ఈ నదిలో దిగితే మీ పంట పండినట్టే! అందులో ఏం ఉందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Header Banner

ఈ నదిలో దిగితే మీ పంట పండినట్టే! అందులో ఏం ఉందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

  Sun Jan 12, 2025 15:04        Others

పాకిస్తాన్ ఇప్పుడు ధనిక దేశం కాబోతోందా? కరువు, ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ కు ఇప్పుడు ఆశాకిరణం కనిపించిందా? అవును పాకిస్తాన్ కు భారీ ఊరట కలిగించే వార్త వెలుగులోకి వచ్చింది. పంజాబ్ ప్రావిన్స్ అటోక్ జిల్లాలో ఉన్న సింధూ నది లోయలో భారీగా బంగారం నిల్వలను గుర్తించారు. దాదాపు 32.6 మెట్రిక్ టన్నుల బంగారు నిల్వలు ఉన్నాయని.. వాటి విలువ దాదాపు 18వేల కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. జియోలాజికల్ సర్వే ఆఫ్ పాకిస్తాన్ కూడా ఆ వివరాలను ధ్రువీకరించింది.

 

ప్రస్తుతం పాకిస్తాన్ ను కష్టాలు వెంటాడుతున్నాయి. ఓ వైపు నిత్యావసరాల ధరలు, మరోవైపు ఇంధన ధరలు కొండెక్కి కూర్చొన్నాయి. దీంతో అక్కడి ప్రజల జీవితం భారంగా మారింది. వరుస ఉగ్రవాదుల దాడులతో ఎంతో మంది ప్రజలు, సైనికులు, భద్రతా సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పాకిస్తాన్ కు ఇప్పుడు బంగారు నిల్వలు బయటపడ్డాయన్న వార్త భవిష్యత్తుపై ఆశలను రేకెత్తిస్తోంది.

 

ఆ బంగారం నిల్వలను బయటకు తీసే ప్రక్రియ మొదలైతే పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ దూసుకుపోయే ఆస్కారం ఉంటుంది. దేశంపై ఉన్న అప్పుల భారం తగ్గడంతోపాటు కరెన్సీ విలువ కొంతమేర బలపడే అవకాశం ఉంటుంది. నిత్యావసరాల ధరలు, ఇంధన ధరలు దిగివచ్చి సామాన్యులకు ఊరట లభించినట్లు అవుతుంది.

 

ఇంకా చదవండిఛీ.. ఛీ.. సీసీ కెమెరాలో అడ్డంగా దొరికిపోయిన సైకో.. ఆసుపత్రిలో పరామర్శ.. జగన్ గుట్టు విప్పిన మంత్రి!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

ఇంకా చదవండిమంత్రి కీలక ప్రకటన.. ఆ నగరాన్ని క్లీన్ సిటీగా మార్చేలా ప్రణాళికలు సిద్ధం!

 

అయితే అటోక్ జిల్లా లోని సింధూ నదిలో ఉన్న బంగారం నిల్వలను వెలికితీసే ప్రక్రియ ప్రారంభించడంపై పూర్తిగా ఫోకస్ పెట్టామని పంజాబ్ ప్రావిన్స్ గనుల శాఖ మంత్రి ఇబ్రహీం హసద్ మురాద్ తెలిపారు. 32 కిలోమీటర్ల పరిధిలో బంగారం నిల్వలు ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. పంజాబ్ ప్రావిన్స్, ఖైబర్ ఫంఖాూన్ ఖ్వా ప్రావిన్స్ పరిధిలోని పలు ఇతర ప్రాంతాల్లో కూడా బంగారం నిల్వలు ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. పెషావర్ బేసిన్, మర్దాన్ బేసిన్ లలో కూడా బంగారం నిల్వలు ఉన్నాయని తెలిపారు. ఆయా ప్రాంతాల్లో అక్రమ మైనింగ్ పై నిషేధం అమలు అవుతుందని మురాద్ వెల్లడించారు. ప్రభుత్వం ఆధ్వర్యంలోనే బంగారు గనుల్లో మైనింగ్ జరుగుతుందని పేర్కొన్నారు.

 

కాగా సింధు నది జలాలు పాకిస్తాన్ భూభాగం గుండా ప్రవహిస్తున్నాయి. వందల ఏళ్ల కాలంలో తేక్రటాన్ కదలికల కారణంగా బంగారు కణాలను నదిలోయల్లో చేరవేశాయి. ఇవి మైనింగ్ ద్వారా వెలికి తీసే అవకాశం ఉంది. ఈ పరిణామాలు పాకిస్తాన్ కు ఆర్థికంగా భవిష్యత్తులో మార్పును తీసుకువచ్చే అవకాశం ఉంది. ప్రజలు పండగలా ఎదురుచూస్తున్న ఈ ప్రక్రియకు కార్యరూపం దాల్చినట్లయితే దశాబ్దాల కలను నిజం చేయలగదని విశ్లేషకులు సైతం భావిస్తున్నారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

పెండింగ్ బిల్లులు, బకాయిలు చెల్లింపుకు సీఎం చంద్రబాబు ఆదేశం! సమీక్షలో కీలక నిర్ణయం!

 

సంక్రాంతికి విజయవాడ నుండి వెళ్ళే వారికి గుడ్ న్యూస్! ఆ రూట్ క్లియర్!

 

ఏపీ ప్రజలకు అలర్ట్.. ప్రభుత్వం మరో కీలక నిర్ణయం! ఆ పథకం పేరు మారింది.. కొత్త పేరు ఇదే..

 

రైల్వే రిక్రూట్‌మెంట్.. పరీక్ష లేకుండానే ప్రభుత్వ ఉద్యోగం! కావలసిన అర్హతలు ఇవే.. ఇలా అప్లై చేసుకోండి!!

 

ఓరీ దేవుడో.. మాజీ ఎమ్మెల్యే ఇంట్లో ఐటీ సోదాలకు వెళ్లిన అధికారులు షాక్! ఎందుకంటే?

 

విశాఖ కోర్టు సంచలన తీర్పు! యూట్యూబర్ ఫన్ బకెట్ భార్గవ్‌కు 20 ఏళ్లు జైలు శిక్ష!

 

రూ.లక్షల కోట్ల పెట్టుబడులు.. 20 లక్షల మందికి ఉపాధి! ప్రజలు 93 శాతం స్ట్రైక్ రేట్ తో.. 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #Pakisthan #Gold #River #Indus