సొంత భార్యే జానీ మాస్టర్‌ను అరెస్ట్ చేయించారా.? సంచలన విషయాలు వెలుగులోకి!

Header Banner

సొంత భార్యే జానీ మాస్టర్‌ను అరెస్ట్ చేయించారా.? సంచలన విషయాలు వెలుగులోకి!

  Fri Sep 20, 2024 09:58        Entertainment

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్పై లైంగిక వేధింపుల కేసు నమోదైన సంగతి తెలిసిందే. తన దగ్గర పని చేస్తోన్న అసిస్టెంట్ డ్యాన్స్ మాస్టర్‌పై జానీ అత్యాచారానికి పాల్పడ్డారు. దీనికి సంబంధించి యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు జానీ మాస్టర్‌పై జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. 2017లో 'ఢీ' షోలో జానీ మాస్టర్ తనకు పరిచయమైనట్లు తెలిపింది. ఆ తర్వాత తనకు సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి జానీ మాస్టర్ తనని హైదరాబాద్‌కు పిలిపించారని తెలిపింది. 2019లో జానీ మాస్టర్ టీంలో జాయిన్ అయినట్లు బాధిత యువతి పేర్కొంది. ఓ షో కోసం జానీ మాస్టర్తో పాటు మరో ఇద్దరితో కలిసి తాను ముంబైకి వెళ్లానని, ఆ సమయంలో ముంబైలోని హోటల్లో తనపై జానీ మాస్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడని యువతి తన ఎఫ్ఐఆర్ కాపీలో చెప్పుకొచ్చింది. ఈ విషయాన్ని బయటికి ఎవరికీ చెప్పవద్దని జానీ మాస్టర్ బెదిరించినట్లు వాపోయింది. అదే విధంగా షూటింగ్ సమయంలో అతను చెప్పినట్లుగా వినకపోతే అసభ్యంగా ప్రవర్తించేవాడని ఆవేదన వ్యక్తం చేసింది. తనపై పలుమార్లు జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, మతం మార్చుకొని తనని పెళ్లి చేసుకోవాలని బలవంతం చేశాడని ఎఫ్ఐఆర్ లో యువతి ఫిర్యాదు చేసింది.

 

ఇంకా చదవండి: రూ.98 లక్షలు పోగొట్టుకున్నాను.. కాదంబరి కిరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు! ఎలాగో తెలుసా?

 

యువతి ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు జానీ మాస్టర్పై అత్యాచారం కేసు నమోదు చేశారు. 376,506,323 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే జానీ మాస్టర్ గత మూడు రోజులుగా పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్నారు.దీంతో జానీ మాస్టర్ కోసం నాలుగు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. తాజాగా జానీ మాస్టర్‌ను గోవాలో అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. అయితే జానీ అరెస్ట్ వెనుక అతని భార్య హస్తం ఉందనే వార్తలు తెర మీదకు వస్తున్నాయి. ఈ రోజు సడన్‌గా జానీ మాస్టర్ భార్య అయేషా నార్సింగి పోలీస్ స్టేషన్‌లో దర్శనం ఇచ్చారు. భర్త ఆచూకీ తెలపాలని పోలీసులు కోరడంతో జానీ మాస్టర్ ఎక్కడ ఉన్నది చెప్పినట్లు తెలుస్తుంది. దీంతో ప్రత్యేక బృందం గోవాలో డ్యాన్స్ మాస్టర్ జానీని అదుపులోకి తీసుకుంది. ఆయన భార్య సమాచారం ఇవ్వడంతోనే ఆయన్ను పట్టుకోగలిగారు పోలీసులు. మరి కొన్ని గంటల్లో జానీని నార్సింగ్ పోలీస్ స్టేషన్‌కి తీసుకురానున్నారు. అనంతరం కోర్టులో హాజరు పరిచే అవకాశాలున్నాయి.

ఇంకా చదవండి: గల్ఫ్ లో ఏజెంట్ మాయమాటలు విని మోసపోయిన తెలంగాణ యువతి! కఠినమైన చట్టాలు లేకనే! ప్రభుత్వ సహాయం కోసం! 9

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఉండేదెవరు..? పోయేదెవరు..? జిల్లాల వారీగా నేతలతో జగన్ వరుస భేటీలు! మరికొందరు నేతలు కూడా పక్కచూపులు!

 

ఏపీ స్కూళ్లకు దసరా సెలవుల ప్రకటన! ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే..?

 

నిరుద్యోగులకు ప్రభుత్వం వరం.. ఉచితంగా నెలకు 3 వేలు! ప్రభుత్వం కీలక నిర్ణయం!

 

పవన్ తో భేటీ తర్వాత బాలినేని సంచలన వ్యాఖ్యలు! వైసీపీకి వార్నింగ్ - కూటమికీ ముందస్తుగా!

 

వీసా గొడవ లేదు! పాస్‌ పోర్ట్‌ ఉంటే చాలు.. మూడు గంటల జర్నీ! ఈ దేశానికి పోటెత్తుతున్న భారతీయ టూరిస్టులు!

 

ఏపీ ఎక్కడ బాగుపడిపోతుందా అన్న దిగులు మొదలైంది సైకోకి! సంతోషించాల్సిన సమయంలో జగన్ ఏడుపు!

 

కూటమి ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు హెచ్చరిక! దాని జోలికి వెళ్లొద్దు అని సూచన! ఎందుకంటే..!

 

నేటి నుంచి ఏపీలో ఫ్రీ ఇసుక - బుకింగ్ ఇలా..! అధికారులు నుంచి ఇసుక రవాణా!

 

వైసీపీకి భారీ షాకులు తప్పడం లేదు! బాలినేనితో పాటు జనసేనలో చేరనున్న మరో జగన్ సన్నిహితుడు?

 

మరో పథకానికి పేరు మార్చిన ఏపీ ప్రభుత్వం! జగన్ హయాంలో పథకాలకు! మరో కీలక నిర్ణయం!

 

ఏపీ మహిళలకు చంద్రబాబు గుడ్ న్యూస్! ఆరోజు నుంచే ఉచిత గ్యాస్ సిలిండర్లు!

 

కుటుంబంలో 18 ఏళ్లలోపు పిల్లలు ఉన్నవారికి శుభవార్త! రేపే ప్రారంభం! ఇది అన్ని ఆర్థిక నేపథ్యాల కుటుంబాలకు అందుబాటులో!

 

బీఆర్ఎస్ కు హైకోర్టులో ఊహించని షాక్! పార్టీ ఆఫీసు కూల్చివేయాలని ఆదేశాలు జారీ!

 

కొత్త మద్యం పాలసీకి కేబినెట్ ఆమోదం! బీసీల రిజర్వేషన్ పై కీలక చర్చ!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #JohnnyMaster #Tollywood #Telangana #Police