వైకాపా నేత గౌతమ్రెడ్డిపై రౌడీషీట్ ఎందుకు క్లోజ్ చేశారో తేలుస్తాం! విజయవాడ సీపీ కఠిన వైఖరి!

Header Banner

వైకాపా నేత గౌతమ్రెడ్డిపై రౌడీషీట్ ఎందుకు క్లోజ్ చేశారో తేలుస్తాం! విజయవాడ సీపీ కఠిన వైఖరి!

  Thu Nov 14, 2024 20:57        Politics

బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్లపై కఠినంగా ముందుకెళ్తున్నట్లు విజయవాడ (Vijayawada) సీపీ రాజశేఖర్ బాబు తెలిపారు. విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రూ.కోట్ల విలువైన స్థలం కొల్లగొట్టేందుకు వైకాపా నేత, ఫైబర్నెట్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ గౌతమ్రేడ్డి (Goutham Reddy) కిరాయి హత్యకు ప్రణాళిక వేసినట్లు విచారణలో తేలిందన్నారు. గౌతమ్రేడ్డిపై హత్య సహా 43 కేసులు నమోదైనట్లు తెలిపారు. అతడిపై గతంలో రౌడీషీట్ నమోదైందని.. అయితే, అది ఎందుకు మూసివేశారో పరిశీలిస్తామని చెప్పారు. గౌతమ్రేడ్డిపై నమోదైన కేసులన్నింటిపైనా విచారణ చేస్తామన్నారు. "స్థలం విషయంలో నకిలీ దస్త్రాలతో గౌతమ్రేడ్డి మోసగించినట్లు ఫిర్యాదుల వచ్చాయి. ఉమామహేశ్వరశాస్త్రి ఇచ్చిన ఫిర్యాదు పైనా చర్యలు తీసుకుంటున్నాం. ఈ కేసు సంబంధించి ఐదుగురు పరారీలో ఉన్నారు. గాలించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. నలుగురు దొరికారు.. అనిల్ను పట్టుకోవాల్సి ఉంది. అనిల్కు కూడా పృథ్వీరాజ్ నుంచి కాల్స్ ఉన్నాయి. సాంకేతిక ఆధారాలన్నీ సేకరించి విచారణ చేస్తున్నాం. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఊరుకునేది లేదు. రౌడీలు ఇష్టారాజ్యంగా చేస్తామంటే వదిలే ప్రసక్తే లేదు” అని సీపీ స్పష్టం చేశారు.


ఇంకా చదవండిఆమెకు ఆ అరబి కుటుంబం దేవుడుతో సమానం! పొగడ్తల తో ముంచేత్తుతున్న తెలుగు ఆడ పడుచు! ఇంతకీ ఆమెకు ఏమి జరిగిందంటే! 14



కేసు నేపథ్యమిదీ..
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. సత్యనారాయణపురం శివాలయం వీధికి చెందిన గండూరి ఉమామహేశ్వరశాస్త్రి తల్లి పేరిట లక్ష్మీనగర్లో స్థలం కొని, 2014లో రిజిస్టర్ చేశారు. తమ స్థలాన్ని గౌతమ్రేడ్డి ఫోర్జరీ పత్రాలతో కబ్జా చేశారని ఉమామహేశ్వరశాస్త్రి ఆరోపిస్తున్నారు. ఈ స్థలంపై వీరిద్దరి మధ్య ఏడేళ్లుగా వివాదం నడుస్తోంది. గౌతమ్రేడ్డి విజయవాడ కార్పొరేషన్ అనుమతి తెచ్చి ఈ స్థలంలో గ్రౌండ్ ఫ్లోర్, రెండు అంతస్తులు నిర్మించారు. 2017లో శాస్త్రి ఫిర్యాదు మేరకు సత్యనారాయణపురం ఠాణాలో గౌతమ్రేడ్డిపై కేసు పెట్టారు. ఆయన హైకోర్టుకెళ్లి స్టే తెచ్చుకున్నారు. కబ్జా, అక్రమ నిర్మాణంపై శాస్త్రి ఎడతెగని న్యాయ పోరాటం చేశారు. చివరకు రెండో అంతస్తు కూల్చేందుకు అధికారులు ఉపక్రమించగా.. వైకాపా నేత హైకోర్టుకు వెళ్లి 4 వారాల వరకు యథాతథ స్థితి ఆదేశాలు తెచ్చుకున్నారు. ఈ స్థలం విలువ దాదాపు రూ.10 కోట్లని అంచనా.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


ఏపీ ప్రజలకు మరో గుడ్ న్యూస్! ఆడబిడ్డ నిధి పథకం.. నెల నెలా మహిళల అకౌంట్లో రూ.1,500!

 

మందుబాబులకు కిక్కే కిక్కు.. మరో కొత్త రకం మందు వచ్చేసింది! అతి తక్కువ ధరకే!

 

ఏపీలో బీచ్ కు వెళ్లాలంటే ఛార్జీ కట్టాల్సిందే! ఈ చోట్ల ఎప్పటి నుంచి అంటే? - ఎంత అంటే!

 

వైసీపీకి మరో షాక్.. మాజీ మంత్రిపై కేసు నమోదు చేసిన ఐ-టీడీపీ నేత! ఎందుకో తెలుసా?

 

గుడ్‌న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం.. నవంబర్ 22న ప్రారంభం! అస్సలు మిస్ అవకండి - డబ్బులే డబ్బులు!

 

శుభవార్త.. APలో రిలయన్స్ ఇండస్ట్రీస్ భారీ ప్రాజెక్టు.. ఏకంగా 65 వేల కోట్లతో! యువతకు లక్షల్లో ఉద్యోగాలు!

 

మూడవ విడత నామి నేటెడ్ పోస్టులు విడుదల! ఆ లిస్ట్ మీకోసం! ఒక్కో కార్పొరేషన్‌కు 15 మంది!

 

వైసీపీకి వరుస షాక్ లు! నేతలపై పోలీసులు లుకౌట్ నోటీసులు! ప్రత్యేక బృందాలు రంగంలోకి.. అంతా పరారే పరార్!

 

అసెంబ్లీ భోజనంపై స్పీకర్ అయ్యన్నపాత్రుడి తీవ్ర ఆగ్రహం! పద్ధతి మార్చుకోవాలంటూ హెచ్చరిక!

 

జగన్ అసెంబ్లీకి రాకపోతే చట్టం తన పని తాను చేసుకుపోతుంది! అయ్యన్న పాత్రుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం! ఎమ్మెలందరికీ శిక్షణ తరగతులు!

 

వైసీపీకి మరో బిగ్ షాక్! జనసేనలోకి కార్పొరేటర్ ప్రతినిధులుసీనియర్ నేతలు! పవన్ కల్యాణ్ సాదరంగా ఆహ్వానం!

 

"ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! ఎవరో తెలుసా.?

 

APSRTC మరో శుభవార్త.. నిరుద్యోగులకు అదిరిపోయే అవకాశం ఇది! ఎలాంటి రాత పరీక్ష లేకుండానే!

 

లెక్క తేలుస్తాం.. పవన్ కళ్యాణ్ సీరియస్ వార్నింగ్! మామూలుగా లేదు!

 

రూ.2.94 లక్షల కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్! రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం!

 

ఏపీలో రూ.40వేల కోట్లతో టాటాపవర్ ప్రాజెక్టులు! 10వేల ఉద్యోగాలతో ఐటీ డెవలప్మెంట్ సెంటర్!

 

మూడవ నామినేటెడ్ పోస్టుల లిస్ట్ విడుదల? ఏ ఏ పదవులు అంటే!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group




   #andhrapravasi #bladebatch #rowdy #casefile #vijayawada #todaynews #flashnews #latestupdate