పవన్ కళ్యాణ్ అద్భుతమైన ప్రసంగం.. మోదీ నిర్దేశకత్వం, చంద్రబాబు నాయకత్వం... ఇదే మా పంథా!

Header Banner

పవన్ కళ్యాణ్ అద్భుతమైన ప్రసంగం.. మోదీ నిర్దేశకత్వం, చంద్రబాబు నాయకత్వం... ఇదే మా పంథా!

  Wed Jan 08, 2025 19:32        Politics

ఒక సదుద్దేశం, ఒక సదాశయం లేకుండా ఒకరు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచినా అది ఒక నిరర్ధకమైన నడకగా చరిత్రలో నిలిచిపోతుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు.. కానీ ఇంకొకరు ఒక సత్సంకల్పంతో, సదాశయంతో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రజలందరితో మమేకమై వారందరినీ ఏకతాటిపై నడిపిస్తే అది ఆత్మనిర్భర్ భారత్ అవుతుందని ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇవాళ విశాఖలో ప్రధాని నరేంద్ర మోదీ హాజరైన ప్రజావేదిక సభకు పవన్ కల్యాణ్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. "కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రజలకు వారి పరిసరాల శుభ్రత భాధ్యతను తెలియజేస్తే అది స్వచ్ఛ భారత్ అవుతుంది. అదే కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ప్రజల్లో ధైర్యసాహసాలు నింపితే అది ఒక బలిష్టమైన, పటిష్టమైన భారత్ అవుతుంది. అది ఒక రోజున అఖండ భారత్ అయి తీరుతుంది. భారత్ ను ప్రపంచ దేశాల్లో మూడో బలమైన ఆర్థిక వ్యవస్థగా  తీర్చిదిద్దేలా నడిపిస్తున్న మన ప్రియతమ ప్రధానికి నా తరఫున, ఐదు కోట్ల మంది ఆంధ్రుల తరఫున హృదయపూర్వక నమస్కారాలు. విద్యార్థి నాయకుడిగా రాజకీయాల్లోకి ప్రవేశించి, రెవెన్యూ మంత్రిగా, ఆర్థికమంత్రిగా అంచెలంచెలుగా ఎదిగి, టీడీపీ రథ సారథి అయి, నాలుగోసారి ముఖ్యమంత్రి అయి, తెలుగు ప్రజలను అభివృద్ధి పథంలో నడిపిస్తున్న రాజకీయ ఉద్ధండులు అయిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు నా హృదయపూర్వక నమస్కారాలు.

 

ఇంకా చదవండిమాజీ ఏఎస్పీ మరోసారి కస్టడీలో! సాక్ష్యాల ఆధారంగా విచారణలో కీలక మలుపు!

 

 

నా సహచర మంత్రి నారా లోకేశ్ కు, ఎన్డీయే కూటమి ఎమ్మెల్యేలు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరికి, బీజేపీ నేతలకు పేరుపేరునా నమస్కారాలు. మాకు ఓట్లేసి గెలిపించిన ప్రజలకు పేరుపేరునా నమస్కారాలు. ఇవాళ  ప్రధాని మోదీ 7 లక్షల మందికి ఉపాధి కల్పించే రూ.2.10 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. అవినీతితో కూరుకుపోయి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక విలవిల్లాడుతున్న తరుణంలో మీరు మా కోసం నిలబడ్డారు. లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులతో మాకు అండగా నిలుస్తున్నందుకు ప్రధాని మోదీకి ధన్యవాదాలు. 24 గంటలు తాగునీరు, మారుమూల గిరిజన గ్రామాలకు రోడ్లు వేయగలుగుతున్నామంటే అందుకు కారణం మోదీ గారు వెన్నుతట్టి మద్దతుగా నిలుస్తున్నారు. గత ఐదేళ్ల అవినీతి, అరాచక పాలనతో ఏపీ అంధకారంలో మునిగిపోయినప్పుడు...  ఆంధ్రాకు ఇక ఎలాంటి అవకాశమే లేదు అనుకున్న సమయంలో... ఇటువంటి స్థితి నుంచి అభివృద్ధి అంటే ఆంధ్రానే అనుకునేలా చంద్రబాబు నాయకత్వంతో ప్రధాని మోదీ నిర్దేశకత్వంలో వారి సూచనలు, సలహాలతో మా మంత్రి వర్గం, కార్యకర్తలు అభివృద్ధిలో భాగమవుతాం. ప్రజలు మాపై నమ్మకం పెట్టారు....ఆ నమ్మకం ఫలితమే ఇవాళ రూ.2 లక్షల కోట్లకు పైగా పనులు రాష్ట్రానికి వచ్చాయి. ఈ దేశాన్ని మరింత ప్రగతి పథంలో నడిపించేలా ప్రధాని మోదీకి ఆ లక్ష్మీనరసింహస్వామి దీర్ఘాయుష్షును ఇవ్వాలని కోరుకుంటున్నాను" అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

 

ఇంకా చదవండి: నామినేటెడ్ పదవులు సంక్రాంతి నుండి? భారీ సంఖ్యలో ఆశా వాదులు! అన్ని అంశాలలో ముందంజలో ఉన్న వారికే!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్... ఇక వారికీ పండగే పండగ! ఇకపై ఆ పరీక్షలు రద్దు!

వైఎస్ కుటుంబంలో తీవ్ర విషాదం... జగన్ సోదరుడు మృతి!

టోల్ ప్లాజా వద్ద అఘోరీ హల్ చల్.. ఆమెను అదుపు చేసేందుకు ప్రయత్నించినా..!

నేడు (8/1) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

మహిళలకు మోదీ సర్కార్‌ బంపర్‌ ఆఫర్.. నెలకు రూ.7 వేలు! 18 నుంచి 70 ఏళ్ల లోపు.. ఈ స్కీం ఎలా అప్లై చేయాలంటే!

వైకాపాకు మరో బిగ్ షాక్! కీలక నేతని అదుపులోకి తీసుకున్న పోలీసులు!

వైసీపీకి ఊహించని షాక్.. వైసీపీ నేత, మాజీ మంత్రిపై కేసు నమోదు! ఆలస్యంగా వెలుగులోకి.. లైంగిక వేధింపులు..

దిక్కుతోచని పరిస్థితిలో జగన్.. విశాఖ జిల్లాలో దారుణంగా వైసీపీ పరిస్థితి! అరడజను నియోజకవర్గాల్లో నేతలు కరువు!

నేడు (7/1) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్.. ఏపీఎస్ఆర్టీసీ లో భారీ నియామకాలు, నోటిఫికేషన్ అప్పుడే.. వివరాలు ఇవిగో!

రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి! 24 గంటల లోపు రైతుల ఖాతాలకు సొమ్ము జమ.. బాధ్యతలు విస్మరించిన గత ప్రభుత్వం!

విజయవాడ - అమరావతి మెట్రో ప్రాజెక్టుపై అప్‌డేట్! మొత్తం 33 స్టేషన్లు.. ఆ వివరాలు మీ కోసం!

ఈ నెలలో సమావేశం కానున్న ఏపీ క్యాబినెట్! 14 కీలక అంశాలపై చర్చ.. వాటికి గ్రీన్ సిగ్నల్!

అమెరికా హెచ్ 1 బీ వీసాల్లో భారతీయుల జోరు! ప్రతీ ఐదుగురిలో ఒకరు భారత్ నుంచే!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #PawanKalyan #Repalle #VarahiVijayabheri #Janasena #TDP-JanaSena-BJPAlliance #Jagan #YSRCP