మందుబాబులకు డబుల్ కిక్కు.. మరో రెండు రోజులు మాత్రమే! ఇక వీటితో పాటు.. గీత కార్మికులు సైతం!

Header Banner

మందుబాబులకు డబుల్ కిక్కు.. మరో రెండు రోజులు మాత్రమే! ఇక వీటితో పాటు.. గీత కార్మికులు సైతం!

  Tue Oct 08, 2024 08:00        Politics

ఏపీ ప్రభుత్వం నూతన మద్యం పాలసీని ఖరారు చేసిన విషయం తెలిసిందే. రెండేళ్ల కాలపరిమితితో ఈ విధానం అమల్లో ఉంటుంది. అంటే అక్టోబర్ 12 నుంచి సెప్టెంబర్ 30, 2026 వరకు ఈ విధానం అమల్లో ఉంటుంది. ఏపీ వ్యాప్తంగా మొత్తం 3,396 మద్యం షాపులకు లైసెన్సుల జారీకి కూడా ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేశారు. వీటికి అక్టోబర్ 1 నుంచే దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం అయింది. ఆన్‌లైన్ అండ్ ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఒక్కో షాపుకు రూ.2 లక్షల చొప్పున రిఫండబుల్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. వీటిని డీడీల రూపంలో నేరుగా ఎక్సైజ్ స్టేషన్లలో అందజేయాల్సి ఉంటుంది. దరఖాస్తులకు మరో రెండు రోజులు మాత్రమే గడువు ఉంది. అంటే ఈ నెల 9వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ప్రతీ జిల్లాలో కలెక్టర్ల ద్వారా ఈ నెల 11న మద్యం షాపులకు లాటరీ తీసి.. లైసెన్స్‌లు కేటాయిస్తారు. అక్టోబర్ 12 నుంచి మద్యం లైసెన్స్ దారులు షాపుల్ని ప్రారంభించుకోవచ్చు. అంత వరకు కూడా ప్రస్తుతం ఉన్న మద్యం షాపులే కొనసాగనున్నాయి. ఇదిలా ఉండగా.. ఏపీలో మద్యం ధరల్ని కూడా తగ్గించారు.

 

ఇంకా చదవండి: డెలివ‌రీ బాయ్‌గా వెళ్లిన జొమాటో సీఈఓకు ఊహించ‌ని షాక్‌! అసలు ఏమి జరిగింది అంటే!

 

క్వార్టర్ మద్యం ఎమ్మార్పీ ధరకే విక్రయించనున్నారు. అంటే రూ.99లకే ఈ మద్యం దొరుకుతుంది. దీంతో మందుబాబులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం మద్యం ధరలు అధికంగా ఉండటం.. మద్యం దొరక్కపోవడంతో ఉక్కిరిబిక్కిరి అయిన మద్యం బాబులు ప్రభుత్వ నిర్ణయంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా విజయవాడలో ఏ వాడలోకి వెళ్లి అడిగినా.. మద్యం బాబులు ఈ ప్రభుత్వ నిర్ణయాన్ని హర్షిస్తున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న చంద్రబాబు బాబు ప్రభుత్వంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. విజయవాడ పట్టణానికి చెందిన పడమట వాసి రవీందర్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వ మద్యం విధానాలకు తాము తీవ్రంగా నష్టపోయామన్నారు. ప్రస్తుతం చంద్రబాబు తీసుకొచ్చిన మద్యం పాలసీ ఎంతో బాగుందని మెచ్చుకున్నారు. తక్కువ ధరలో మద్యం దొరకడం ఎంతో సంతోషించదగిన విషయం అని చెప్పుకొచ్చాడు. ఇక వీటితో పాటు.. గీత కార్మికులు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గీత కార్మికుల విభాగంలోకి వచ్చే 6 కులాలకు 340 మద్యం షాపుల్ని కేటాయించనుండగా.. గీత కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

 

ఇంకా చదవండి: గల్ఫ్ కి వెళ్లాలని కోరికతో ట్రాప్ లో పడుతున్న తెలుగు ఆడపడుచులు! ఏజెంట్ల గుట్టు రట్టు! అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? 10

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వాలంటీర్లకు గుడ్ న్యూస్.. వచ్చే నెల నుంచే రూ.10వేలు, ఉద్యోగం! ఎవరికీ ఇబ్బంది కలగకుండా నిర్ణయాలు!

 

పది పాస్ అయితే చాలు.. నెలకు రూ.20 వేలు పొందొచ్చు, ఎలా అంటే! రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో!

 

ప్రపంచంలోనే అతిపెద్ద అపార్ట్‌మెంట్‌! 20 వేల మంది నివాసం!

 

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం సృష్టించిన సంకేతాలు! కోస్తా జిల్లాల్లో భారీ వర్షాల అంచనాలు!

 

మ‌రికాసేప‌ట్లో చంద్ర‌బాబుతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల భేటీ! పెళ్లి కార‌ణంగా చాలా కాలం!

 

తెలంగాణ రాజకీయాల్లో సంచలన పరిణామం! టీడీపీలో చెరనున్న మాజీ ఎమ్మెల్యే!

 

చంద్రబాబుపై నమోదైన హత్యాయత్నం కేసులో ట్విస్ట్, వైసీపీ లీడర్! అనేక మంది తెలుగుదేశం పార్టీ నాయకులు జైలుకు!

 

మరోసారి ఎంజీఆర్ గురించి ట్వీట్ చేసిన పవన్ కల్యాణ్! ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలకు గట్టి కౌంటర్!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #AndhraPradesh #APPolitics #Jagan #GovernmentJobs #Saraly #Amaravati #Pinchalu