ఏపీ ప్రజలకు ముఖ్యమైన వార్త.. ప్రభుత్వం నిన్నటి నుంచి 3 రోజులపాటూ! అవన్నీ ఉచితంగా పొందండి!

Header Banner

ఏపీ ప్రజలకు ముఖ్యమైన వార్త.. ప్రభుత్వం నిన్నటి నుంచి 3 రోజులపాటూ! అవన్నీ ఉచితంగా పొందండి!

  Sat Dec 07, 2024 07:00        Politics

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిన్న నుంచి గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించబోతోంది. ఈ సదస్సుల్లో భూముల సమస్యల్ని పరిష్కరిస్తారు. గత వైసీపీ ప్రభుత్వం లాండ్ టైట్లింగ్ యాక్ట్ తెచ్చాక.. భూ రికార్డులకు సంబంధించి కొన్ని సమస్యలు వచ్చాయి. కూటమి ప్రభుత్వం లాండ్ టైట్లింగ్ యాక్ట్‌ని రద్దు చేసింది. కానీ సమస్యలు అలాగే ఉన్నాయి. అందుకే ప్రభుత్వం నిన్న నుంచి 3 రోజులపాటూ.. అంటే 8వ తేదీ వరకూ.. గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించనుంది. ఈ సదస్సుల్లో భూములకు సంబంధించి అన్ని రకాల సమస్యల్నీ పరిష్కరిస్తారు. అసైన్డ్ భూములు, పోరంబోకు భూములు, బీడు భూములు, పోడు భూములు, గిరిజన భూములు, వాగు భూములు, డొంక భూములు, దేవాదాయ భూములు, ఈనాం భూములు, వక్ఫ్ భూములు, 22 ఏ కిందకు వచ్చే భూములు, ఫ్రీ హోల్డ్ భూముల సమస్యలు పరిష్కరిస్తూ.. వాటి వివరాల్ని నమోదు చేసుకుంటారు.

 

ఇంకా చదవండి: నెల్లూరులో అలా చేసే వారికి కఠిన చర్యలు తప్పవు! మంత్రి కీలక వ్యాఖ్యలు!

 

తద్వారా.. భూముల రికార్డులు అప్‌డేట్ అవుతాయి. ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం.. అన్ని గ్రామాల్లో ఈ సదస్సులు ఉంటాయి. ప్రతి మండలానికి ఓ ప్రత్యేక అధికారి ఉండి పర్యవేక్షిస్తారు. అలాగే ప్రతి నియోజకవర్గానికీ ఒక ప్రత్యేక అధికారి ఉండి అంతా చూసుకుంటారు. వారే ఈ సదస్సుల్ని నిర్వహిస్తారు. వారితోపాటూ.. మండల నోడల్‌ అధికారి, తహసీల్దారు, ఆర్‌ఐ, మండల సర్వేయర్, వీఆర్వో, గ్రామ సర్వేయర్‌ ఇతర సిబ్బంది, సచివాలయ ఉద్యోగులు కూడా రెవెన్యూ సదస్సులకు వస్తారు. అక్కడ అందరూ కలిసి సమస్యల్ని పరిష్కరిస్తారు. ఉచితంగా 100 సేవలు అందిస్తారు. భూములు అంటేనే చాలా సమస్యలు ఉంటాయి. ప్రతీ జిల్లాలో ఇలాంటివి లక్షల్లో ఉన్నాయి. గత వైసీపీ పాలనలో చాలా మంది తమ భూములకు సరిగ్గా సర్వే చెయ్యలేదని అంటున్నారు.

 

ఇంకా చదవండి: జగన్ కి షాక్.. విజయసాయిరెడ్డిపై క్రిమినల్ కేసు! ఎవరు పెట్టారు అంటే?

 

పాత సర్వేలో తాము భూమిని కోల్పోయామనీ, మళ్లీ సర్వే చేసి, తమ భూమి తమకు ఇవ్వాలని కోరుతున్నారు. భూమికి సంబంధించిన మ్యాప్ సరిగా తీసుకోలేదని అంటున్నారు. ఇందుకు సంబంధించి గ్రామ సభల్లో భారీగా అర్జీలు వచ్చాయి. కొన్ని గ్రామాల్లో అధికారులు ఆల్రెడీ రీ-సర్వే చేశారు. ఆ తర్వాత ల్యాండ్ రికార్డులను అప్‌డేట్ చేశారు. ఇంకా చాలా చోట్ల అప్‌డేట్ కాలేదు. అందువల్ల ఇవాళ్టి నుంచి జరిగే సదస్సుల్లో అన్నీ సెట్ అవుతాయని అనుకుంటున్నారు. ఐతే.. అంతా సజావుగా జరిగితే, ఈ కార్యక్రమం మూడు రోజుల్లోనే పూర్తవుతుంది. అలా కాకుండా.. గందరగోళం తలెత్తితే మాత్రం ఎక్కడి సమస్యలు అక్కడే ఉండే పరిస్థితి ఉంటుంది. అధికారుల ద్వారా ల్యాండ్ రికార్డులను అప్‌డేట్ చేయిస్తోంది. 3 రోజుల్లో పని పూర్తి కాకపోతే.. ఆ తర్వాత కూడా కొనసాగించే అవకాశాలు ఉంటాయి.

 

ఇంకా చదవండి: ఏపీలో కూటమి ప్రభుత్వం మరో కీలక ప్రకటన! నామినేటెడ్ పోస్టుల మరో జాబితా సిద్దం - దక్కేది వీరికే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఉచిత గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తున్నారా! ఇది తప్పక తెలుసుకోండి - లేదంటే.. ప్రమాదమే!

 

కొడాలికి మరో బిగ్ షాక్...14 రోజుల రిమాండ్ - నెల్లూరు సబ్​జైలుకు తరలింపు! అసలేం జరిగిదంటే!

 

ఆళ్ల నాని టీడీపీలోకి ఎంట్రీ పై చంద్రబాబు క్లారిటీ! పలువురు వైసీపీ నేతలు కూటమి పార్టీలోకి!

 

నేడు (6/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు! మంత్రి లోకేశ్ సమక్షంలో గూగుల్ తో కీలక ఒప్పందం!

 

బీఆర్ఎస్‌కు ఊహించని షాక్! కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే!

 

గుడ్ న్యూస్.. ఏపిలో కొత్తగా 53 కళాశాలలు! ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం! 37 మండలాల్లో 47, 2 పట్టణ ప్రాంతాల్లో..

 

నేడు (5/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

నిరుద్యోగులకు చంద్రబాబు ప్రభుత్వం మంచి అవకాశం.. 8వ తేదీ నుంచి ప్రారంభం!Don'tMiss

 

కొడాలి నానికి వరుస షాక్ లు! తొమ్మిది మంది అరెస్ట్ - పరారీలో ప్రధాన అనుచరుడు..

 

మహిళలకు అప్డేట్.. ఉచిత బస్సు అమలుపై కీలక ప్రకటన! 1600 కొత్త బస్సులను కొనుగోలు!

 

కొడాలి నానికి వరుస షాక్ లు! తొమ్మిది మంది అరెస్ట్ - పరారీలో ప్రధాన అనుచరుడు..

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Chandrababu #Chandrababuyagam #Familyfunction #AndhraPradesh #APNews