వైసీపీకి మరో ఎదురు దెబ్బ! చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు!

Header Banner

వైసీపీకి మరో ఎదురు దెబ్బ! చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు!

  Sat Jul 27, 2024 21:38        Politics

టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నానిపై దాడి కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ నేత చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని తిరుపతి పోలీసులు బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల ఎన్నికల్లో చంద్రగిరి అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పులివర్తి నాని, వైసీపీ అభ్యర్థిగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పోటీ చేశారు. పోలింగ్ అనంతరం, తిరుపతి పద్మావతి మహిళా యూనివర్సిటీలోని స్ట్రాంగ్ రూమ్ ను పరిశీలించేందుకు వెళ్లిన క్రమంలో, పులివర్తి నానిపై దాడి జరిగింది. ఈ ఘటనపై హత్యాయత్నం సెక్షన్లతో కేసు నమోదు చేశారు. ఈ ఘటన అనంతరం చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. తాజాగా, తిరుపతి పోలీసులు చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని రాష్ట్రానికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడైన మోహిత్ రెడ్డి ఈ కేసులో 37వ నిందితుడిగా ఉన్నారు.

 

ఇంకా చదవండి: పోలవరంలో తొలి మలి దశ లేదు! ప్రాజెక్టు పూర్తి చేయడమే! కేంద్రానికి తేల్చి చెప్పిన సీఎం చంద్రబాబు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

స్టాక్ మార్కెట్ లో డబ్బులు పెడుతున్నారా? అయితే ఇది మీ కోసం! తెలుసుకోపోతే ఇక మీ పని అంతే!

 

తస్మాత్ జాగ్రత్త! మెసేజ్ ఓపెన్ చేయగానే అకౌంటులో డబ్బులు మాయం!

 

జంగారెడ్డిగూడెంలో నాటుసారా మృతులపై విచారణ! లిక్కర్ పాలసీపై మండిపడ్డ మంత్రి రవీంద్ర!

 

ప్రతిపక్ష నేత హోదా పిటిషన్‌పై విచారణ! హైకోర్టు ఏం తీర్పు ఇవ్వనుంది!

 

జగన్ ఢిల్లీలో స్థిరపడేందుకు షెల్టర్ అవసరం! కూటమిలో చేరడం అనివార్యం- యనమల రామకృష్ణుడు!

 

అసత్య ప్రచారాలు చేస్తున్న మీడియాపై మండిపడ్డ మంత్రి లోకేష్! ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉంటాం!

 

నేను నోరు విప్పితే జగన్ జైలుకే! బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు!

 

గూగుల్ కు పోటీగా కొత్త సెర్చ్ ఇంజిన్ వస్తోంది! అది ఏంటో తెలుసా!

 

జగన్ ఢిల్లీలో స్థిరపడేందుకు షెల్టర్ అవసరం! కూటమిలో చేరడం అనివార్యం- యనమల రామకృష్ణుడు!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #ChevireddyMohithReddy #Police #Bengaluru #PulivarthiNani #Chandragiri #YSRCP #TDP