నాగబాబు త్వరలోనే రాజ్యసభకు వెళ్లబోతున్నారా? పార్టీ పెద్దలు ఏం చెప్తున్నారంటే!
Thu Nov 28, 2024 15:37 Politicsజనసేన నేత, మెగా బ్రదర్ నాగబాబు త్వరలోనే రాజ్యసభకు వెళ్లబోతున్నారా? ఈ ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది. వైసీపీకి చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్రావు, ఆర్. కృష్ణయ్య వేర్వేరు కారణాలతో రాజీనామా చేయడంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి. వచ్చే నెలలో ఎన్నికలు జరగనుండగా, జనసేన నుంచి పెద్దలు నాగబాబును సభకు పంపాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటనలో ఉండగానే ఈ విషయంపై క్లారిటీ వచ్చినట్టు తెలిసింది.
ఇంకా చదవండి: ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల! కూటమి కీలక స్థాయికి చేరిక!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
వచ్చే నెల మూడో తేదీ నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండగా 10న ముగుస్తుంది. 13 వరకు నామినేషన్లు ఉపసంహరించుకోవచ్చు. డిసెంబర్ 20న పోలింగ్ నిర్వహించి అదే రోజున ఫలితాలు వెల్లడిస్తారు. కాగా, ఏపీలో కూటమి ప్రభుత్వానికి పూర్తిస్థాయిలో మెజార్టీ ఉండడంతో ఎన్నికలు జరగనున్న మూడు రాజ్యసభ స్థానాలూ కూటమికి దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. ఒక్క అభ్యర్థి రాజ్యసభకు ఎన్నిక కావాలంటే కనీసం 25 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. వైసీపీకి ప్రస్తుతం ఉన్నది 11 మందే. ఈ నేపథ్యంలో వైసీపీ ఈ ఎన్నికల బరిలో నిలిచే అవకాశం దాదాపు లేనట్టే.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు.. వారంతా జైలుకు వెళ్లడం ఖాయం - గుట్టును రట్టు చేసిన RRR!
ఈ నెల 30 నుంచి '6 అబద్ధాలు 66 మోసాలు' పేరుతో బీజేపీ నిరసన! కాంగ్రెస్ ప్రజాపాలన విజయోత్సవాలకు!
గుడ్ న్యూస్: 30 శాతం సబ్సిడీతో మహిళకు రూ. 5 లక్షలు! నెలకు ఎంత కట్టాలంటే? అసలు విషయం ఇదే!
శుభవార్త చెప్పిన చంద్రబాబు.. 10,000 మందికి ఉద్యోగాలు! ఆ జిల్లాలో ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #Politics #TDP #JSP #YCP #PawanKalyan #Janasena #AP #AndhraPradesh #YSJagan #Assembly #BJP #NaraLokesh #PawanKalyan #PSPK #HighCourt #Amaravathi #BJP
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.