నిద్రలేమితో బాధపడుతున్నారా? అయితే ఈ 3-2-1 రూల్‌ ట్రై చేసి చూడండి!

Header Banner

నిద్రలేమితో బాధపడుతున్నారా? అయితే ఈ 3-2-1 రూల్‌ ట్రై చేసి చూడండి!

  Tue Nov 12, 2024 13:26        Life Style

ప్రతి రోజూ శరీరానికి తగినంత నిద్ర చాలా అవసరం. అయితే, మారుతున్న జీవనశైలి కారణంగా ప్రస్తుత కాలంలో చాలా మంది నిద్రలేమితో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కంప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్లకు తోడు ఓటీటీ రాక కూడా ఇందుకు ఓ కారణం అని చెప్పొచ్చు. చాలా మంది రోజులో ఎక్కువ సమయం వీటితోనే గడిపేస్తున్నారు. ఫలితంగా ఎన్నో అనారోగ్య సమస్యలనూ ఎదుర్కోవాల్సి వస్తోంది. సరిగ్గా నిద్ర లేక రోజంతా యాక్టీవ్‌గా ఉండలేకపోతున్నారు. అంతే కాకుండా తమ పనిపై కూడా శ్రద్ధ పెట్టలేకపోతున్నారు.

 

రోజంతా శక్తివంతంగా ఉండటం కోసం రాత్రి సమయంలో ప్రశాంతంగా నిద్ర పోవడం చాలా ముఖ్యం. ఇది మన మెదడును రీఛార్జ్‌ చేస్తుంది. అంతేకాదు కంటికి, శరీరానికి కూడా ఎంతో విశ్రాంతిని ఇస్తుంది. సరిగ్గా నిద్రపోకపోతే చిరాకు, అలసట, విచారం కలుగుతుంది. తలనొప్పి, మానసిక ఒత్తిడి వంటి సమస్యలూ తలెత్తుతాయి. నిద్ర లేమి ఏకాగ్రతను దెబ్బతీస్తుంది. రోగనిరోధక శక్తి తగ్గుదల, గుండె జబ్బులు, మధుమేహం వంటి పరిస్థితులకు దారి తీస్తుంది. అందుకే కంటి నిండా నిద్ర చాలా ముఖ్యం. నిద్రలేమితో బాధపడుతున్న వారికి 3-2-1 రూల్‌ బాగా ఉపయోగపడుతుంది. 

 

ఏమిటీ 3-2-1 రూల్‌..?
3 – నిద్రపోడానికి మూడు గంటల ముందు ఆల్కహాల్‌ తీసుకోకూడదు
2 – నిద్రపోవడానికి 2 గంటల ముందు ఆహారాన్ని తినడం ఆపేయాలి.
1 – పడుకునే ఒక గంట ముందు డ్రింక్స్ తాగడం మానేయాలి 

 

ఇంకా చదవండిమూడవ నామినేటెడ్ పోస్టుల లిస్ట్ విడుదల? ఏ ఏ పదవులు అంటే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

ఇంకా చదవండి: APNRTS కు 30 కోట్లు కేటాయింపు.. సమన్వయకర్తల నియామకం! ఎన్నారైలకు రోజుకు 100 విఐపి తిరుమల దర్శనాలు! ఐకాన్ టవర్ 2027 కి పూర్తి.. సీఎం చంద్ర బాబు! 

 

నిద్రపోడానికి మూడు గంటల ముందు ఆల్కహాల్‌ తీసుకోకూడదు

ఆల్కహాల్ నిద్రను తీవ్ర ప్రభావితం చేస్తుంది. అందుకే పడుకునే మూడు గంటల ముందు వరకు ఆల్కహాల్ తీసుకోకూడదు. ఇలా చేయడం వల్ల నిద్రకు భంగం కలిగించే అవకాశాలు చాలా తగ్గుతాయి. అప్పుడు మీరు ప్రశాంతంగా నిద్రపోవచ్చు. 

 

రెండు గంటల ముందే ఆహారాన్ని తినడం ఆపేయాలి

నిద్రపోవడానికి 2 గంటల ముందే ఆహారాన్ని తినడం ఆపడం చాలా మంచిది. ఎందుకంటే తిన్న వెంటనే నిద్రపోతే జీర్ణవ్యవస్థలో అసౌకర్యం, యాసిడ్‌ రిఫ్లక్స్‌, బ్లడ్‌ షుగర్‌ పెరుగుదలకు దారి తీసే ప్రమాదం ఉంది. ఇది నిద్రకు తీవ్ర ఆటంకం కలిగిస్తుంది. పడుకునే మందు ఆహారాన్ని జీర్ణం చేసుకోవడానికి మన శరీరానికి తగిన సమయం ఇవ్వాలి. అలా చేయడం వల్ల చాలా రిలాక్స్‌డ్‌గా నిద్రపడుతుంది. 

 

పడుకునే ఒక గంట ముందు డ్రింక్స్ తాగడం మానేయాలి

పడుకునే ముందు మంచి నీళ్లు వంటి డ్రింక్స్‌ తీసుకోవడం వల్ల నిద్రకు తీవ్ర ఆటంకం కలుగుతుంది. అదెలా అంటారా..? ఉదాహరణకు పడుకునే ముందు మంచి నీళ్లు తాగారే అనుకోండి వాష్‌రూమ్‌కు వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. అందుకోసం ఏ అర్ధరాత్రో మనకు మెలుకువ వచ్చి మంచి నిద్రకు భంగం కలిగే ప్రమాదం ఉంటుంది. ఆ తర్వాత మళ్లీ నిద్రపోవడం కష్టతరంగా ఉంటుంది. ఎంతసేపటికీ నిద్ర పట్టదు. ఎలాగోలా నిద్రలోకి జారుకునేలోపే తెల్లవారిపోతుంది. అందుకే పడుకునే గంట ముందు ద్రవ పదార్థాలు తీసుకోకపోవడమే మంచిది.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

లెక్క తేలుస్తాం.. పవన్ కళ్యాణ్ సీరియస్ వార్నింగ్! మామూలుగా లేదు!

 

రూ.2.94 లక్షల కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్! రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం!

 

ఏపీలో రూ.40వేల కోట్లతో టాటాపవర్ ప్రాజెక్టులు! 10వేల ఉద్యోగాలతో ఐటీ డెవలప్మెంట్ సెంటర్!

 

"ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! ఇద్దరు చీఫ్ గెస్ట్ లు - ఎవరు అంటే!

 

గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు! మహిళల ఖాతాల్లో రూ 1500 జమ పై ప్రభుత్వం కీలక నిర్ణయం!

 

ముంబయి నటి కేసులో కీలక నిందితుడు వైకాపా నేత సీఐడీ కస్టడీకి! విచారణలో కొత్త మలుపు! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #LifeStyle #Health #Sleep #SleepSchedule