చంద్రబాబు ఒక్క ఆంధ్రాకే కాదు... ప్రపంచానికి నాయకుడు అవ్వాలి! భావాలను మాటలలో వర్ణించలేము! "వన్ డే విత్ సీఎం" అనుభవాలు పంచుకున్న ఎన్ఆర్ఐ!

Header Banner

చంద్రబాబు ఒక్క ఆంధ్రాకే కాదు... ప్రపంచానికి నాయకుడు అవ్వాలి! భావాలను మాటలలో వర్ణించలేము! "వన్ డే విత్ సీఎం" అనుభవాలు పంచుకున్న ఎన్ఆర్ఐ!

  Sun Dec 08, 2024 20:02        Politics

మొన్న జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయానికి ఎన్నారైలు ఎన్నో రకాల ప్రచార కార్యక్రమాలలో భాగస్వాములు అయ్యారన్న విషయం అందరికీ విదితమే. అయితే ఆ సమయంలో ఎన్నారైలు మరింత ఆసక్తిగా, సమర్థవంతంగా పనిచేయాలనే ఉద్దేశంతో, ఎన్నారై టీడీపీ సెల్ ప్రచార కార్యక్రమాలలో పాల్గొనే ఎన్నారైలకు ఒక దిశా నిర్దేశం చేస్తూ మన ప్రియతమ నాయకుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు గారు పిలుపునివ్వడం జరిగింది. 

 

ఈ సందర్భంగా ఎన్నారై టీడీపీ సెల్ ప్రెసిడెంట్ డాక్టర్ రవి వేమూరు, సీఎం చంద్రబాబు అనుమతితో ఒక ప్రణాళికను తయారుచేసి, ఆ ప్రణాళికకు అనుగుణంగా ఎన్నారైల ను ప్రోత్సహించడానికి ఒక ప్రకటన చేయడం జరిగింది. ఆ ప్రకటన ప్రకారం ఎవరైతే ఎన్నారై టీడీపీ సెల్ నిర్దేశించిన కార్యక్రమాలు చేయడంలో ముందంజలో ఉంటారో, వారిని ఎన్నికలు పూర్తయిన తర్వాత చంద్రబాబు గారితో ఒకరోజు అంతా(one day with CM) గడిపే విధంగా ఏర్పాటు చేస్తామని ప్రకటించడం జరిగింది.

 

ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ భారీ మెజారిటీతో గెలిచి అధికారంలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ గెలుపులో ఎంతోమంది ఎన్నారైలు భాగస్వాములు అయ్యి ఎంతో కృషి చేయడం జరిగింది, దానికి అనుగుణంగా గతంలో ఎన్నారై టిడిపి సెల్ ప్రెసిడెంట్ డాక్టర్ రవి వేమూరు ఎన్నికల ముందు చేసిన ప్రకటనను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురాగా, ఆయన వెంటనే ఒప్పుకోవడం జరిగింది. ఆ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

కాగా, ఈ ఎన్నారైలు అందరిలో అద్భుతంగా పని చేసి, ముందంజలో ఉన్న వారిలో శ్రీకాళహస్తికి చెందిన స్వీడన్ లో నివసిస్తున్న ఉన్నం నవీన్ ఒకరు. స్వీడన్ నుండి ఎన్నికలకు నాలుగు నెలల ముందే భారత్‌కు వచ్చి ఎన్నారై టిడిపి నిర్దేశించిన పనుల్లో చురుగ్గా పాల్గొన్నారు తన వంతు కృషి చేశారు. దానిలో భాగంగా డిసెంబర్ 2 న ఉదయం 10 గంటల నుండి సాయంత్రం వరకు అతను సీఎం చంద్రబాబుతో గడిపారు. 

 

ఈ మీట్ పూర్తయిన తర్వాత ఆంధ్ర ప్రవాసి తో ఎన్నారై ఉన్నం నవీన్ తన అనుభవాలను పంచుకోవడం జరిగింది. అవన్నీ కూడా తన మాటల్లోనే... 
నవీన్ ఉదయం 9:30 కు సీఎం చంద్రబాబు గారి ఇంటికి చేరుకున్నారు. అక్కడ ఎంతో పటిష్టమైన సెక్యూరిటీ ఉంటుంది. దాన్ని దాటుకుని వెళ్లడం అసాధ్యమని, తనకు దక్కిన అవకాశం వల్ల సులువుగా వెళ్లగలిగాను అని, విషయం తెలుసుకున్న సెక్యూరిటీ సిబ్బంది ఫార్మాలిటీస్ పూర్తి చేసి వెంటనే లోపలికి పంపించడం జరిగింది అని తెలిపారు. లోపలికి వెళ్ళిన తర్వాత వ్యక్తిగత సిబ్బంది మరియు సీఎం గారి అధికారులు అందరూ కూడా ఎంతో చక్కగా పలకరిస్తూ మర్యాదలు చేశారని తెలిపారు. తను ఇంట్లోకి వెళ్ళగానే one day with CBN కోసం ఎన్నారై వచ్చారు అని మీటింగ్ లో ఉన్న సీఎం గారికి తెలియజేశారు, ఆయన వెంటనే స్పందించి తనను మీటింగ్ లోకి అనుమతించారు అని తెలిపారు. ఆ మీటింగ్ దగ్గర నుండి సాయంత్రం వరకు సీఎం గారి వెంటే ఉన్నాను అని తెలిపారు. 

 

ఇంకా చదవండిఏపీలో కూటమి ప్రభుత్వం మరో కీలక ప్రకటన! నామినేటెడ్ పోస్టుల మరో జాబితా సిద్దం - దక్కేది వీరికే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

ఇలాంటి అవకాశం దొరకడం తనకు ఒక అద్భుతమైన అనుభవమని, సీఎం చంద్రబాబుతో అంత దగ్గర నుండి ట్రావెల్ చేయడం జీవిత కాలానికి ఒకసారి వచ్చే అవకాశంగా భావిస్తున్నానని, పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారిని పార్టీ గుర్తుంచుకుంటుంది అని, ఇంకా రాబోయే వారికి ఇది ఒక ఇన్స్పిరేషన్ అవుతుంది అని, భవిష్యత్తులో ఇలాంటివి ఎన్నో అవకాశాలు పార్టీ కోసం శ్రమించే వారికి దక్కుతాయని తను భావిస్తున్నాను అని వెల్లడించారు.

 

సీఎం చంద్రబాబు గారి గురించి అడిగినప్పుడు ఆయన పనితీరు, మెమరీ పవర్, ఆయన ఇచ్చే గైడెన్స్, ఆయనకున్న టెక్నికల్ నాలెడ్జ్, కమాండింగ్ గురించి ఎంతో గొప్పగా చెప్పారు. అంత గొప్ప వ్యక్తిని కలిసినందుకు ఎంతో ఆనందంగా, గర్వంగా ఉందని, పార్టీ కోసం పనిచేసినందుకు సీఎం చంద్రబాబు ఎంతో అభినందించారని, భవిష్యత్తులో అందరికీ అండగా ఉంటానని హామీ ఇచ్చారని తెలిపారు.

 

ఈ one day with CM ప్రోగ్రాం గురించి తెలుసుకున్న చంద్రబాబు గారి వ్యక్తిగత సిబ్బంది కూడా ఆశ్చర్యపోయి ఇలా జరగడం ఇదే మొదటి సారి అని వ్యక్తపరిచారని, ఆ మాటలు విన్నందుకు ఇంకా ఆనందం వేసిందని ఉన్నం నవీన్ తెలిపారు. సీఎం చంద్రబాబు గారు ఇంత హుషారుగా ఉండడానికి ఆయన తీసుకునే ఆహారమే కారణమని, డైట్ విషయంలో అసలు వెనకడుగు వేయరు అని డైట్ గురించి ఆంధ్ర ప్రవాసి అడిగిన ఒక ప్రశ్నకు జవాబిచ్చారు.

 

ఇక పోతే తను చేసిన వర్క్ గురించి మాట్లాడుతూ ఎలక్షన్ సమయంలో నాలుగు నెలలు ముందుగా వచ్చి భారత్ లోనే ఉన్నానని, అదేవిధంగా స్వీడన్ లో ఉంటూ ఫోన్ కాల్స్ ద్వారా వాళ్ళ నియోజకవర్గంలో ఉన్న వారితో సంప్రదింపులు జరిపానని తెలిపారు. అలాగే, గతంలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినప్పుడు మొదటిసారిగా కాల్స్ చేసినందుకు ప్రోత్సాహకారంగా సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. అది ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చి ఈ ప్రోగ్రాం లో పాల్గొనేందుకు స్ఫూర్తినిచ్చిందని ఆయన తెలిపారు. దాంతోపాటు ఆ సమయంలో తన తల్లిదండ్రుల ఆశీస్సులు మరియు భార్య పిల్లల సహకారం, ప్రోద్బలం ఎంతో ఉందని, వాళ్ల ప్రోత్సాహం లేకుండా ఇది సాధ్యమయ్యేది కాదని గుర్తు చేసుకున్నారు. ఈ అవకాశం తనకు దక్కినందుకు తన కుటుంబ సభ్యులు ఎంతో సంతోషించారు అని అన్నారు. ఈ విషయం తెలిసాక తన బంధువులు, ఫ్రెండ్స్ తనను ఎంతో అభినందించారని, పాత స్నేహితులు ఈ సందర్భంగా చాలా రోజుల తర్వాత మళ్లీ కలిసి అభినందించడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు.

 

ఈ విషయంలో ఎన్నారై టిడిపి ఇచ్చిన మాట కోసం one day with CM అనే ప్రోగ్రాం సక్సెస్ అవ్వాలని ఎన్ఆర్ఐ టీడీపీ సెల్ ప్రెసిడెంట్ డా. రవి వేమూరు ఎంతో కష్టపడ్డారని, సీఎం అపాయింట్‌మెంట్ కోసం చాలా ప్రయత్నించారని తెలిపారు. అదేవిధంగా ఎన్నారై టీడీపీ సెల్ కోఆర్డినేటర్ చప్పిడి రాజశేఖర్ NRI లు అందరికీ అందుబాటులో ఉంటూ సూచనలు, సలహాలు అందిస్తూ వెన్ను తట్టి ప్రోత్సహిస్తారని, అదేవిధంగా తనకు కూడా ఎంతో అండగా ఉంటూ తనకు సూచనలు చేశారని, వీరితో పాటుగా మంగళగిరిలో ఉన్న ఎన్ఆర్ఐ టిడిపి సెల్ సిబ్బంది అందరు కూడా ఎంతో సహకరించారని తెలుపుతూ ఈ సందర్భంగా వారందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేశారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

బాపట్ల హైస్కూల్లో 'టగ్ ఆఫ్ వార్ఆడిన చంద్రబాబునారా లోకేశ్! గెలిచింది ఎవరో తెలుసా?

 

ఏపీకి మరోమారు భారీ వర్షాల ముప్పు.. బంగాళాఖాతంలో అల్పపీడనం! ఆ జిల్లాలకు రెడ్ అలెర్ట్!

 

ఏపీకి మరోమారు భారీ వర్షాల ముప్పు.. బంగాళాఖాతంలో అల్పపీడనం! ఆ జిల్లాలకు రెడ్ అలెర్ట్!

 

ఏపీ ప్రజలకు ముఖ్యమైన వార్త.. ప్రభుత్వం నిన్నటి నుంచి రోజులపాటూ! అవన్నీ ఉచితంగా పొందండి!

 

నేడు (7/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

జగన్ కి షాక్.. విజయసాయిరెడ్డిపై క్రిమినల్ కేసు! ఎవరు పెట్టారు అంటే? 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 

 


   #AndhraPravasi #Politics #NRIs #NRITDP #AndhraPradesh