం అంతా జై శ్రీ రామ్ నామస్వరణ తో మారుమ్రోగింది.

 

ఈ వేడుకల్లో చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరు శ్రీ రామును సేవలో భక్తి తో పరవశించి పోయారు. ఈ మహోత్సవము లో సుమారు 1000 మంది వరకు భక్తులు పాల్గొని అయోధ్య శ్రీరామ పవిత్ర అక్షింతలను స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ ఈ పవిత్ర కార్యక్రమాన్ని సింగపూర్ లో నిర్వహించిన తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ వారి కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపి అభినందించడం జరిగింది. దీంతో పాటు సొసైటీ స్థాపన నుండి ఎలాంటి ఆడంబరాలకు పోకుండా మరియు లాభాపేక్ష లేకుండా విభిన్న కార్యక్రమాలు నిర్వహిస్తున్న సొసైటీ ని స్థానికులు అభినందించారు.

 

ఇరు తెలుగు రాష్ట్రాల తెలుగు వారి తో పాటు ఇతర భక్తులు పెద్ద ఎత్తున శ్రీ రాముని సేవలో పాల్గొని విజయవంతంగా జరగడానికి తోడ్పడిన మరియు సహాయ సహకారాలు అందించిన దాతలు ప్రతి ఒక్కరికి పేరు పేరున TCSS సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.

 

ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి సొసైటీ అధ్యక్షులు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి మరియు కోశాధికారి జూలూరి సంతోష్ కుమార్, సొసైటీ ఉపాధ్యక్షులు దుర్గ ప్రసాద్, భాస్కర్ గుప్త నల్ల, గోనె నరేందర్ రెడ్డి, ఉపాధ్యక్షురాలు మిర్యాల సునీత రెడ్డి, సంస్థాగత కార్యదర్శి, కాసర్ల శ్రీనివాస రావు, ప్రాంతీయ కార్యదర్శులు బొందుగుల రాము, నంగునూరి వెంకట రమణ, నడికట్ల భాస్కర్, రవి కృష్ణ విజాపూర్ మరియు కార్యవర్గ సభ్యులు రోజా రమణి, రాధికా రెడ్డి నల్లా, శివ ప్రసాద్ ఆవుల, పెరుకు శివ రామ్ ప్రసాద్, రవి చైతన్య మైసా, భాస్కర్ రావు, సంతోష్ వర్మ మాదారపు, శశిధర్ రెడ్డి, విజయ మోహన్ వెంగళ, ప్రవీణ్ మామిదాల, సతీష్ పెసరు, మణికంఠ రెడ్డి మొదలగు వారు భక్తులందరికీ ధన్యవాదాలు తెలిపారు.

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

భారతదేశం నుండి ఈ పవిత్ర అక్షింతలను సింగపూర్ తేవడంలో ముఖ్య భూమిక పోషించిన గోనె నరేందర్ రెడ్డి గారికి సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా శ్రీ రామర్ ఆలయ అధికారులు మాట్లాడుతూ ఈ పుణ్య కార్యక్రమం ఈ ఆలయం లో నిర్వహించడం ఎన్నో జన్మల పుణ్యఫలం అన్నారు.

 

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group





   #AndhraPravasi #Singapore #SIngaporeCountry #SingaporeNews #SingaporeUpdates #SingaporePassport #TeluguMigrants #IndianMigrants #AndhraMigrants #Migrants #TelanganaMigrants