భారతీయ గ్రీన్ కార్డ్ దరఖాస్తు దారులకు ట్రంప్ బిగ్ రిలీఫ్! అదేంటో తెలుసా?
Sun Jan 26, 2025 14:08 U S Aఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టాక వరుస షాకులు ఎదుర్కొంటున్న భారతీయులకు ఇవాళ ఓ శుభవార్త అందింది. ముఖ్యంగా ఇమ్మిగ్రేషన్ విధానంలో మార్పులతో అమెరికాలో ఉంటామో, వెళ్లిపోతామో తెలియక అల్లాడుతున్న వారికి ట్రంప్ సర్కార్ ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా భారతీయులకు ఇది వర్తించబోతోంది. భారతీయ గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారులకు ఈ నిర్ణయం ఊరటనివ్వబోతోంది.
అమెరికా పౌరసత్వ, వలస సేవల విభాగం ఇవాళ కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాలో చట్టబద్ధమైన శాశ్వత నివాసితులు కావడానికి దరఖాస్తు చేసుకునే వ్యక్తులకు కోవిడ్ 19 టీకా తప్పనిసరిగా తీసుకోవాలన్న నిబంధనను రద్దు చేసింది. దీన్ని ఉపసంహరించుకుంటున్నట్లు వెల్లడించింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారులు ఇకపై ఫారమ్ I-693, ఇమ్మిగ్రేషన్ మెడికల్ ఎగ్జామినేషన్ రిపోర్ట్, వ్యాక్సినేషన్ రికార్డ్‌లో కోవిడ్ 19 టీకా రుజువు సమర్పించాల్సిన అవసరం లేదని తెలిపింది.
ఇంకా చదవండి: విజయసాయిరెడ్డి రాజీనామాపై స్పందించిన వైసీపీ అధిష్టానం! సంచలన వ్యాఖ్యలు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
యూఎస్ సీఐఎస్ ఇకపై కోవిడ్ 19 టీకా పత్రం ఆధారంగా గ్రీన్ కార్డు దారులకు వాటి దరఖాస్తులు తిరస్కరించడానికి లేదా ఆధారాలు కోరడానికి నోటీసులు జారీ చేయరాదని నిర్ణయించింది. కోవిడ్ వ్యాక్సిన్‌కు సంబంధించిన రుజువు లేదనే కారణంగా మాత్రమే గ్రీన్ కార్డు దరఖాస్తులు తిరస్కరించకూడదని నిర్ణయం తీసుకుంది. గతంలో 2021లో కరోనా సమయంలో అప్పటి అధ్యక్షుడు జో బైడెన్ ఇలా గ్రీన్ కార్డ్ దరఖాస్తులకు కోవిడ్ 19 వ్యాక్సినేషన్ తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు బైడెన్ నిర్ణయాలన్నీ మార్చేస్తున్న కొత్త అధ్యక్షుడు ట్రంప్ దీన్ని కూడా రద్దు చేశారు.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
మూడో మేనిఫెస్టో విడుదల చేసిన అమిత్ షా! 62 వేల గ్రూపుల సలహాలు, సూచనలు..
విజయసాయిరెడ్డి రాజీనామాపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు! పార్టీ పరిస్థితి కూడా..
ఈ విషయంలో భారతీయుల గుండెల్లో గుబులు! అమెరికా వద్దంటే.. ఈ దేశాలు రారమ్మంటున్నాయ్.. ఆ వివరాలు..
రైతులకు ప్రభుత్వం భారీ శుభవార్త! వారి అకౌంట్లలోకి రూ.53 వేలు జమ!
ఎమ్మెల్యే పై టమాటాలు, గుడ్లు విసిరిన జనం.. దీంతో గ్రామసభలో ఉద్రిక్తత!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #USA #USANews #America #TeluguMigrants #TeluguPeople #IndianMigrants
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.