హార్దిక్‌తో విడిపోకపోయినా ఇంకా మేం కుటుంబమే.. ! నటాషా స్టాంకోవిచ్ కీలక వ్యాఖ్యలు!
Sat Nov 09, 2024 18:50 Othersభారత స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్య నుంచి తాను విడిపోతున్నట్లు సంచలన ప్రకటన చేసినప్పటినుంచి సెర్బియా నటి నటాషా స్టాంకోవిచ్ వార్తల్లో నిలుస్తోంది. భారత్‌ను వదిలి సెర్బియా వెళ్లిపోయిందని సోషల్ మీడియాలో వార్తలూ వచ్చాయి. అయితే, అవన్నీ వదంతులేనని నటాషా (Natasa Stankovic) కొట్టిపడేసింది. తన కుమారుడు ఇక్కడే స్కూల్‌కు వెళ్తున్నాడని.. అలాంటి సమయంలో సెర్బియాకు ఎందుకు వెళ్తానని ప్రశ్నించింది. గత జులైలో తామిద్దరం విడాకులు తీసుకుంటున్నట్లు నటాషా, హార్దిక్ ప్రకటించిన సంగతి తెలిసిందే. "నేను సెర్బియాకు వెళ్లిపోయినట్లు చాలా వార్తలు వచ్చాయి. నేనెందుకు వెళ్లిపోతాను? నాకు కుమారుడు ఉన్నాడు. అతడు పాఠశాలకు వెళ్తున్నాడు. కాబట్టే, సెర్బియాకు వెళ్లే అవకాశమే లేదు. అది ఎప్పటికీ జరగదు. హార్దిక్‌తో (Hardik Pandya) విడిపోయినా.. ఇప్పటికీ మేమంతా కుటుంబసభ్యులుగానే ఉన్నాం. దానికి కారణం మా కుమారుడు. అతడి వల్లే ఓ ఫ్యామిలీగా కొనసాగుతున్నాం. నేను హార్దిక్‌తో కలిసి ఉండలేను కానీ, అగస్త్యకు మాత్రం ఇద్దరం పేరెంట్‌గా ఉంటాం. నేను సెర్బియాకు ప్రతి సంవత్సరం వెళ్తూనే ఉంటా. దాదాపు పదేళ్ల నుంచి ఇలానే జరుగుతోంది.
ఇంకా చదవండి: ఆమెకు ఆ అరబి కుటుంబం దేవుడుతో సమానం! పొగడ్తల తో ముంచేత్తుతున్న తెలుగు ఆడ పడుచు! ఇంతకీ ఆమెకు ఏమి జరిగిందంటే! 14
సింగిల్ పేరెంట్‌గా ఉన్న నేను నిరంతరం నేర్చుకుంటూనే ఉన్నా. వ్యక్తిగతంగా కుమారుడిని ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు కష్టపడుతూనే ఉంటా. అగస్త్యతో నా ప్రేమను పంచుకుంటూనే ఉన్నా. అతడిని సంతోషంగా ఉంచేందుకు అలానే చేయాల్సిఉందని అర్థమైంది. అతడికి తల్లిగా నా అవసరం ఉంది. మానసికంగా ఆరోగ్యంగా ఉంచేందుకు తపిస్తున్నా. నేనెప్పటికీ దిగజారిపోను. నన్నెవరూ టచ్ చేయలేరనేవిధంగా బలంగా నిలబడతా. బయట నుంచి (Haridk Natasa Divorse) ఎన్ని విమర్శలు, కామెంట్లు వచ్చినా పట్టించుకోను. నా మనసు ఎంత స్వచ్ఛంగా ఉందనేది నాకు తెలుసు. దానిని ఎవరూ కదపలేరు. తప్పకుండా గొప్ప స్థానానికి చేరుకొంటాననే నమ్మకం ఉంది. ఇప్పటివరకు నా జీవితంపై పశ్చాత్తాపంతో అస్సలు లేను. నా కుమారుడికి మరింత సమయం కేటాయిస్తా" అని నటాషా తెలిపింది.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీ ప్రజలకు గుడ్ చెప్పిన ఆరోగ్య శాఖ మంత్రి! ఇకపై ఆరోగ్య శ్రీ ద్వారా...
ఏపీ రైతులకు శుభవార్త! ఆ పంట వేసిన వారికి అదృష్టమే.. మంత్రి కీలక ప్రకటన!
న్యూజిలాండ్ పర్యటనలో ప్రధానితో తెదేపా ఎమ్మెల్యేల భేటీ! ఏపీ అభివృద్ధి అంశాలపై చర్చలు!
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోంమంత్రి అనిత భేటీ! ఫేక్ పోస్టులపై కఠిన చర్యలు!
టీడీపీ కార్యాలయంలో ప్రజావేదిక! 08-11-2024 న పాల్గొననున్న మంత్రులు, నాయకుల షెడ్యూల్!
వైసీపీ శ్రేణులకు సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్! వారిని వదలిపెట్టే ప్రసక్తే లేదు!
నేడు ఢిల్లీలో అమిత్ షాను కలవనున్న పవన్ కల్యాణ్! ఎందుకో తెలుసా! కేబినెట్ భేటీ ముగిసిన వెంటనే!
విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం! విద్యావిధానంలో మరియు ఆ విషయంలో కీలక మార్పులు.. ఇక పండగే!
మీరు స్కూటీ కొనాలనుకుంటున్నారా..? అదిరిపోయే ఫీచర్లతో - అతి తక్కువ ధరకే ఎలక్ట్రిక్ స్కూటీ!
గత ఐదేళ్లలో తప్పులు జరిగిన మాట నిజమే! సంచలన వ్యాఖ్యలు చేసిన డీజీపీ! ఇక వారికి మోతే!
బీఎస్ఎన్ఎల్ స్పెషల్ రీఛార్జ్ ఆఫర్! అన్లిమిటెడ్ కాల్స్... 600 జీబీ డేటా!
ఆ న్యూస్ వెబ్సైట్ కి భారీ షాక్! కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ! ఎందుకంటే..
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#andhrapravasi #hardikpandya #natasha #divorce #todaynews #flashnews #latestupdate
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.