యువతకు ఉద్యోగాల గమ్యంగా పర్యాటక రంగ అభివృద్ధి! పవన్ కల్యాణ్ కీలక సూచన!

Header Banner

యువతకు ఉద్యోగాల గమ్యంగా పర్యాటక రంగ అభివృద్ధి! పవన్ కల్యాణ్ కీలక సూచన!

  Tue Nov 26, 2024 10:34        Politics

రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి.. తద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే దిశగా ఎన్డీయే ప్రభుత్వం ముందుకెళ్తాందని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని పర్యాటకానికి హబ్ మార్చేందుకు ప్రభుత్వ శాఖలు సమన్వయంతో ముందుకెళ్లాలని సూచించారు. రాష్ట్రంలో ఆలయాలు, పర్యావరణ, సాహస క్రీడలు, హెరిటేజ్ పర్యాటక ప్రదేశాల అభివృద్ధిపై ప్రజలకు ఇచ్చిన హామీల గురించి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అధ్యక్షతన సోమవారం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశం జరిగింది. దేవాదాయ, పర్యాటక, రోడ్లు, భవనాల శాఖ మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, కందుల దుర్గేష్, బీసీ జనార్దన్రెడ్డి, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. 'ప్రపంచంలో ఎన్నో దేశాలు కేవలం పర్యాటకం ద్వారానే అభివృద్ధి చెందాయి. మన రాష్ట్రంలో ఆలయాలు, పర్యావరణం, సాహస క్రీడలు తదితర అంశాల్లో అభివృద్ధికి అద్భుతమైన అవకాశాలున్నాయి. ఏటా పది శాతం అభివృద్ధికి అవకాశమున్న పర్యాటక రంగాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు మార్గదర్శకత్వంలో ముందుకు తీసుకెళ్తాం. ఇప్పటికే దీని అభివృద్ధికి కీలక నిర్ణయాలు తీసుకున్నాం. ఎకో టూరిజం కోసం ప్రత్యేక కార్పొరేషన్ దిశగా చర్యలు ప్రారంభించాం' అని వెల్లడించారు.

సినిమాల ద్వారా ప్రచారం చేయొచ్చు
'కర్నూలు జిల్లా ఆదోని, దొండపాడు, ఉమ్మడి కడప జిల్లా సిద్ధవటం లాంటి ప్రాంతాల్లో విద్యార్థుల కోసం ఎడ్వెంచర్ థీమ్ పార్క్ లు ఏర్పాటు చేస్తే బాగుంటుంది. మన రాష్ట్ర విద్యార్థులను విహారయాత్రలకు కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు తీసుకెళ్తున్నారు. అక్కడ వారి కోసం థీమ్ పార్కులను ఏర్పాటు చేశారు. వాటిపై దృష్టి పెడితే వినోదం, ఉత్సాహంతో పాటు చాలా మంది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కూడా కల్పించవచ్చు. నంద్యాలలో ఏనుగుల క్యాంపులు, గండికోట, హార్స్లీ హిల్స్ లో అద్భుతమైన కొండలున్నాయి. మన వారసత్వ సంపదకు తగిన ప్రాచుర్యం కల్పించాలి. తిరుపతి సమీపంలోని గుడిమల్లం ఆలయం, కాకినాడలోని కోరింగ మడ అడవులు, వన్యప్రాణి అభయారణ్యాల వంటి వాటిపై సమగ్ర సమాచారం ప్రజలకు అందుబాటులో లేదు. వాటిపై ప్రణాళికాబద్ధంగా ప్రచారం చేయాలి. న్యూజిలాండ్, ఉక్రెయిన్ లాంటి దేశాలు అందుకు చలనచిత్ర మాధ్యమాన్ని ఎంచుకున్నాయి. సినిమాల ద్వారా పర్యాటక ప్రాంతాలకు తేలికగా ప్రచారం కల్పించవచ్చు' అని తెలిపారు.



ఇంకా చదవండి25/11 తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!



ప్రత్యేక రవాణా సదుపాయాలు కల్పించాలి
'గతంలో పాలకులు పర్యాటక రంగ అభివృద్ధికి ప్రతి అవకాశాన్నీ వినియోగించుకునేవారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు దేవాదాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు యాత్ర బస్సుల పేరిట దివ్యక్షేత్ర దర్శనం ఏర్పాటుచేశారు. నేను ఇటీవల మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి వెళ్లినప్పుడు.. అక్కడివారు లాతూర్ ప్రాంతం నుంచి తిరుపతికి వచ్చే భక్తులు ప్రత్యేక రైలు సదుపాయం కావాలని అడిగారు. అక్కడి నుంచి నిత్యం వెయ్యి మంది వరకు శ్రీవారి దర్శనానికి వస్తారు. వారి కోసం రైల్వేశాఖ సమన్వయంతో ప్రత్యేక రైళ్లు కేటాయించాలి. ఇలాంటి సదుపాయాలతో పర్యాటకులను ఆకర్షించవచ్చు. కుంకీ ఏనుగుల కోసం కర్ణాటక వెళ్లినప్పుడు ఆ రాష్ట్ర అటవీశాఖ మంత్రి కాలినడకన కర్ణాటక నుంచి శ్రీశైలం వచ్చే భక్తుల ప్రస్తావన తెచ్చారు. వారికి గతంలో ఉండే సౌకర్యాలను ప్రస్తుతం తొలగించారు. ఇలాంటివి కల్పిస్తే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే పర్యాటకులు పెరుగుతారు' అని పేర్కొన్నారు.

దేవాలయాల పవిత్రత.. మన బాధ్యత
'మహారాష్ట్రలో పాండురంగ యాత్రను ప్రజలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. మన దగ్గర ఆలయాలు విహారయాత్ర స్థలాల్లా మారిపోయాయి. ఆలయాల పవిత్రతను వివరించేందుకు సదస్సులు నిర్వహించాలి. దేశం గర్వించదగ్గ నాయకుల ఇళ్లు, వారు నడయాడిన ప్రాంతాలు, స్వాతంత్య్ర పోరాటఘట్టాలు జరిగిన ప్రాంతాలను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేయాలి. హెరిటేజ్ ప్రాంతాలను వైకాపా పాలకులు తమ స్వార్థానికి తవ్వుకుంటూ పోయారు. అటువంటి వాటిని గుర్తించి కాపాడుకోవాలి. అన్నింటి కన్నా పర్యాటకుల భద్రత చాలా ముఖ్యం' అని స్పష్టం చేశారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


భారతీయులకు భారీ షాక్: అమెరికా వెళ్లే కల ఆగిపోయినట్టేనా - 11వేల మంది ఉద్యోగాలు కట్! రాబోయే రోజుల్లో ఈ వీసాలుఇంక దక్కవని!

 

శుభవార్త చెప్పేసిన సీఎం.. ఇక రాష్ట్రంలో అందరికీ ఉచిత విద్యుత్! 100 శాతం సౌర విద్యుత్ వినియోగం!

 

మాజీ సీఎం జగన్ కు కేంద్రం ఊహించని షాక్! అసలు ఏం జరిగిందంటే!

 

అమెరికా జైలుకి జగన్ - జీవితాంతం ఏపీకి తిరిగిరాడు! నీకు ఇప్పుడు దమ్ము ఉంటే..?

 

26/11 తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

సుప్రీంకోర్టులో విజయపాల్‌కు గట్టి ఎదురుదెబ్బ! ఈ కేసులో ఇప్పటికే!

 

ట్రంప్ రాక ముందే వచ్చేయండి! విదేశీ విద్యార్థులకు అమెరికా వర్సిటీలు అలర్ట్!

 

అకౌంట్లోకి రూ.2.5 లక్షలు - ఈ పథకం ద్వారా పేదలకు వరం! మరో శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం!

 

ఏపీకి వస్తున్న మోదీ - అభివృద్ధికి పలు కీలక ప్రాజెక్టులతో కృషి! 25 వేల మందికి ఉపాధి లభించే అవకాశం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group




   #andhrapravasi #tourism #development #Deputycm #planning #jobs #todaynews #flashnews #latestupdate