వైఎస్ జగన్ కు షర్మిల కొట్టిన అసలు దెబ్బ ఇదే! గతంలో వేసిన అడుగులు - ఆస్తులను మించిన కష్టం!

Header Banner

వైఎస్ జగన్ కు షర్మిల కొట్టిన అసలు దెబ్బ ఇదే! గతంలో వేసిన అడుగులు - ఆస్తులను మించిన కష్టం!

  Fri Nov 01, 2024 16:34        Politics

ఏపీలో 2019 ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం తర్వాత చెల్లెలు వైఎస్ షర్మిల విషయంలో వైఎస్ జగన్ అనుసరించిన వైఖరి ఇప్పుడు ఆయనకు శాపంగా మారుతోంది. ముఖ్యంగా ఆస్తి పంపకాల విషయంలో ఇన్నాళ్లూ సైలెంట్ గా ఉన్న షర్మిల.. తాజాగా జగన్ ఎన్సీఎల్టీలో వేసిన పిటిషన్ తో భగ్గుమన్నారు. ఆ తర్వాత షర్మిల వేస్తున్న అడుగులు.. ఆమెకు మద్దతుగా తల్లి విజయమ్మ రాసిన లేఖ ఘన చరిత్ర కలిగిన వైఎస్ కుటుంబాన్ని కుదిపేస్తున్నాయి. అంతకు మించి జగన్ కు నష్టం చేస్తున్నాయి. వైఎస్ అంటేనే విశ్వసనీయత. అదే విశ్వసనీయతను పదింతలు పెంచుకునేలా జగన్ గతంలో వేసిన అడుగులు ఆయన్ను ఏపీ చరిత్రలో కనీవినీ ఎరుగని మెజార్టీ, అధికారాన్ని కట్టబెట్టాయి. అయితే ఆ తర్వాత ఆయన వేసిన అడుగులు అదే విశ్వసనీయతను ప్రశ్నార్ధకంగా మార్చేశాయి. అదే చివరికి సొంత చెల్లెలు షర్మిలను రాజకీయ పార్టీ పెట్టే దిశగా ప్రోత్సహించడంతో పాటు ఏపీలో కాంగ్రెస్ పార్టీకి నేతృత్వం వహించే దిశగా అడుగులు వేయించింది. ఇప్పుడు జగన్ చేసిన మరో తప్పిదం షర్మిల, విజయమ్మను ఏకం చేయడమే కాకుండా వారిద్దరినీ ఆయనకు ఆగర్భ శత్రువుల్లా మారుస్తున్నాయి. పైకి కనిపిస్తోంది జగన్ - షర్మిల మధ్య ఆస్తుల పోరాటమే. కానీ దీని మాటున జగన్ కు జరుగుతున్న నష్టం అంచనాలకు అందడం లేదు.

 

ఇంకా చదవండిపండుగ వేళ దారుణం.. కత్తులతో దాడి! ముగ్గురి దారుణ హత్య, మహిళ విషయంలో గొడవతో!

 

ఎందుకంటే ఇంట్లో గొడవలు అయితే కేవలం ఇంట్లో చర్చించుకుంటేనో, రాజీ పడితేనో సర్దుకుంటాయి. కానీ అవి ఓసారి రచ్చకెక్కితే మాత్రం జనంలో ప్రతిష్టను పలుచన చేస్తాయి. అదీ ఎంతో చరిత్ర ఉన్న వైఎస్ కుటుంబం రచ్చకెక్కడం వల్ల రాజకీయాల పరంగా, ఆస్తుల పరంగా, పరపతి పరంగా నామమాత్రంగా ఉన్న షర్మిల కంటే వైఎస్ జగన్ కు తీవ్ర నష్టంగా మారబోతున్నాయి. రేపోమాపో చెల్లెలు షర్మిలతో ఆస్తుల వివాదాన్ని జగన్ రాజీ చేసుకోవచ్చు. కానీ గత ఎన్నికల్లో, ఆ తర్వాత షర్మిల ఆయనకు చేసిన నష్టం రాజకీయంగా, మానసికంగా ఎప్పటికీ తీరేది కాదు. ముఖ్యంగా ఏపీ ఎన్నికల్లో ఓటమి తర్వాత రాజకీయంగా అడుగులు ఎటు వేయాలో తెలియక మల్లగుల్లాలు పడుతున్న జగన్ కు ఇప్పుడు చెల్లెలు రూపంలో ఎదురైన చికాకు మరింత నష్టం చేస్తోంది. అదీ మహిళల విషయంలో జగన్ వైఖరి జనంలో రోజూ చర్చనీయాంశం అవుతోంది. దీంతో భవిష్యత్తులో దీన్ని కవర్ చేసుకోవడం జగన్ కు కష్టం కావచ్చనే అంచనాలున్నాయి.

ఇంకా చదవండిఆమెకు అరబి కుటుంబం దేవుడుతో సమానం! పొగడ్తల తో ముంచేత్తుతున్న తెలుగు ఆడ పడుచు! ఇంతకీ ఆమెకు ఏమి జరిగిందంటే! 14

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు న్యూస్ కూడా నచ్చవచ్చు:

కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్! కుటుంబంలో 18 ఏళ్లు నిండిన వారికి శుభవార్త.. రూ.లక్షకు రూ.2 లక్షలు లాభం!Don't Miss

 

చంద్రబాబు విజయనగరం జిల్లా పర్యటనలో మార్పు! ఎందుకో తెలుసా..?

 

ఈరోజే నామినేటెడ్ పోస్టుల రెండవ లిస్టు విడుదలటీటీడీ చైర్మన్ ఆయనేనా?

 

పోలీసుల వేషంలో కిడ్నాప్ డ్రామా...చంపుతామని బెదిరింపు! వాహన తనిఖీలో నిందితులు అరెస్ట్!

 

మద్యంపై చేసే ఖర్చులో తెలుగు రాష్ట్రాలే టాప్! సంవత్సరానికి ఎంతో తెలుసా?

 

ఏపీలో మందుబాబులకు వెరైటీ ఆఫర్! ఒక బాటిల్ కొంటే అవి ఫ్రీ!

 

గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ నియామక వివాదం! ఫోన్ సంభాషణ సోషల్ మీడియాలో హల్ చల్!

 

విభజన తర్వాత ఢిల్లీలో కొత్త ఏపీ భవన్ నిర్మాణానికి పచ్చ జెండా! నవంబర్ లోపు గుత్తేదారులకు ఆహ్వానం!

 

-చలాన్పేరుతో కొత్త స్కామ్‌! ఒక్క క్లిక్ తో బ్యాంక్ అకౌంటు ఖాళీ! హెచ్చరికలు జారీ చేసిన కేంద్రం!

 

పార్లమెంట్ ఉభయసభలు ప్రత్యేక సమావేశం! ఎప్పుడు - ఎందుకు?

 

"ప్రజా వేదిక" కార్యక్రమంలో ఈరోజు పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! మీ కోసం!

 

ఉచిత గ్యాస్ సిలిండర్ స్కీమ్పై మరో కీలక అప్డేట్! 24 గంటల్లో గ్యాస్ సిలిండర్లు డెలివరీ! వాళ్లు డబ్బులు కట్టాల్సిందే!

 

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #BJP #YCP #YCPLeaders #Jagan #BJPleaderVishnukumarRaju #Drugs #AndhraPradesh #APPolitics #APNews