సంక్రాంతి పండుగ షాపింగ్ చేస్తున్నారా? ఈ టిప్స్ పాటిస్తే బోలెడంత ఆదా చేయవచ్చు!

Header Banner

సంక్రాంతి పండుగ షాపింగ్ చేస్తున్నారా? ఈ టిప్స్ పాటిస్తే బోలెడంత ఆదా చేయవచ్చు!

  Fri Jan 10, 2025 20:00        Life Style

సంక్రాంతి పండుగకు షాపింగ్ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే. పండుగ షాపింగ్‌లో కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా బోలెడంత డబ్బు ఆదా చేసుకోవడమే కాదు, మోసపోకుండా చూసుకోవచ్చు. మరి ఈ సంక్రాంతి సమయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో తెలుసుకుందాం. 

 

భారతీయ సంస్కృతి, సంప్రదాయాల్లో ఎన్నో పండగలు ఉన్నాయి. అతిపెద్ద పండుగల్లో మకర సంక్రాంతి ఒకటి. దక్షిణ భారతంలో ఈ పండుగను పెద్ద ఎత్తున నిర్వహిస్తుంటారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పేరుతో సంక్రాంతి జరుపుకొంటారు. సాధారణంగా పండుగ వస్తుందంటే ముందుగే గుర్తొచ్చేది షాపింగ్. పండుగకు కావాల్సిన వస్తువలతో పాటు కొత్త బట్టలు కొనుగోలు చేస్తుంటారు. ఈ సందర్భంలో షాపింగ్ పెద్ద ఎత్తున చేస్తుంటారు. అయితే, కొన్నిసార్లు మోసపోయే ప్రమాదం ఉంటుంది. పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తుంది. అందుకే పండుగ షాపింగ్ చేసే ముందే కొన్ని జాగ్రత్తలు పాటిస్తే డబ్బు ఆదా చేసుకోవచ్చు. మోసపోకుండా చూసుకోవచ్చు.

 

ముందుగా ఈ పండుగకు షాపింగ్ ఎంత చేయాలనుకున్నారో, ఏమేం కొనాలనుకున్నారో ఓ జాబితాను సిద్ధం చేసుకోవాలి. ఆ లిస్ట్ ప్రకారమే మీ బడ్జెట్‌లోనే కావాల్సిన వస్తువులు కొనుగోలు చేయాలి. అవసరమైన వాటికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి కదా అని అవసరం లేని వస్తువులను కొనుగోలు చేయవద్దు. షాపింగ్ మాల్స్‌కి వెళ్లినప్పుడు ఒక వస్తువు కొనాలనుకుని నాలుగైదు వస్తువులు తెస్తుంటారు. ఇలా చేయడం వల్ల ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది.

 

ఇంకా చదవండినామినేటెడ్ పదవులు సంక్రాంతి నుండి? భారీ సంఖ్యలో ఆశా వాదులు! అన్ని అంశాలలో ముందంజలో ఉన్న వారికే! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

కొంత రీసెర్చ్ చేసి తక్కువ బడ్జెట్‌లో లభించే నాణ్యమైన వస్తువులనే కొనుగోలు చేసేలా ప్లాన్ చేసుకోవాలి. మీరు అనుకున్న బడ్జెట్‌లో వచ్చేలా చూసుకోవాలి. కొందరు పండుగల ఆఫర్లలో ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు కొంటుంటారు. ఆ హడావుడిలో రేటింగ్, నాణ్యతను మర్పిపోకుండా జాగ్రత్త పడాలి. నాణ్యమైన వస్తువులనే కొనాలి. తమ పక్కింటి వారు, బంధువుల ఇళ్లల్లో ఉన్న వస్తువులు మన ఇంట్లో కూడా ఉండాలని చాలా మంది పండుగల సమయంలో అవసరం లేకున్నా కొనుగోలు చేస్తారు. దీంతో బడ్జెట్ ఎక్కువై అప్పులు చేయాల్సి వస్తుంది.

 

పండుగ సీజన్లలో డిజిటల్ పేమెంట్ సంస్థలు ఆఫర్లు ప్రకటిస్తాయి. డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులపై ప్రత్యేక డిస్కౌంట్లు, ఆఫర్లూ ఇస్తాయి. వాటిని విశ్లేషించి తమకు కావాల్సిన వస్తువులు, దుస్తులకు వర్తించే షాపుల్లో కొనుగోలు చేయాలి. పండుగ బడ్జెట్‌కు మించి ఖర్చులు ఎదురైతే అత్యవసర ఖర్చుల కోసం దాచుకున్న డబ్బుల కోసం వినియోగించడం సరైన నిర్ణయం కాదు. దానికి బధులుగా కొనుగోలు చేయడం వాయిదా వేసుకోవడం ఉత్తమం. కొందరు క్రెడిట్ కార్డు ఉంది కదా అని అవసరానికి మంచి కొంటుంటారు. దీంతో బిల్లు తలకు మించిన భారంగా మారుతుంది. ఆ తర్వాత భారీగా వడ్డీలు, పెనాల్టీలు కట్టాల్సి వస్తుంది. క్రెడిట్ కార్డును జాగ్రత్తగా ఉపయోగిస్తే దాంతో సైతం బోలెడంతా ఆదా చేసుకోవచ్చు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నిరుద్యోగులకు గుడ్ న్యూస్... హెల్త్ శాఖ భారీ నోటిఫికేషన్ విడుదల! ఎగ్జామ్ లేకుండా ఎంపిక!

 

తిరుపతి ఘటన ప్రమాదమా... కుట్రా.. మంత్రి కీలక వ్యాఖ్యలు! కారకులు ఏ స్థాయిలో..

 

రఘురామ కృష్ణంరాజు పై టార్చర్ కేసులో సంచలనం! కీలక నిందితుడు అరెస్ట్!

 

పేర్ని నాని కుటుంబం రేషన్ బియ్యం మాయం కేసులో సంచలనం! కోర్టులో పోలీసుల కీలక పిటిషన్!

 

కొనసాగుతున్న పెన్షన్ల వేరిఫికేషన్... ఆ తర్వాతే తొలగింపు! వేలాది మందిపై కీలక దర్యాప్తు!

 

విద్యార్థులకు సూపర్ న్యూస్.. ఇంటర్‌లో కీలక సంస్కరణలకు ప్రతిపాదనలు.. ఇది మంచి నిర్ణయం! సలహాలుసూచనలకు బోర్డు ఆహ్వానం!

 

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం! సంక్రాంతికి స్టార్ట్! పిఠాపురంలో డిప్యూటీ సీఎం చేతుల మీదుగా! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Business #Shopping #Sankranti #Festival