ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రైతులకు మరో చాన్స్‌.. వారికి పంటల బీమా పథకాలు!

Header Banner

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రైతులకు మరో చాన్స్‌.. వారికి పంటల బీమా పథకాలు!

  Mon Dec 23, 2024 07:00        Politics

రాష్ట్రంలోని రైతులకు ఉపయోగపడేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2024-25 రబీ సీజన్‌కు సంబంధించి పంటల బీమా ప్రీమియం చెల్లింపు గడువును పొడిగించింది. వాతావరణ మార్పులు అంటే అతివృష్టి, అనావృష్టి వంటి పరిస్థితులు తలెత్తినప్పుడు రైతులు నష్టపోకుండా ఉండేందుకు ప్రభుత్వాలు వారికి పంటల బీమా పథకాలు అమలు చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం అమలు చేస్తోంది. ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన బీమా ప్రీమియాన్ని రైతుల తరుఫున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే చెల్లించింది. అయితే రబీ సీజన్‌కు మాత్రం రైతులే పంటల బీమా ప్రీమియం చెల్లించాల్సి ఉంది. వివిధ పంటలకు బీమా ప్రీమియం చెల్లించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిసెంబర్ 15వ తేదీ వరకూ తొలుత సమయం ఇచ్చింది. అయితే ఎక్కువ మంది రైతులకు ప్రయోజనం కలగాలనే ఉద్దేశంతో ఈ గడువును డిసెంబర్ 31 వరకూ పొడిగించారు. ఈ నేపథ్యంలో రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు కోరుతున్నారు.

 

ఇంకా చదవండి: దేశ రాజధాని ఢిల్లీలో TDP సభ్యత్వ నమోదు కార్యక్రమం! సభ్యత్వంతో సరికొత్త రికార్డు!

 

వివిధ పంటలకు బీమా సౌకర్యం కల్పిస్తున్నారని.. పంటల ప్రకారం బీమా ప్రీమియం చెల్లించాలని సూచిస్తున్నారు. బ్యాంకుల్లో పంట రుణాలు తీసుకున్న రైతులకు బ్యాంకుల బీమా ప్రీమియం సొమ్మును మినహాయించుకుని ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పి్స్తున్నాయి. బ్యాంకుల్లో పంట రుణాలు తీసుకోని రైతులు.. ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్ బుక్, భూమి తాలూకు పాస్ బుక్ వంటి వివరాలతో రైతు సేవా కేంద్రాలను సందర్శించాలని అధికారులు సూచిస్తున్నారు. వర్షాభావ పరిస్థితులు తలెత్తి పంట నష్టం సంభవించినప్పుడు లేదా అకాల వర్షాల కారణంగా పొలాల్లోనే పంట నష్టం జరిగినప్పుడు.. ఇలాంటి సందర్భాల్లో ఈ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్‌లు రైతులకు అండగా ఉంటాయి. అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంటల బీమా పథకాలను అమలు చేస్తున్నాయి. అయితే అవగాహన లోపంతో చాలా మంది రైతులు పంటల బీమా చేసేందుకు ముందుకు రావటం లేదని వ్యవసాయశాఖ అధికారులు చెప్తున్నారు. పంట నష్టం జరిగినప్పుడు బీమా సంస్థలు అందించే పరిహారంతో ఆర్థిక ఇబ్బందులు తప్పుతాయని చెప్తున్నారు.. ప్రస్తుతం పంటల బీమా ప్రీమియం గడువు పొడిగించిన నేపథ్యంలో ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచిస్తున్నారు.


ఇంకా చదవండి: నామినేటెడ్ డైరెక్టర్స్ లిస్టు! 13 కార్పొరేషన్ ల నియామక జీవో జారీ! పూర్తి లిస్ట్ మీ కోసం!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

డబ్బులు వడ్డీకి ఇస్తే జైలు శిక్షే మరియు జరిమానా! ప్రభుత్వం దిమ్మతిరిగే రూల్స్..

 

అల్లు అర్జున్‌ అరెస్ట్ ఎందుకు.. రేవంత్ రెడ్డి పై పురంధేశ్వరి షాకింగ్ కామెంట్స్!

 

ఏపీలో తగ్గిన మద్యం ధరలు! కొత్త రేట్లు చూస్తే.. బాటిల్ దింపరు! ప్రస్తుతం కొత్త మద్యం పాలసీ!

 

అల్లు అర్జున్ ఇంటిపై రాళ్లతో దాడి! విద్యార్థి సంఘాల ఆందోళన!

 

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్! మంత్రుల పేషీల్లో ఉద్యోగాలు.. జీతం రూ.50 వేలు!Don'tMiss

 

వైసీపీలోకి కీలక నేత ఎంట్రీ! జగన్‌తో భేటీ - దీని కారణంగానే..

 

అమెరికా పౌరసత్వాల్లో పెరిగిన భారతీయులు! ఈ ఏడాది ఎంతమంది సిటిజెష్‌షిప్ పొందారో తెలిస్తే షాక్!

 

అల్లుఅర్జున్ కు ఊహించని షాక్! నేను చూస్తూ ఊరుకోను - సినీ ఇండస్ట్రీకి రేవంత్ హెచ్చరిక!

 

ఎస్‌బీఐలో 13735 ఖాళీలు! హైదరాబాద్‌ స ర్కిల్‌లో 342 పోస్టులు!

 

మందుబాబులకు అదిరిపోయే గుడ్ న్యూస్! ఏపీలో మద్యం ధరలు తగ్గించుకున్న 11 కంపెనీలు!

 

నేడు (21/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్.. కొత్త ఇళ్ల మంజూరు, అప్లై చేసుకోండి ఇలా! ఈ డాక్యుమెంట్లు ఉంటే చాలు!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #Chandrababu #Chandrababuyagam #Familyfunction #AndhraPradesh #APNews