రఘురామ కేసులో ప్రభావతికి షాకిచ్చిన హైకోర్టు! వాళ్లు ముగ్గురు కూడా..
Fri Jan 10, 2025 15:40 Politicsడిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజుపై సీఐడీ కస్టడీలో చిత్రహింసలకు గురి చేసిన వ్యవహారంలో డాక్టర్ ప్రభవతికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ముందస్తు బెయిల్ కోసం డాక్టర్ ప్రభావతి వేసిన పిటిషన్‌ను హైకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. కేసు దర్యాప్తు దశలో బెయిల్ ఇవ్వడం సాధ్యం కాదని హైకోర్టు స్పష్టం చేసింది. గతంలో జిల్లా సెషన్స్ కోర్టు కూడా ప్రభావతి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసిన విషయం తెలిసిందే. గత ప్రభుత్వం నర్సాపురం ఎంపీగా ఉన్న సమయంలో రఘురామపై థర్డ్ డిగ్రీని ప్రయోగించిన కేసులో గుంటూరు ప్రభుత్వాస్పత్రి మాజీ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి ముందుగా జిల్లా సెషన్స్‌కోర్టులో బెయిల్ పిటిషన్ కోసం ఆశ్రయించగా.. అందుకు కోర్టు నిరాకరించింది. దీంతో ప్రభావతి హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే హైకోర్టుకు కూడా ప్రభావతి పిటిషన్‌ను కొట్టివేసింది. కస్టోడియల్ టార్చర్ అనంతరం సంబంధిత డాక్టర్లు రఘురామకు దెబ్బలు తగిలాయని నివేదికలు ఇచ్చారు.
ఇంకా చదవండి: ప్రతి జిల్లాలో కొన్ని గ్రామాల్లో - రెడీ అవుతున్న పవన్! టెంట్ లలో బస!
అయితే ప్రభావతి ఆ నివేదికను మార్చి.. ఆయనకు ఎటువంటి గాయాలు అవలేదని నివేదిక ఇచ్చారని పోలీసులు అభియోగం మోపారు. ఇదే కేసులో అప్పట్లో ఇన్వెస్టిగేషన్ అధికారిగా ఉన్న విజయ్‌పాల్ బెయిల్ పిటిషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన గుంటూరు జిల్లా జైల్లో రిమాండ్‌లో ఉన్నారు. అలాగే ఈ కేసులోనే అప్పట్లో రఘురామ కృష్ణం రాజు గుండెపై కూర్చుని పిడిగుద్దులు గుద్దారని, హత్యాయత్నానికి పాల్పడ్డారని గుడివాడకు చెందిన కామేపల్లి తులసిబాబును విచారణకు పిలిపించిన ఒంగోలు ఎస్పీ.. ఆపై ఆయనను అరెస్ట్ చేశారు. ఈ కేసులో దర్యాప్తు అధికారిగా ఒంగోలు ఎస్పీ వ్యవహరిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి రఘురామ.. గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేయగా నగరంపాలెం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే ప్రభావతి, విజయపాల్, తులసిబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటి సీఐడీ మాజీ డీజీ పీవీ సునీల్ కుమార్, అప్పటి ఇంటలిజెన్స్ బాస్‌గా ఉన్న పీఎస్ఆర్ ఆంజనేయులు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా నిందితులుగా ఉన్నారు. అయితే వాళ్లు ముగ్గురు కూడా ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకు వెళ్లలేదు. మిగిలిన వారు హైకోర్టుకు వెళ్లినప్పటికీ వారికి నిరాశే ఎదురైంది.
ఇంకా చదవండి: ఏపీ ప్రభుత్వం తీపికబురు.. అమరావతి పరిధిలోని 9 గ్రామాలు.. వారికి అకౌంట్లలో డబ్బులు జమ! మొత్తం 20 ఇంజనీరింగ్ పనులు..
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
నిరుద్యోగులకు గుడ్ న్యూస్... హెల్త్ శాఖ భారీ నోటిఫికేషన్ విడుదల! ఎగ్జామ్ లేకుండా ఎంపిక!
తిరుపతి ఘటన ప్రమాదమా... కుట్రా.. మంత్రి కీలక వ్యాఖ్యలు! కారకులు ఏ స్థాయిలో..
రఘురామ కృష్ణంరాజు పై టార్చర్ కేసులో సంచలనం! కీలక నిందితుడు అరెస్ట్!
పేర్ని నాని కుటుంబం రేషన్ బియ్యం మాయం కేసులో సంచలనం! కోర్టులో పోలీసుల కీలక పిటిషన్!
కొనసాగుతున్న పెన్షన్ల వేరిఫికేషన్... ఆ తర్వాతే తొలగింపు! వేలాది మందిపై కీలక దర్యాప్తు!
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం! సంక్రాంతికి స్టార్ట్! పిఠాపురంలో డిప్యూటీ సీఎం చేతుల మీదుగా!
అయ్యో.. అయ్యయ్యో.. మందుబాబులకు బాడ్ న్యూస్! ఆ కంపెనీ ఏడు రకాల బీర్ల సరఫరా నిలిపివేత!
పవన్ కళ్యాణ్ అద్భుతమైన ప్రసంగం.. మోదీ నిర్దేశకత్వం, చంద్రబాబు నాయకత్వం... ఇదే మా పంథా!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #RaghuRamaKrishnaRaju #Telugudesam #Jagan #YSRCP
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.