ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో డీజీపీ భేటీ! ఇకనైనా మారండి..లేకుంటే!
Sun Nov 10, 2024 08:22 Politicsరాష్ట్రంలో పోలీస్ శాఖ తీరుపై ఇటీవల ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు రాష్ట్రంలో తీవ్ర దుమారాన్నే రేపాయి. పవన్ వ్యాఖ్యలపై నాడు హోంమంత్రి వంగలపూడి అనిత, డీజీపీ ద్వారకా తిరుమలరావు మీడియా సమావేశాల్లో వివరణ కూడా ఇచ్చారు. అయితే శనివారం స్వయంగా డీజీపీ ద్వారకా తిరుమలరావు మంగళగిరిలోని డిప్యూటీ సీఎం కార్యాలయానికి వెళ్లి పవన్ కల్యాణ్ తో భేటీ అయ్యారు. దీంతో ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. పలు కీలక విషయాలపై వీరిద్దరూ చర్చించినట్లు సమాచారం. ఇటీవల రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న లైంగిక దాడి ఘటనలు, సోషల్ మీడియాలో అసభ్యకమైన పోస్టులు చేయడంపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో జరుగుతున్న నేరాలు, సోషల్ మీడియాలో పోస్టులు, అరెస్టులపై పవన్ తో డీజీపీ చర్చించినట్లు తెలుస్తోంది. అయితే వీరి భేటీకి సంబంధించి ఇటు డిప్యూటి సీఎం పవన్ కల్యాణ్ కార్యాలయం నుంచి కానీ, అటు డీజీపీ కార్యాలయం నుంచి అధికారిక ప్రకటన విడుదల కాలేదు.
ఇంకా చదవండి: నామినేటెడ్ పోస్టుల రెండో జాబితా విడుదల! నేమ్స్ లిస్ట్ మీకోసం..!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
నామినేటెడ్ పోస్టుల రెండో జాబితా! ఈసారి వారికి అవకాశం పక్కా! చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!
నేడు సీ ప్లేన్‌లో శ్రీశైలంకు సీఎం చంద్రబాబు! మీరు ఎప్పుడు ప్లాన్ చేసుకుంటున్నారు?
రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్‌పై మరో కేసు! వైసీపీకి ఊహించని షాక్ - ఈ కేసులో మాజీ ఎంపీ!
వైసీపీకి మరో షాక్.. బీజేపీలోకి మాజీ మంత్రి? జగన్ పై గాటు విమర్శలు!
ఏపీ ప్రజలకు గుడ్ చెప్పిన ఆరోగ్య శాఖ మంత్రి! ఇకపై ఆరోగ్య శ్రీ ద్వారా...
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #PawanKalyan #Repalle #VarahiVijayabheri #Janasena #TDP-JanaSena-BJPAlliance #Jagan #YSRCP
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.