ఏపీలో 35 వంటగ్యాస్ సిలిండర్లు సీజ్.. అలా చేస్తే సిలిండర్ పట్టుకుపోతారు! మనం జాగ్రత్తగా గణించాలి - మంత్రి కీలక వ్యాఖ్యలు!

Header Banner

ఏపీలో 35 వంటగ్యాస్ సిలిండర్లు సీజ్.. అలా చేస్తే సిలిండర్ పట్టుకుపోతారు! మనం జాగ్రత్తగా గణించాలి - మంత్రి కీలక వ్యాఖ్యలు!

  Sun Nov 10, 2024 07:00        Politics

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మిగతా శాఖలు ఎలా ఉన్నా.. పౌర సరఫరాల శాఖను మాత్రం మనం జాగ్రత్తగా గమనించాల్సి ఉంది. ఎందుకంటే ఆ శాఖను నిర్వహిస్తున్న మంత్రి నాదెండ్ల మనోహర్.. పక్కాగా రూల్స్ ఫాలో అవుతున్నారు. ఎక్కడా ఎలాంటి తేడా లేకుండా.. తన పని తాను చేసుకుపోతున్నారు. ఆయన పదవి చేపట్టినప్పటి నుంచి ప్రతీ విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. పౌర సరఫరాల విషయంలో ఏ చిన్న తేడా జరిగినా.. యాక్షన్ తీసేసుకుంటున్నారు. సిలిండర్ల విషయంలోనూ అదే జరుగుతోంది. మంత్రి పదవిని చేపట్టిన వెంటనే.. బియ్యం అక్రమ తరలింపులపై ఉక్కుపాదం మోపిన నాదెండ్ల మనోహర్.. చాలా గోడౌన్లను సీజ్ చేయించారు. విదేశాలకు బియ్యం అక్రమంగా తరలిపోకుండా మాగ్జిమం ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఆయన రేషన్ బియ్యం సప్లైపై ఫోకస్ పెడుతున్నారు. కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం, కొత్త రేషన్ షాపులను తెరవడం వంటి అంశాలపై ఆయన బిజీగా ఉన్నారు. అలా ఉంటూనే.. మరోవైపు ఉచిత గ్యాస్ సిలిండర్ల విషయంలోనూ అలాగే వ్యవహరిస్తున్నారు. ఉచిత గ్యాస్ సిలిండర్లు పొందేవారు.. వాటిని ఇళ్లలో అవసరాలకే వాడాలి తప్ప.. వ్యాపారాలకు, వాణిజ్య అవసరాలకూ, రెస్టారెంట్లలో, హోటళ్లలో వాడటానికి వీలు లేదు.

 

ఇంకా చదవండి: 95 సీఎం అంటే ఏంటో ఇంకా కొంతమందికి అర్థంకావడంలేదు! చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు!

 

కానీ.. ఏపీలో కొంతమంది.. ఉచిత సిలిండర్లను పేదలకు డబ్బు ఆశ చూపి.. తక్కువ ధరకు కొనేసి.. కమర్షియల్‌గా వాడేస్తున్నారు. సరిగ్గా అలాంటి వాళ్లను పట్టుకునే పని ఒకటి సైలెంటుగా జరుగుతోంది. తాజాగా భీమవరంలో అదే జరిగింది. భీమవరం పట్టణంలోని కొన్ని హోటళ్లు, సిలిండర్ ఫిల్లింగ్ షాపుల్లో పౌర సరఫరాల శాఖ, రెవెన్యూ అధికారులు కలిసి దాడులు చేశారు. ఎక్కడికక్కడ తనిఖీలు చేశారు. అలా నాలుగు హోటల్స్, 3 గ్యాస్ ఫిల్లింగ్ షాపుల్లో అక్రమంగా వాడుతున్న 35 గ్యాస్ సిలిండర్లు చూశారు. వాటిని స్వాధీనం చేసుకున్నారు. వాటిని వాడే వారిపై కేసులు రాశారు. ఇక ఆ సిలిండర్లను వారికి ఇవ్వరు. ఇక వారి చాప్టర్ క్లోజ్ అయినట్లే. ఏపీలో పేదలు ఉచిత సిలిండర్లు తప్పక పొందాలి. వారి నెలవారీ ఖర్చు తగ్గేలా చేసుకోవాలి. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఆ సిలిండర్లను ఎవరికీ ఇవ్వకూడదు. ఇళ్లలోనే వాడుకోవాలి. వాటిని గ్యాస్ ఏజెన్సీ నుంచి స్వయంగా తెచ్చుకోవాలనుకుంటే.. దారిలో ఎక్కడా హోటల్స్ దగ్గర, రెస్టారెంట్ల దగ్గరా ఆ సిలిండర్‌ని ఉంచకూడదు. అలా ఉంచితే, సరిగ్గా ఆ టైంలోనే అధికారులు దాడులు చేస్తే.. ఇక ఆ సిలిండర్‌ని వారు స్వాధీనం చేసుకుంటారు. అనుకోకుండా ఉంచామనీ, అమ్మేందుకు కాదని చెప్పినా అధికారులు నమ్మరు. ఎందుకంటే.. అలా నమ్మించడానికి ఆధారాలు ఉండవు. కాబట్టి.. ఉచిత సిలిండర్ల విషయంలో మనమే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మన నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వం సీజ్ చేస్తే, ఆ తర్వాత ప్రభుత్వాన్ని నిందించి ఉపయోగం ఉండదు. ఆ 35 సిలిండర్ల విషయంలో తప్పు ప్రభుత్వానిది కాదు. అందుకే వాళ్లంతా బుక్ అయ్యారు.


ఇంకా చదవండి: నామినేటెడ్ పోస్టుల రెండో జాబితా విడుదల! నేమ్స్ లిస్ట్ మీకోసం..!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నామినేటెడ్ పోస్టుల రెండో జాబితా! ఈసారి వారికి అవకాశం పక్కా! చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!

 

నేడు సీ ప్లేన్‌లో శ్రీశైలంకు సీఎం చంద్రబాబు! మీరు ఎప్పుడు ప్లాన్ చేసుకుంటున్నారు?

 

రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్‌పై మరో కేసు! వైసీపీకి ఊహించని షాక్ - ఈ కేసులో మాజీ ఎంపీ!

 

వైసీపీకి మరో షాక్.. బీజేపీలోకి మాజీ మంత్రి? జగన్ పై గాటు విమర్శలు!

 

ఇక నుంచి అలా చేయను... లోకేశ్, పవన్, పేరు పేరునా అందరికీ సారీ చెప్పిన శ్రీరెడ్డి! నాకు ఎలాగూ భవిష్యత్ లేదు!

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. త్వరలోనే సీఎం చంద్రబాబు వాట్సాప్ ప్లాన్! ఆధార్ తప్పనిసరి? ఇకపై ఆ సమస్యలన్నీ వాట్సాప్ లోనే చెక్!

 

ఆమెకు ఆ అరబి కుటుంబం దేవుడుతో సమానం! పొగడ్తల తో ముంచేత్తుతున్న తెలుగు ఆడ పడుచు! ఇంతకీ ఆమెకు ఏమి జరిగిందంటే! 14

 

ఏపీ ప్రజలకు గుడ్ చెప్పిన ఆరోగ్య శాఖ మంత్రి! ఇకపై ఆరోగ్య శ్రీ ద్వారా...

 

మతిపోగొట్టే ఫీచర్లతో టాటా నానో ఎలక్ట్రిక్ కారు! కొత్తగా కారు కొనాలనుకునేవాళ్లకి ఇదే బంపర్ ఆఫర్! అతి తక్కువ ధరకే!

 

APNRTS కు 30 కోట్లు కేటాయింపు.. సమన్వయకర్తల నియామకం! ఎన్నారైలకు రోజుకు 100 విఐపి తిరుమల దర్శనాలు! ఐకాన్ టవర్ 2027 కి పూర్తి.. సీఎం చంద్ర బాబు!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Chandrababu #Chandrababuyagam #Familyfunction #AndhraPradesh #APNews