ఖ‌రీదైన చికిత్స‌లు అవ‌స‌రం లేదు! ఈ చిట్కాల‌ను పాటిస్తే మొటిమ‌లు మాయం!

Header Banner

ఖ‌రీదైన చికిత్స‌లు అవ‌స‌రం లేదు! ఈ చిట్కాల‌ను పాటిస్తే మొటిమ‌లు మాయం!

  Tue Jan 21, 2025 20:55        Health

ప్ర‌స్తుత త‌రుణంలో అందంగా క‌నిపించాల‌ని కేవ‌లం స్త్రీలే కాదు.. పురుషులు కూడా కోరుకుంటున్నారు. అందుక‌నే వారి కోసం అనేక బ్యూటీ పార్ల‌ర్లు కూడా వెలుస్తున్నాయి. ముఖం అందంగా క‌నిపించాల‌ని చాలా మంది ఆశిస్తున్నారు. అందుక‌నే ఖ‌రీదైన చికిత్స‌లు తీసుకోవ‌డం, క్రీముటు గ‌ట్రా రాయ‌డం చేస్తున్నారు. అయితే ప‌లు స‌హ‌జ‌సిద్ధ‌మైన ఇంటి చిట్కాల‌ను పాటిస్తే ముఖాన్ని అందంగా క‌నిపించేలా చేయ‌వ‌చ్చు. దీంతోపాటు ముఖంపై ఉండే మొటిమ‌లు, మచ్చ‌లు కూడా పోతాయి. ఇంద‌కు ఖ‌రీదైన చికిత్స‌ల‌ను ఉప‌యోగించాల్సిన ప‌నిలేదు. మ‌న‌కు అందుబాటులో ఉన్న పదార్థాల‌తోనే ప‌లు మిశ్ర‌మాల‌ను త‌యారు చేసి వాడ‌డం వ‌ల్ల ముఖంపై ఏర్ప‌డే మొటిమ‌లు, మ‌చ్చ‌లు పోతాయి. ముఖం అందంగా మారి కాంతివంతంగా క‌నిపిస్తుంది. ఇక ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

 

టీ ట్రీ ఆయిల్‌..
ముఖంపై ఉండే మొటిమ‌ల‌ను త‌గ్గించ‌డంతోపాటు ముఖాన్ని అందంగా, కాంతివంతంగా మార్చ‌డంలో టీ ట్రీ ఆయిల్ ఎంత‌గానో ప‌నిచేస్తుంది. ఇందులో యాంటీ బ్యాక్టీరియ‌ల్‌, యాంటీ వైర‌ల్ గుణాలు ఉంటాయి. ఇవి ముఖాన్ని కాంతివంతంగా మారుస్తాయి. ఒక కాట‌న్ బాల్‌ను టీ ట్రీ ఆయిల్‌లో ముంచి మొటిమ‌ల‌పై రాస్తుండాలి. రాత్రి పూట ఇలా చేసి మ‌రుస‌టి రోజు ఉదయాన్నే ముఖాన్ని క‌డిగేయాలి. ఇలా చేస్తుంటే మొటిమ‌లు త‌గ్గి ముఖం కాంతివంతంగా మారుతుంది. అలాగే మొటిమ‌ల‌ను త‌గ్గించ‌డంలో తేనె కూడా అద్భుతంగానే ప‌నిచేస్తుంది. తేనెలో యాంటీ మైక్రోబియ‌ల్ ల‌క్ష‌ణాలు ఉంటాయి. ఇవి మొటిమ‌ల‌ను, వాటి వ‌ల్ల క‌లిగే ఎరుపు ద‌నాన్ని, వాపుల‌ను త‌గ్గిస్తాయి. కొద్ది తేనె తీసుకుని అందులో దాల్చిన చెక్క పొడిని క‌లిపి పేస్ట్ లా చేసి ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి రాత్రి పూట రాయాలి. మ‌రుస‌టి రోజు క‌డిగేయాలి. ఇలా చేస్తే మొటిమ‌లు త‌గ్గుతాయి. ముఖం అందంగా మారుతుంది.

 

ఇంకా చదవండిబిగ్ అలర్ట్.. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. అలా చేయకుంటే పెన్షన్ రద్దు?

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

క‌ల‌బంద గుజ్జు..
మ‌న ఇంటి పెర‌ట్లో ఉండే క‌ల‌బంద కూడా మొటిమ‌ల‌ను త‌గ్గించ‌డంలో అద్భుతంగా ప‌నిచేస్తుంది. క‌ల‌బంద గుజ్జులో యాంటీ బ్యాక్టీరియ‌ల్‌, యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ గుణాలు ఉంటాయి. ఇవి వాపుల‌ను త‌గ్గిస్తాయి. మృత చ‌ర్మ క‌ణాల‌ను తొల‌గించి ఉన్న క‌ణాల‌కు మ‌రమ్మ‌త్తులు చేస్తాయి. దీంతో మొటిమ‌లు త‌గ్గిపోతాయి. క‌ల‌బంద గుజ్జును నేరుగా మొటిమ‌ల‌పై రాయ‌వ‌చ్చు. త‌ర‌చూ రాస్తుంటే మొటిమ‌లు త‌గ్గిపోతాయి. ముఖం కాంతివంతంగా మారుతుంది. మొటిమ‌ల‌ను త‌గ్గించేందుకు ఓట్ మీల్ కూడా ఎంత‌గానో ప‌నిచేస్తుంది. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ గుణాలు ఉంటాయి. ఓట్ మీల్‌ను ముఖానికి ప‌ట్టించి 15 నుంచి 20 నిమిషాలు ఆగాలి. త‌రువాత క‌డిగేయాలి. త‌ర‌చూ ఇలా చేస్తుంటే ముఖంపై ఉండే దుర‌ద పోతుంది. మొటిమ‌ల స‌మ‌స్య నుంచి విముక్తి ల‌భిస్తుంది.

 

గ్రీన్ టీ..
గ్రీన్ టీ పొడిని నీటిలో వేసి మ‌రిగించి ఆ ఆకుల‌ను మొటిమ‌ల‌పై రాస్తుండాలి. దీంతో కూడా మొటిమ‌ల స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. అదేవిధంగా రాత్రిపూట ప‌సుపును పేస్ట్‌లా చేసి ముఖానికి రాసి మ‌రుస‌టి రోజు ఉద‌యం క‌డిగేస్తుండాలి. ప‌సుపులో యాంటీ మైక్రోబియ‌ల్‌, యాంటీ బ్యాక్టీరియ‌ల్ గుణాలు ఉంటాయి. ఇవి మొటిమ‌ల‌ను త‌గ్గించ‌డంలో అద్భుతంగా ప‌నిచేస్తాయి. అలాగే శ‌న‌గ‌పిండి కూడా మొటిమ‌ల‌ను త‌గ్గించి ముఖానికి కాంతిని అందిస్తుంది. ఇందులో తేనెను క‌లిపి ఉప‌యోగించ‌వ‌చ్చు. ఇలా ప‌లు ర‌కాల చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల ముఖంపై ఉండే మొటిమ‌లు త‌గ్గిపోతాయి. ముఖం కాంతివంతంగా మారి అందంగా క‌నిపిస్తుంది.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
ఆదివారం ఆ రంగు డ్రెస్ నాకు డేంజర్.. ఓసారి అలా.. బాల‌కృష్ణ‌ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు!

  

వైసీపీకి షాక్.. మాజీ ఎమ్మెల్యే పై కేసు నమోదు! 15 రోజుల క్రితం..

 

ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీ! ఒకేసారి 27 మంది.. ఫుల్ డీటెయిల్స్ ఇవిగో!

 

దావోస్ లో ఎన్నారై టీడీపీ సభ్యులతో చంద్రబాబులోకేష్ మీట్ అండ్ గ్రీట్! 20 దేశాల నుంచి... ఆనందంలో ఎన్నారైలు!

 

నారా లోకేష్ డిప్యూటీ సిఎం పదవి డిమాండ్ల పై క్లారిటీ ఇచ్చిన టీడీపీ అధిష్ఠానం! కీలక ఆదేశాలు జారీ!

 

టాలీవుడ్ కి గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు! సినీ కార్మికులకు ఇళ్ల స్థలాలపై కీలక నిర్ణయం! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Health #Pimples #Face #Beauty