అమెరికా ఆకాశంలో ప్రకాశవంతమైన వస్తువుల కలకలం! ట్రంప్ భవనాల వద్ద రహస్య చలనం!

Header Banner

అమెరికా ఆకాశంలో ప్రకాశవంతమైన వస్తువుల కలకలం! ట్రంప్ భవనాల వద్ద రహస్య చలనం!

  Sun Dec 08, 2024 16:32        U S A

అగ్రరాజ్యం అమెరికాలోని ఆకాశంలో ప్రకాశవంతమైన వస్తువులు కలకలం సృష్టిస్తున్నాయి. న్యూజెర్సీలోని (New Jersey) పలు ప్రాంతాల్లో రాత్రి వేళ ఆకాశంలో అనుమానాస్పదంగా ఈ వస్తువులు కనిపించాయి. దీంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. అవి యూఎఫ్వో (UFO) తరహా డ్రోన్లుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ మేరకు స్థానిక మీడియా కథనాలు ప్రచురించింది. ఇటీవల న్యూజెర్సీలో ప్రకాశవంతమైన డ్రోన్లు ఎగిరాయి. తమ భవనాల మీదుగా ఇవి ఎగరడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్గా మారాయి. దీంతో అవి హెలికాఫ్టర్లు అని కొందరు చెబుతుండగా.. యూఎఫ్వో తరహా డ్రోన్లుగా మరికొందరు అనుమానిస్తున్నారు.
అయితే.. గత నెలలో న్యూజెర్సీలోని పలు ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలే చోటు చేసుకున్నాయి. దాదాపు పది ప్రాంతాల్లో డ్రోన్లు ఎగరడాన్ని స్థానికులు గుర్తించారు. అంతేకాకుండా అదే సమయంలో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారీ విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్కు సంబంధించిన భవనాల సమీపంలోనూ ఇలాంటి డ్రోన్లు కనిపించడంతో ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ స్పందించింది. ఈ ప్రాంతంలో డ్రోన్ కార్యకలాపాలపై నిషేధం విధించింది. న్యూజెర్సీలో తాజా ఘటనపై స్పందించిన గవర్నర్ ఫిల్ మర్ఫీ.. దీనిపై అధికారులు విచారణ చేపడుతున్నారని, ప్రజలకు ఎలాంటి ముప్పు లేదని పేర్కొన్నారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి




మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:



బాపట్ల హైస్కూల్లో 
'టగ్ ఆఫ్ వార్ఆడిన చంద్రబాబునారా లోకేశ్! గెలిచింది ఎవరో తెలుసా?

 

ఏపీకి మరోమారు భారీ వర్షాల ముప్పు.. బంగాళాఖాతంలో అల్పపీడనం! ఆ జిల్లాలకు రెడ్ అలెర్ట్!

 

ఏపీకి మరోమారు భారీ వర్షాల ముప్పు.. బంగాళాఖాతంలో అల్పపీడనం! ఆ జిల్లాలకు రెడ్ అలెర్ట్!

 

ఏపీ ప్రజలకు ముఖ్యమైన వార్త.. ప్రభుత్వం నిన్నటి నుంచి రోజులపాటూ! అవన్నీ ఉచితంగా పొందండి!

 

నేడు (7/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

జగన్ కి షాక్.. విజయసాయిరెడ్డిపై క్రిమినల్ కేసు! ఎవరు పెట్టారు అంటే?

 

నెల్లూరులో అలా చేసే వారికి కఠిన చర్యలు తప్పవు! మంత్రి కీలక వ్యాఖ్యలు!

 

ఉచిత గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తున్నారా! ఇది తప్పక తెలుసుకోండి - లేదంటే.. ప్రమాదమే!

 

కొడాలికి మరో బిగ్ షాక్...14 రోజుల రిమాండ్ - నెల్లూరు సబ్​జైలుకు తరలింపు! అసలేం జరిగిదంటే!

 

ఆళ్ల నాని టీడీపీలోకి ఎంట్రీ పై చంద్రబాబు క్లారిటీ! పలువురు వైసీపీ నేతలు కూటమి పార్టీలోకి!

 

నేడు (6/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు! మంత్రి లోకేశ్ సమక్షంలో గూగుల్ తో కీలక ఒప్పందం!

 

బీఆర్ఎస్‌కు ఊహించని షాక్! కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #andhrapravasi #america #newjersey #secretedrones #trump #todaynews #ufo #helicofter #todaynews #flashnews #latestupdate