కాలిఫోర్నియాలో 7.0 తీవ్రతతో భారీ భూకంపం! పశ్చిమ తీరంలో సునామీ హెచ్చరికలు జారీ!

Header Banner

కాలిఫోర్నియాలో 7.0 తీవ్రతతో భారీ భూకంపం! పశ్చిమ తీరంలో సునామీ హెచ్చరికలు జారీ!

  Fri Dec 06, 2024 11:10        U S A

అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాలో భారీ భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్‌పై దాని తీవ్రత 7.0గా నమోదయింది. గురువారం ఉదయం 10.44 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) ఫెర్న్‌డేల్‌కు నైరుతి దిశగా 100 కిలోమీటర్ల దూరంలో కేప్ మెండోసినో తీరంలో భూమి కంపించింది. పెట్రోలియా, స్కాటియా, కాబ్‌ తదితర ప్రాంతాల్లోనూ భూకంపం సంభవించినట్టు అమెరికా జియోలాజికల్ సర్వే (USGS) తెలిపింది. ఉత్తర కాలిఫోర్నియా తీరానికి సమీపంలో భూకంప కేంద్రం 6 కిలోమీటర్ల లోతులో ఉన్నట్టు వెల్లడించింది. అమెరికా పశ్చిమ తీరంలో సునామీ హెచ్చరికలు జారీ చేశారారు. భూకంప కేంద్రం నుంచి 300 కిలోమీటర్ల తీరం పొడవునా సునామీ వచ్చే అవకాశం ఉందని హోనొలులులోని సునామీ హెచ్చరికల కేంద్రం హెచ్చరించింది. అయితే కాసేపటికి హెచ్చరికలను ఉపసంహరించుకున్నది.

 

ఇంకా చదవండిరైతుల ఆందోళనపై కలెక్టర్ తో మాట్లాడిన సీఎం! నష్టపోకుండా చూస్తామని హామీ.. 

 

ఇంకా చదవండిఏపీలో కూటమి ప్రభుత్వం మరో కీలక ప్రకటన! నామినేటెడ్ పోస్టుల మరో జాబితా సిద్దం - దక్కేది వీరికే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

కాగా, భూ ప్రకంపనలు శాన్‌ఫ్రాన్సిస్కో వరకు వ్యాపించాయి. కొన్ని సెకన్ల పాటు భూమి కంపించినట్లు ప్రజలు తెలిపారు. శాన్‌ఫ్రాన్సిస్కో బే ఏరియా రాపిడ్ ట్రాన్సిట్ (BART) ముందుజాగ్రత్తగా నీటి అడుగున సొరంగం నుంచి ట్రాఫిక్‌ను నిలిపివేసింది. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఆళ్ల నాని టీడీపీలోకి ఎంట్రీ పై చంద్రబాబు క్లారిటీ! పలువురు వైసీపీ నేతలు కూటమి పార్టీలోకి!

 

నేడు (6/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు! మంత్రి లోకేశ్ సమక్షంలో గూగుల్ తో కీలక ఒప్పందం!

 

బీఆర్ఎస్‌కు ఊహించని షాక్! కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే!

 

గుడ్ న్యూస్.. ఏపిలో కొత్తగా 53 కళాశాలలు! ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం! 37 మండలాల్లో 47, 2 పట్టణ ప్రాంతాల్లో.. 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 

 


   #AndhraPravasi #USA #USANews #America #TeluguMigrants #TeluguPeople #IndianMigrants