ఏపీలో కొత్త రేషన్ కార్డులు.. కావాల్సిన డాక్యుమెంట్స్ ఇవే! ఇక్కడే బిగ్ ట్విస్ట్ ఇచ్చిన చంద్రబాబు!

Header Banner

ఏపీలో కొత్త రేషన్ కార్డులు.. కావాల్సిన డాక్యుమెంట్స్ ఇవే! ఇక్కడే బిగ్ ట్విస్ట్ ఇచ్చిన చంద్రబాబు!

  Tue Nov 26, 2024 09:00        Politics

సీఎం చంద్రబాబు సర్కార్ ఏపీ ప్రజలకు భారీ గుడ్ న్యూస్ చెప్పింది. నూతన సంవత్సర కానుకగా రాష్ట్ర ప్రజలకు బంపర్ ఆఫర్ ఇవ్వనున్నట్లు వెల్లడించింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన మరో హామీను కూటమి సర్కార్ నెరవేర్చబోతోంది. గత కొన్ని సంవత్సరాలుగా రాష్ట్రంలో అర్హులకు ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను అందించలేదు. తాజాగా కూటమి సర్కార్ రాష్ట్రంలోని అర్హులందరికీ రేషన్ కార్డులు మంజూరు చేయాలని సిద్దమవుతోంది. ఈ క్రమంలో డిసెంబర్ 2 నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ ప్రక్రియ డిసెంబర్ 28 వరకు కొనసాగుతుంది. గత ప్రభుత్వ హయాంలో గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా రేషన్ కార్డులు మంజూరు చేసినప్పటికీ, కొంతకాలంగా కొత్త రేషన్ కార్డుల మంజూరు చేయలేదు. అయితే పెళ్లైన కొత్త జంటలు, కుటుంబ సభ్యుల జాబితాలో మార్పులు చేర్పులు చేయాల్సినవారు, ఇంకా అర్హత గల ప్రజలు కొత్త రేషన్ కార్డుల కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

 

ఇంకా చదవండి: గుడ్ న్యూస్.. భ‌వ‌నాలు, లేఅవుట్ల అనుమ‌తులపై ఏపీ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం! త్వరలోనే వీటి తుది డిజైన్లకు - అమరావతిపై మంత్రి కీలక వ్యాఖ్యలు!

 

నాలుగు నెలల క్రితం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం 2024 సంక్రాంతి నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ నెలలో అందిన దరఖాస్తులను వెంటనే పరిశీలించి, అర్హులైన వారికి తక్షణమే రేషన్ కార్డులు జారీ చేసే విధంగా రంగం సిద్ధం చేస్తోంది కూటమి సర్కార్. మ్యారేజ్ సర్టిఫికేట్‌ను ఆధారంగా చేసుకుని కొత్తగా పెళ్లైన వారికి రేషన్ కార్డులు అందించే ప్రయత్నాలు చేస్తోంది సర్కార్. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన రేషన్ కార్డుల డిజైన్లను కాకుండా ఈ సారి రేషన్ కార్డులు ప్రత్యేక డిజైన్‌లో అందించనున్నట్లు తెలుస్తోంది. కార్డులపై కుటుంబ సభ్యుల ఫోటోలతో పాటు క్యూఆర్ కోడ్‌ను కూడా చేర్చనున్నట్లు సమాచారం. క్యూఆర్ కోడ్ ద్వారా రేషన్ వ్యవస్థ మరింత పారదర్శకంగా మారే అవకాశం ఉందని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. ప్రభుత్వం సంక్రాంతి నాటికి కొత్త రేషన్ కార్డులను ప్రజలకు అందజేసి, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఎం చంద్రబాబు సంకల్పించినట్లు సమాచారం. రేషన్ కార్డులు రాష్ట్రంలోని సంక్షేమ పథకాలకు కీలక ప్రామాణికంగా మారిన ఈ పరిస్థితుల్లో, కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ ప్రజలకు మరింత సౌలభ్యాన్ని అందించనున్నాయి. అయితే గత ప్రభుత్వ హయాంలో చాలా మంది ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా తెల్ల రేషన్ కార్డులు పొందినట్లు ఆరోపణలు రావడంతో.. కూటమి సర్కార్ మరోసారి వారి వివరాలను పరిశీలించి వారి అనర్హులను గుర్తించి.. వారి రేషన్ కార్డులను రద్దు చేయనున్నట్లు సమాచారం.

 

ఇంకా చదవండి: 25/11 తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మాజీ సీఎం జగన్ కు కేంద్రం ఊహించని షాక్! అసలు ఏం జరిగిందంటే!

 

అమెరికా జైలుకి జగన్ - జీవితాంతం ఏపీకి తిరిగిరాడు! నీకు ఇప్పుడు దమ్ము ఉంటే..?

 

26/11 తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

సుప్రీంకోర్టులో విజయపాల్‌కు గట్టి ఎదురుదెబ్బ! ఈ కేసులో ఇప్పటికే!

 

ట్రంప్ రాక ముందే వచ్చేయండి! విదేశీ విద్యార్థులకు అమెరికా వర్సిటీలు అలర్ట్!

 

అకౌంట్లోకి రూ.2.5 లక్షలు - ఈ పథకం ద్వారా పేదలకు వరం! మరో శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం!

 

ఏపీకి వస్తున్న మోదీ - అభివృద్ధికి పలు కీలక ప్రాజెక్టులతో కృషి! 25 వేల మందికి ఉపాధి లభించే అవకాశం!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Chandrababu #Chandrababuyagam #Familyfunction #AndhraPradesh #APNews