టాలీవుడ్ లో హల్ చల్.. నోటి దూల ఎక్కువై అలా మాట్లాడాను.. న‌న్ను క్ష‌మించండి! హీరోయిన్ పై దర్శకుడు నక్కిన వ్యాఖ్యలు..

Header Banner

టాలీవుడ్ లో హల్ చల్.. నోటి దూల ఎక్కువై అలా మాట్లాడాను.. న‌న్ను క్ష‌మించండి! హీరోయిన్ పై దర్శకుడు నక్కిన వ్యాఖ్యలు..

  Tue Jan 14, 2025 10:00        Entertainment

మన్మథుడు ఫేమ్ నటి అన్షుపై దర్శకుడు త్రినాథరావు నక్కిన చేసిన అనుచిత వ్యాఖ్యలు ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. మ‌జాకా సినిమా టీజ‌ర్ లాంచ్‌ ఈవెంట్‌లో అన్షును ఉద్దేశించి సైజులు పెంచాలి అంటూ అభ్యంత‌ర‌క‌ర వ్యాఖ్య‌లు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. త్రినాథ‌రావుపై నెటిజ‌న్లు ఓ రేంజ్‌లో విరుచుకుప‌డ్డారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న ఓ వీడియో రిలీజ్ చేశారు. ‘‘అన్షు, నా మాటల వల్ల బాధపడ్డ మహిళలందరికీ నా క్షమాపణలు తెలియజేస్తున్నా. నా ఉద్దేశం ఎవరిని బాధ కలిగించడం కాదు. తెలిసి చేసినా తెలియకుండా చేసినా తప్పు తప్పే. మీరంతా పెద్ద మనసు చేసుకొని నన్ను క్షమిస్తారని కోరుకుంటున్నా’’ అని అన్నారు. ఈ నెల 12న త్రినాథరావు ద‌ర్శ‌క‌త్వంలో మజాకా సినిమా తెరకెక్కింది. ఈ మూవీలో సందీప్‌ కిషన్‌ హీరోగా, రీతూ వర్మ హీరోయిన్‌గా నటించారు. రావు రమేశ్‌, అన్షు కీలక పాత్రలు పోషించారు. ఫిబ్రవరి 21న సినిమా విడుదల కానుంది. సంక్రాంతి పండగను పురస్కరించుకుని మజాకా టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ సినిమా టీజర్‌ విడుదల వేడుకలో త్రినాథ‌రావు మాట్లాడుతూ.. ‘‘హీరోయన్ అన్షు.. మేము ఎప్పుడో యంగ్‌స్టర్‌గా ఉన్నపుడు మన్మథుడు సినిమా చూసి ఏందిరా ఈ అమ్మాయి లడ్డూలా ఉంది అనుకున్నా, అప్పుడు.. ఆ అమ్మాయిని చూడటానికే మన్మథుడు సినిమాకి వెళ్లిపోయేవాళ్లం.

 

ఇంకా చదవండి: జగన్ వి పగటి కలలా లేక రాత్రి కలలా? వైసీపీ ఎందుకు ఖాళీ అవుతోందో ఇప్పుడు అర్థం అవుతుంది!

 

ఓ రేంజ్‌లో ఉండేదయ్యా బాబూ.. అలాంటి అమ్మాయి ఒక్కసారి ఈ సినిమాలో హీరోయిన్‌గా కళ్ల ముందు కనబడేసరికి ఇది నిజమేనా అనిపిస్తోంది. ఇప్పటికీ అలానే ఉందా..? కొంచెం సన్నబడింది.. తిని కొంచెం పెంచమ్మా. తెలుగుకి సరిపోదు.. అన్నీ కొంచెం ఎక్కువ సైజుల్లో ఉండాలని నేను చెప్పా. పర్వాలేదు కొంచెం ఇంప్రూ అయింది. నెక్ట్స్ టైమ్ ఇంకా బాగా ఇంప్రూ అవుద్ది..’’ అని త్రినాథ‌రావు అన్నారు. దీంతో ఈ వ్యాఖ్య‌ల‌పై తీవ్ర దుమారం రేగింది. ఈ వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో త్రినాథ‌రావు స్పందించారు. మహిళలందరికీ క్షమాపణలు చెబుతూ వీడియో విడుదల చేశారు. ఇదే ఈవెంట్‌లో త్రినాథ‌రావు అల్లు అర్జున్‌ను ఇమిటేట్ చేశాడు. కావాల‌నే రీతూ వ‌ర్మ పేరును మర్చిపోయిన‌ట్లు చేసి.. పేరు మ‌ర్చిపోయాను కొంచం మంచి నీరు ఇవ్వండి అని అన్నారు. అల్లు అర్జున్ పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయి.. వాటర్ బాటిల్ అడిగి కవర్ చేసి.. ఆ తరువాత పేరు చెబుతాడు. ఇక్కడ కూడా త్రినాథరావు తన రెండో హీరోయిన్ పేరు ఏంటి? అని కాస్త ఆలోచించి వాటర్ బాటిల్ అడిగి.. ఆ తరువాత రీతూ వర్మ అని చెప్పాడు. ఈ వీడియో కూడా సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అయ్యింది. దర్శకుడు త్రినాథరావు నక్కిన చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీసిన నేపథ్యంలో ఆయనకు మహిళా కమిషన్‌ నోటీసులు ఇవ్వనున్నట్టు సమాచారం. దర్శకుడు తన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని కోరుతూ ఛైర్‌పర్సన్‌ నేరెళ్ల శారద ఈ నోటీసులు జారీ చేయనున్నట్టు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల ద్వారా తెలిసింది.

 

ఇంకా చదవండి: పండగ వేళ ప్రజలకు గుడ్ న్యూస్.. కొత్త రేషన్ కార్డులపై బిగ్ అప్డేట్! దరఖాస్తూలకు డేట్ ఫిక్స్ చేసిన కూటమి?

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ ప్రభుత్వం వారికి మరో అదనపు సెలవు ప్రకటించింది! జీవో 73తో ఉద్యోగులకు రిలీఫ్!

 

అమెరికాలో కార్చిచ్చు వేళ అందినకాడికి దోచుకుంటున్న దొంగలు! 29 మంది అరెస్ట్‌!

 

ఏపీ కో-ఆపరేటివ్ బ్యాంక్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల! దరఖాస్తు వివరాలు తెలసుకోండి!

 

దొంగ నోట్ల కలకలం! నకిలీ రూ. 500 నోటును ఎలా గుర్తించాలి! ఇవి లేకపోతే నకిలీనే!

 

వందల నుంచి లక్షల వరకు బెట్టింగులు.. కోడి పందేల హవా నెక్స్ట్ లెవల్! పోలీసుల ఆంక్షలపై లైట్..!

 

వారెవ్వా.. జిల్లాలో కోడిపందెం గెలిస్తే 'మహీంద్రా థార్'.. సందడి రేంజిలో ఉంటుందో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Tollywood #Actress #Shraddhadas #Actressshraddha #Socialmedia #Relationship #Fakenews #Businessman #Marriage #Tollywoodheronie #FakeNewsLove