రాజధాని రైల్వే కనెక్టివిటీకి నూతన అధ్యాయం! ఎర్రుపాలెం-నంబూరు మార్గంలో భారీ భూసేకరణ!

Header Banner

రాజధాని రైల్వే కనెక్టివిటీకి నూతన అధ్యాయం! ఎర్రుపాలెం-నంబూరు మార్గంలో భారీ భూసేకరణ!

  Sun Nov 10, 2024 09:46        Others

ఎర్రుపాలెం నుంచి రాజధాని అమరావతి మీదుగా నంబూరు వరకు చేపడుతున్న 56.63 కిలోమీటర్ల రైలుమార్గం నిర్మాణం కోసం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో భూసేకరణకు రైల్వేశాఖ శనివారం నోటిఫికేషన్ జారీచేసింది. అందులో 'ఆంధ్రప్రదేశ్ రాజధానిని రైలుమార్గం ద్వారా అనుసంధానించడానికి ఎర్రుపాలెం-నంబూరు స్టేషన్ల మధ్య అమరావతి మీదుగా నిర్మిస్తున్న కొత్త బ్రాడేజ్ లైన్ నిర్మాణంకోసం ఎన్టీఆర్ జిల్లాలో భూసేకరణ’ చేపడుతున్నట్లు పేర్కొంది. ఇబ్రహీంపట్నం మండలం చిలుకూరులో 42 సర్వే నంబర్లలోని 24.540 ఎకరాలు, దాములూరులోని 20 సర్వే నంబర్లలోని 12.59 ఎకరాలు కలిపి మొత్తం 37.13 ఎకరాల కోసం దక్షిణమధ్య రైల్వేజోన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిపై అభ్యంతరాలు, సలహాలు, సూచనలను 30 రోజుల్లోపు విజయవాడ ఆర్డీఓకు లిఖితపూర్వకంగా అందజేయాలని సూచించింది. విచారణ తర్వాత సదరు అధికారి జారీచేసే ఉత్తర్వులే ఫైనల్ అని స్పష్టం చేసింది. ఈ నోటిఫికేషన్లో పేర్కొన్న భూముల ప్లాన్లు, ఇతర వివరాలు విజయవాడలోని ఆర్డీఓ కార్యాలయంలో అందుబాటులో ఉంటాయని, ఆసక్తి ఉన్నవారు పరిశీలించుకోవచ్చని రైల్వేశాఖ పేర్కొంది.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


ఏపీ రాజధాని అమరావతికి కేంద్రం వరాలు! మరో ప్రాజెక్టుకు శ్రీకారం - భారీగా ఉద్యోగాలు వచ్చే అవకాశం! తగ్గేదేలే.. అంటున్న చంద్రబాబు పవన్ కళ్యాణ్

 

నామినేటెడ్ పోస్టుల రెండో జాబితా! ఈసారి వారికి అవకాశం పక్కా! చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!

 

నేడు సీ ప్లేన్‌లో శ్రీశైలంకు సీఎం చంద్రబాబు! మీరు ఎప్పుడు ప్లాన్ చేసుకుంటున్నారు?

 

రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్‌పై మరో కేసు! వైసీపీకి ఊహించని షాక్ - ఈ కేసులో మాజీ ఎంపీ!

 

వైసీపీకి మరో షాక్.. బీజేపీలోకి మాజీ మంత్రిజగన్ పై గాటు విమర్శలు!

 

ఇక నుంచి అలా చేయను... లోకేశ్పవన్పేరు పేరునా అందరికీ సారీ చెప్పిన శ్రీరెడ్డి! నాకు ఎలాగూ భవిష్యత్ లేదు!

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. త్వరలోనే సీఎం చంద్రబాబు వాట్సాప్ ప్లాన్! ఆధార్ తప్పనిసరిఇకపై ఆ సమస్యలన్నీ వాట్సాప్ లోనే చెక్!

 

ఆమెకు ఆ అరబి కుటుంబం దేవుడుతో సమానం! పొగడ్తల తో ముంచేత్తుతున్న తెలుగు ఆడ పడుచు! ఇంతకీ ఆమెకు ఏమి జరిగిందంటే! 14

 

ఏపీ ప్రజలకు గుడ్ చెప్పిన ఆరోగ్య శాఖ మంత్రి! ఇకపై ఆరోగ్య శ్రీ ద్వారా...

 

మతిపోగొట్టే ఫీచర్లతో టాటా నానో ఎలక్ట్రిక్ కారు! కొత్తగా కారు కొనాలనుకునేవాళ్లకి ఇదే బంపర్ ఆఫర్! అతి తక్కువ ధరకే!

 

APNRTS కు 30 కోట్లు కేటాయింపు.. సమన్వయకర్తల నియామకం! ఎన్నారైలకు రోజుకు 100 విఐపి తిరుమల దర్శనాలు! ఐకాన్ టవర్ 2027 కి పూర్తి.. సీఎం చంద్ర బాబు!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group




   #andhrapravasi #railway #amaravathi #newtrack #todaynews #flashnews #latestupdate