ఆయుష్మాన్‌ భారత్‌తో సీనియర్ సిటిజన్ లకు ఆరోగ్య రక్ష! ఒకరి కన్నా ఎక్కువ మంది అర్హులు ఉంటే?

Header Banner

ఆయుష్మాన్‌ భారత్‌తో సీనియర్ సిటిజన్ లకు ఆరోగ్య రక్ష! ఒకరి కన్నా ఎక్కువ మంది అర్హులు ఉంటే?

  Mon Nov 25, 2024 13:00        India

వృద్ధులకు ఆయుష్మాన్‌ భారత్‌ ఆరోగ్య బీమా పథకాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కొన్నేండ్ల క్రితం ప్రారంభించారు. 70 ఏండ్లు, అంతకన్నా ఎక్కువ వయసు గలవారు ఈ పథకం ద్వారా లబ్ధి పొందవచ్చు. ఆర్థిక స్థోమతతో సంబంధం లేదు. ఆధార్‌ కార్డు ఉంటే చాలు. కుటుంబంలోని వయోవృద్ధులు రూ.5 లక్షల వరకు ఉచిత వైద్య చికిత్సను పొందవచ్చు. దేశంలోని 4.5 కోట్ల కుటుంబాల్లో ఉన్న సుమారు 6 కోట్ల మంది వృద్ధులు ఈ పథకానికి అర్హులు. ఒకే కుటుంబంలో ఒకరి కన్నా ఎక్కువ మంది అర్హులు ఉంటే, వారంతా కలిసి రూ.5 లక్షల వరకు ఉచిత వైద్య చికిత్స పొందవచ్చు. అంటే, కుటుంబానికి రూ.5 లక్షల వరకు మాత్రమే లబ్ధి పొందడానికి వీలవుతుంది.

 

ఆయుష్మాన్‌ వయ్‌ వందన కార్డ్‌
70 ఏండ్లు, అంతకన్నా ఎక్కువ వయసు గలవారు, వారి ఆర్థిక స్థోమతతో సంబంధం లేకుండా, ఆయుష్మాన్‌ భారత్‌ పీఎంజేఏవై సీనియర్‌ సిటిజన్‌ పథకంలో చేరవచ్చు. ఈ పథకంలో చేరినవారికి ప్రత్యేకంగా ఆయుష్మాన్‌ వయ్‌ వందన కార్డును అందజేస్తారు. 

 

ఆధార్‌ తప్పనిసరి
ఆయుష్మాన్‌ వయ్‌ వందన కార్డును నమోదు చేయించుకోవడానికి ఆధార్‌ కార్డు తప్పనిసరిగా ఉండాలి. వయసు నిర్ధారణకు ఇది తప్పనిసరి. వృద్ధుల ఆర్థిక స్తోమతతో సంబంధం లేదు. 

 

ఏయే పత్రాలు అవసరం?
ఆయుష్మాన్‌ భారత్‌ పీఎంజేఏవై సీనియర్‌ సిటిజన్‌ పథకంలో చేరడానికి ఆధార్‌ సరిపోతుంది. ఇతర డాక్యుమెంట్లు అక్కర్లేదు. 

 

ఇంకా చదవండి25/11 తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

ఇంకా చదవండినయనతారకు ఇదో పెద్ద అవమానమే! బాలీవుడ్ ఆడియన్స్ దృష్టిలో..వీడియో నెట్టింట వైరల్‌! 

 

చేరిన వెంటనే చికిత్స పొందవచ్చా?
పీఎంజేఏవై పథకంలో చేరిన మొదటి రోజు నుంచి చికిత్స పొందడానికి అర్హులే. చికిత్స కోసం వెయిటింగ్‌ పీరియడ్‌ నిబంధన లేదు. కాబట్టి ఈ బీమా కవరేజ్‌ తక్షణమే ప్రారంభమవుతుంది. 

 

బదిలీ అవకాశం లేదు
ప్రభుత్వ ఆరోగ్య బీమా పథకం నుంచి వైదొలగి, పీఎంజేఏవైలో చేరినవారు మళ్లీ ఆ ప్రభుత్వ ఆరోగ్య పథకానికి మారడానికి వీలుండదు. పీఎంజేఏవైలోనే కొనసాగాలి. 

 

దరఖాస్తు ఎలా చేసుకోవాలి?
www.beneficiary.nha.gov.in పోర్టల్‌ ద్వారా పీఎంజేఏవై పథకానికి దరఖాస్తు చేయవచ్చు. ఆండ్రాయిడ్‌ యూజర్లు ఆయుష్మాన్‌ యాప్‌ను గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకుని, దరఖాస్తు చేసుకోవచ్చు. 

 

ఒకే కుటుంబంలో ఇద్దరు లేదా ముగ్గురు అర్హులు ఉంటే ఎలా?
ఒకే కుటుంబంలో ఒకరి కన్నా ఎక్కువ మంది అర్హులు ఉంటే, మొదటి వ్యక్తి వివరాలను ముందుగా నమోదు చేయాలి. ఆ తర్వాత ‘యాడ్‌ మెంబర్‌’పై క్లిక్‌ చేసి మరొకరి వివరాలను నమోదు చేయాలి. ఒక్కొక్కరికి వేర్వేరుగా నమోదు చేయనక్కర్లేదు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. కొత్త రేషన్ కార్డులకు దరఖస్తుల స్వీకరణ ప్రారంభం! మారబోతున్న డిజైన్లు!

 

వైసీపీకి వరుస షాక్ లు.. సజ్జల అరెస్ట్ కు రంగం సిద్దం! మరో వైసీపీ నేతకు నోటీసులు!

 

వైకాపా పాలనలో విద్యా దీవెన బకాయిలతో లక్షల విద్యార్థుల పతనం! లోకేశ్ ఘాటు విమర్శలు!

 

ప్రధాని మోదీకి ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు! ఎందుకు అంటే!

 

క‌మెడియ‌న్ అలీకి ఊహించ‌ని షాక్‌! నోటీసులు ఇచ్చిన గ్రామ కార్య‌ద‌ర్శి - ఎందుకు అంటే!

 

25/11 నుండి 30/11 వరకు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

జగన్‌ దగ్గర ఎందుకు చేశానా అని బాధపడుతున్నా! దుమారం రేపుతున్న మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు!

 

వైసీపీకి మరో షాక్‌! పార్టీకి రాజీనామా చేసిన కైకలూరు ఎమ్మెల్సీ!

 

మూడేళ్లలో అమరావతికి నూతన రూపు-సీఎం చంద్రబాబు! రాజధానికి రూపకల్పనలో భారీ ప్రణాళికలు!

 

ఏపీలో వాళ్లందరి పింఛన్లు కట్! ఈ తప్పు అస్సలు చేయొద్దు! సర్కార్ కీలక నిర్ణయం! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 

 


   #AndhraPravasi #India #Health #AyushmanCard #Modi #SeniorCitizens