ఇంట్లో బల్లులు ఎక్కువగా తిరుగుతున్నాయా? అయితే ఈ టిప్స్‌ పాటించండి!

Header Banner

ఇంట్లో బల్లులు ఎక్కువగా తిరుగుతున్నాయా? అయితే ఈ టిప్స్‌ పాటించండి!

  Tue Jan 07, 2025 11:22        Life Style

ఇంట్లో బల్లులు తిరుగుతుంటే ఇరిటేషన్‌గా ఉందా.. ఇంట్లో బల్లులు తిరుగుతుంటే కొందరికి ఒల్లు జలదరిస్తుంది. అవి వంటల్లో ఎక్కడ పడుతాయోనని కొందరు భయాందోళనకు గురవుతుంటారు. ఈ సమస్యకు చెక్‌ పెట్టాలంటే కొన్ని చిన్నచిన్న టిప్స్‌ పాటిస్తే సరిపోతుంది. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం, బల్లులకు పడని పదార్థాలను ఇంట్లో ఉంచడం ద్వారా సమస్యకు చెక్‌ పెట్టవచ్చు. మరి బల్లికి పడని ఆ పదార్థాలేమిటో, పాటించాల్సిన టిప్స్‌ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

 

1. పరిశుభ్రత
బల్లులు ఊరికెనే ఇంట్లోకి రావు. మీ ఇంట్లో ఆహారం దొరికితేనే అవి ఇంట్లో దూరుతాయి. చెత్తాచెదారంతో అపరిశుభ్రంగా ఉన్న ఇల్లు బల్లిని ఆహ్వానిస్తుంది. కాబట్టి బల్లులు రావద్దంటే ఇంటిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. 

 

2. నిమ్మ
నిమ్మ లాంటి సిట్రస్‌ జాతి మొక్కల వాసన కేవలం బల్లులే కాదు, ఏ పురుగులకు కూడా పడదు. సిట్రస్ పండ్లను, ఆకులను బల్లులు, పురుగులు అసహ్యించుకుంటాయి. కాబట్టి నిమ్మకాయ ముక్కలనుగానీ, నిమ్మ ఆకులనుగానీ బల్లులు తిరిగేచోట పెడితే అవి రాకుండా ఉంటాయి. అంతేగాక నిమ్మగడ్డిని కాల్చి ఆ పొగ ఇల్లు మొత్తం వ్యాపించేలా చేస్తే కూడా బల్లులు దరిచేరవు. 

 

ఇంకా చదవండినామినేటెడ్ పదవులు సంక్రాంతి నుండి? భారీ సంఖ్యలో ఆశా వాదులు! అన్ని అంశాలలో ముందంజలో ఉన్న వారికే! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

3. కర్పూరం
కర్పూరం వాసన కూడా బల్లులకు అస్సలు పడదు. కర్పూరం వాసన వాటికి ఎలర్జీ ఫీల్‌ను ఇస్తుందట. అందుకే కర్పూరానికి దూరంగా ఉంటాయట. కాబట్టి ఇంట్లో అక్కడక్కడ కర్పూరం బిళ్లలు పెడితే బల్లులు దెబ్బకు పారిపోతాయి.

 

4. చల్లదనం
బల్లులు చల్లదనాన్ని భరించలేవు. ఇవి ఎక్కువగా వేడిగా ఉండే ప్రదేశాల్లో ఉండటానికే ఇష్టపడుతాయి. వేడిగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా చల్లబడితే బల్లులు తట్టుకోలేవు. కాబట్టి ఇంట్లో అప్పుడప్పుడు ఏసీని పెంచండి. దాంతో బల్లులు కనిపించకుండా పోతాయి. లేదంటే ఓ స్ప్రే బాటిల్‌లో చల్లటి నీళ్లు తీసుకుని వాటిపై స్ప్రే చేసినా బల్లులు పారిపోతాయి. 

 

మరికొన్ని చిట్కాలు
పెప్పర్ స్ప్రే మంటను కూడా బల్లులు తట్టుకోలేవట. కాబట్టి పెప్పర్‌ స్ప్రేను చల్లడం ద్వారా బల్లుల సమస్యకు చెక్‌ పెట్టవచ్చు. కాఫీ, తంబాకు మిక్సింగ్‌ వాసన కూడా బల్లులకు పడదు. కాబట్టి వాటి మిశ్రమం వాసన చూపిస్తే బల్లులు పారిపోతాయట. ఆపిల్ సైడర్ వెనిగర్ వాసన కూడా బల్లులకు పడదు. కాబట్టి ఆపిల్‌ సైడర్‌ వెనిగర్‌ను స్ప్రే చేస్తే బల్లులు పరారవుతాయి. 

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

దిక్కుతోచని పరిస్థితిలో జగన్.. విశాఖ జిల్లాలో దారుణంగా వైసీపీ పరిస్థితి! అరడజను నియోజకవర్గాల్లో నేతలు కరువు! 

 

నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్.. ఏపీఎస్ఆర్టీసీ లో భారీ నియామకాలు, నోటిఫికేషన్ అప్పుడే.. వివరాలు ఇవిగో! 

 

రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి! 24 గంటల లోపు రైతుల ఖాతాలకు సొమ్ము జమ.. బాధ్యతలు విస్మరించిన గత ప్రభుత్వం! 

 

విజయవాడ - అమరావతి మెట్రో ప్రాజెక్టుపై అప్‌డేట్! మొత్తం 33 స్టేషన్లు.. ఆ వివరాలు మీ కోసం! 

 

ఈ నెలలో సమావేశం కానున్న ఏపీ క్యాబినెట్! 14 కీలక అంశాలపై చర్చ.. వాటికి గ్రీన్ సిగ్నల్! 

 

అమెరికా హెచ్ బీ వీసాల్లో భారతీయుల జోరు! ప్రతీ ఐదుగురిలో ఒకరు భారత్ నుంచే! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #LifeStyle #Lizards #House #Home #Clean