పార్టీ కార్యాలయంలో కార్యకర్త మృతదేహం! ఎక్కడ? అసలు ఏం జరిగింది?

Header Banner

పార్టీ కార్యాలయంలో కార్యకర్త మృతదేహం! ఎక్కడ? అసలు ఏం జరిగింది?

  Mon Nov 11, 2024 11:00        India

అదృశ్యమైన బీజేపీ కార్యకర్త ఆ పార్టీ కార్యాలయంలో హత్యకు గురయ్యాడు. పార్టీ ఆఫీస్‌ డోర్‌ పగులగొట్టిన పోలీసులు లోపలకు వెళ్లి చూడగా రక్తం చారలతో ఉన్న అతడి మృతదేహం కనిపించింది. బీజేపీ కార్యకర్త హత్యకు సంబంధించి ఒక మహిళను అరెస్ట్‌ చేశారు. పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఉస్థికి చెందిన బీజేపీ కార్యకర్త పృథ్వీరాజ్ నస్కర్ ఆ జిల్లాలో పార్టీకి చెందిన సోషల్ మీడియా ఖాతాలను నిర్వహిస్తున్నాడు. నవంబర్‌ 5 నుంచి అతడు కనిపించడం లేదని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు.

 

ఇంకా చదవండిలోన్ ఈఎంఐ చెల్లించలేని వారికి ఆర్బీఐ గుడ్ న్యూస్! ఇలా చేస్తే ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

కాగా, పోలీసులు శుక్రవారం రాత్రి బీజేపీ పార్టీ కార్యాలయంలో లోపల నుంచి లాక్‌ వేసి ఉన్న ఒక డోర్‌ను పగులగొట్టారు. లోపలకు వెళ్లి చూడగా రక్తంతో తడిసిన పృథ్వీరాజ్ నస్కర్ మృతదేహం కనిపించింది. ఆయన మొబైల్‌ ఫోన్‌ కాల్స్‌ డేటాను పరిశీలించిన తర్వాత ఒక మహిళను పోలీసులు అరెస్ట్‌ చేశారు. 

 

ఇంకా చదవండి: APNRTS కు 30 కోట్లు కేటాయింపు.. సమన్వయకర్తల నియామకం! ఎన్నారైలకు రోజుకు 100 విఐపి తిరుమల దర్శనాలు! ఐకాన్ టవర్ 2027 కి పూర్తి.. సీఎం చంద్ర బాబు!  

 

మరోవైపు ఆ మహిళను ప్రశ్నించగా పృథ్వీరాజ్‌తో ఘర్షణ సందర్భంగా పదునైన ఆయుధంతో దాడి చేసి హత్య చేసినట్లు ఒప్పుకున్నదని పోలీస్‌ అధికారి తెలిపారు. ఆమె ఎందుకు హత్య చేసింది, మృతుడితో ఆ మహిళకు ఉన్న సంబంధంపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. అయితే పృథ్వీరాజ్ నస్కర్‌ను టీఎంసీ కార్యకర్తలు హత్య చేశారని బీజేపీతోపాటు అతడి కుటుంబం ఆరోపించింది.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నామినేటెడ్ పోస్టుల రెండో జాబితా! ఈసారి వారికి అవకాశం పక్కా! చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!

 

నేడు సీ ప్లేన్‌లో శ్రీశైలంకు సీఎం చంద్రబాబు! మీరు ఎప్పుడు ప్లాన్ చేసుకుంటున్నారు?

 

రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్‌పై మరో కేసు! వైసీపీకి ఊహించని షాక్ - ఈ కేసులో మాజీ ఎంపీ!

 

వైసీపీకి మరో షాక్.. బీజేపీలోకి మాజీ మంత్రిజగన్ పై గాటు విమర్శలు!

 

ఇక నుంచి అలా చేయను... లోకేశ్పవన్పేరు పేరునా అందరికీ సారీ చెప్పిన శ్రీరెడ్డి! నాకు ఎలాగూ భవిష్యత్ లేదు!

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. త్వరలోనే సీఎం చంద్రబాబు వాట్సాప్ ప్లాన్! ఆధార్ తప్పనిసరిఇకపై ఆ సమస్యలన్నీ వాట్సాప్ లోనే చెక్!

 

ఆమెకు ఆ అరబి కుటుంబం దేవుడుతో సమానం! పొగడ్తల తో ముంచేత్తుతున్న తెలుగు ఆడ పడుచు! ఇంతకీ ఆమెకు ఏమి జరిగిందంటే! 14 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #India #Politics #Murder #WestBengal #BJP