దేవస్థానం తనిఖీలో బయటపడిన టోల్ గేట్ గుట్టు! ఉద్యోగులపై కఠిన చర్యలు!

Header Banner

దేవస్థానం తనిఖీలో బయటపడిన టోల్ గేట్ గుట్టు! ఉద్యోగులపై కఠిన చర్యలు!

  Tue Jan 14, 2025 22:01        Others

శివుడి మహా పుణ్యక్షేత్రం శ్రీశైలం ఆలయానికి వెళ్లే దారిలో.. ఎంట్రన్స్ లో ఓ టోల్ గేట్ ఉంటుంది. ఇక్కడ వాహనాలకు టోల్ ఛార్జీ వసూలు చేస్తారు. ఇది ఎన్నో ఏళ్లుగా కొనసాగుతుంది. ఈ టోల్ గేట్ లో పని చేసే సిబ్బంది.. ఇటీవల కాలంలో చేతివాటం చూపిస్తున్న విషయంలో.. తనిఖీల్లో బయటపడింది. ఈ క్రమంలోనే.. ఏకంగా ఎనిమిది మంది సిబ్బందిపై వేటు వేశారు శ్రీశైలం దేవస్థానం అధికారులు. టోల్ గేట్ దగ్గర అధికారులు ఆకస్మిక తనిఖీ చేపట్టారు. ఆ సమయంలో టోల్ గేట్ లో ఉండాల్సిన డబ్బు కంటే ఎక్కువ ఉంది. ఎక్కువగా ఉన్న డబ్బు విషయంపై ప్రశ్నిస్తే.. సిబ్బంది ఎలాంటి సమాధానం చెప్పలేదు. విచారణలో అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు నిర్థారణ కావటంతో.. వేటు వేశారు అధికారులు. శ్రీశైలం కు వచ్చే ప్రతి వాహనం నుంచి దేవస్థానం ఏర్పాటు చేసిన టోల్ గేట్ ద్వారా.. హనదారుల నుంచి ఫీజు వసూలు చేస్తారు.



ఇంకా చదవండిఏపీ కో-ఆపరేటివ్ బ్యాంక్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల! దరఖాస్తు వివరాలు తెలసుకోండి!



దేవస్థానం అధికారులు 2025, జనవరి 5 తేదీన ఆకస్మికంగా తనిఖీ చేయగా ఈ బండారం బయటపడింది. అప్పటి నుంచి విచారణ చేయగా.. అధికంగా డబ్బులు వసూలు చేయటం.. ఆన్ లైన్ పేమెంట్ కాకుండా వాహనదారుల నుంచి అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు స్పష్టం అయ్యింది. ఈ క్రమంలోనే టోల్ గేట్ దగ్గర పని చేసే రెగ్యులర్ ఉద్యోగి ఎం రామకృష్ణుడు, కాంట్రాక్టు సిబ్బంది నాగ పరమేశ్వరుడు, జి మల్లికార్జున రెడ్డి, ఎన్ గోవిందు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు మల్లికార్జునరెడ్డి, బిఆర్ మల్లేశ్వర్ రెడ్డి, డైలీ వేజ్ సిబ్బందిని తొలగించారు అధికారులు. ఈవో శ్రీనివాసరావు ఆదేశాల మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రస్తుతం టోల్ గేట్ దగ్గర కొత్త సిబ్బందిని నియమించారు శ్రీశైలం ఈవో శ్రీనివాసరావు.



ఇంకా చదవండిపులివెందుల డీఎస్పీ ను బహిరంగంగా బెదిరించిన జగన్! మా కార్యకర్తలపై కేసులు పెడతావా! తర్వాత మీ కథ ఉంటుంది!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:


జగన్ వి పగటి కలలా లేక రాత్రి కలలా? వైసీపీ ఎందుకు ఖాళీ అవుతోందో ఇప్పుడు అర్థం అవుతుంది!

 

జగన్ వి పగటి కలలా లేక రాత్రి కలలా? వైసీపీ ఎందుకు ఖాళీ అవుతోందో ఇప్పుడు అర్థం అవుతుంది!

 

ఏపీ ప్రభుత్వం వారికి మరో అదనపు సెలవు ప్రకటించింది! జీవో 73తో ఉద్యోగులకు రిలీఫ్!

 

అమెరికాలో కార్చిచ్చు వేళ అందినకాడికి దోచుకుంటున్న దొంగలు! 29 మంది అరెస్ట్‌!

 

ఏపీ కో-ఆపరేటివ్ బ్యాంక్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల! దరఖాస్తు వివరాలు తెలసుకోండి!

 

దొంగ నోట్ల కలకలం! నకిలీ రూ. 500 నోటును ఎలా గుర్తించాలి! ఇవి లేకపోతే నకిలీనే!

 

వందల నుంచి లక్షల వరకు బెట్టింగులు.. కోడి పందేల హవా నెక్స్ట్ లెవల్! పోలీసుల ఆంక్షలపై లైట్..!

 

వారెవ్వా.. ఆ జిల్లాలో కోడిపందెం గెలిస్తే 'మహీంద్రా థార్'.. సందడి ఏ రేంజిలో ఉంటుందో..


ఆంధ్ర
  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #srisailam #temple #tollgate #todaynews #flashnews #latestupdate