వైసీపీ నేతలపై చంద్రబాబు ఫైర్! కొత్త వ్యవస్థకు శ్రీకారం చుడితే దుష్ప్రచారం.. ఏదో ఒక కొత్త విషయం..

Header Banner

వైసీపీ నేతలపై చంద్రబాబు ఫైర్! కొత్త వ్యవస్థకు శ్రీకారం చుడితే దుష్ప్రచారం.. ఏదో ఒక కొత్త విషయం..

  Wed Jan 15, 2025 08:00        Politics

సీఎం చంద్రబాబు నారావారిపల్లెలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీ నాయకులపై ధ్వజమెత్తారు. వైసీపీ నేతలు అసత్య ప్రచారాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. తమ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుపై ఎక్కడైనా, ఎవరితోనైనా చర్చకు సిద్ధం అని చంద్రబాబు సవాల్ విసిరారు. కొత్త వ్యవస్థకు శ్రీకారం చుడితే దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. "సోషల్ మీడియాలో ప్రభుత్వంపై బురదజల్లుతున్నారు. వైసీపీ హయాంలో రూ.9 వేల కోట్ల నిధులను అనవసరంగా విద్యుత్ కోసం కట్టబెట్టారు. ఐదేళ్లు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ఇప్పుడు మాపై నిరాధారమైన ఆరోపణలు చేస్తారా? అభివృద్ధి, సంక్షేమానికి సంబంధించిన ప్రతి లెక్క పక్కాగా ఉంది. మేం నిర్దిష్టమైన లక్ష్యంతో ముందుకెళుతున్నాం" అని చంద్రబాబు స్పష్టం చేశారు. 

ఇంకా చదవండి: 18 ఏళ్లు నిండిన మహిళలకు భారీ శుభవార్త! నెలకు రూ.7వేలు డైరెక్ట్ గా అకౌంట్లోకే!


సేంద్రియ సాగుకు నేనే శ్రీకారం చుట్టాను..

ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ ప్రకృతి సేద్యం వైపు చూస్తున్నాయని అన్నారు. రాష్ట్రంలో సేంద్రియ సాగుకు తానే శ్రీకారం చుట్టానని తెలిపారు. ఏపీలో సేంద్రియ సాగును మరింత ప్రోత్సహిస్తామని చెప్పారు. ప్రకృతి సాగుద్వారా ఆహార ఉత్పత్తులకు మంచి ధర వస్తుందని అన్నారు. టెక్నాలజీ ద్వారా... మనం తినే ఆహార నాణ్యతను తనిఖీ చేసుకునే అవకాశం వచ్చిందని చంద్రబాబు పేర్కొన్నారు. ఆరోగ్యంపై ప్రజలకు అవగాహన బాగా పెరిగిందని, ఆహార అలవాట్లు వేగంగా మారిపోతున్నాయని అన్నారు. ప్రస్తుతం సాగు విధానంలో పెనుమార్పులు వస్తున్నాయని... చిరుధాన్యాలు, పండ్ల సాగు పెరుగుతోందని వివరించారు. చీడపీడల నుంచి పంటలను రక్షించుకునే పద్ధతులు మారాయని తెలిపారు. మామిడి పంట రక్షణకు ఆధునిక విధానాలు వచ్చాయని వెల్లడించారు. డ్రోన్ల ద్వారా చీడపీడలను గుర్తించే సాంకేతికత వచ్చిందని వివరించారు. రాష్ట్రంలో మైక్రో ఇరిగేషన్ విధానాన్ని మరింత ప్రోత్సహిస్తామని చెప్పారు. ఇక, పాల దిగుబడి పెరిగేలా చర్యలు తీసుకుంటామని, పశువులకు ఎక్కడిక్కడ షెడ్లు నిర్మిస్తామని, పశువుల మేత కోసం గడ్డి పెంచే క్షేత్రాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. సంక్షేమ పథకాల పంపిణీలో మోసాలకు తావు లేకుండా టెక్నాలజీ వినియోగిస్తామని అన్నారు. తిరుపతి జిల్లా మొత్తం పారిశ్రామికీకరణ చేస్తామని, తిరుపతి జిల్లాకు చెందినవారిని పారిశ్రామికవేత్తలుగా తయారుచేస్తామని చెప్పారు. ఇక, విద్యార్థులు నిత్యం ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవాలని... ఆఫ్ లైన్, ఆన్ లైన్ నాలెడ్జ్ పెంచుకునేందుకు కృషి చేయాలని సూచించారు.

 

ఇంకా చదవండి: నామినేటెడ్ పదవులకు రెండు కేటగిరీలుగా విభజన - తాజా లిస్టు? వేతనాలు ఫిక్స్ - మరో కీలక నిర్ణయం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

18 ఏళ్లు నిండిన మహిళలకు భారీ శుభవార్త! నెలకు రూ.7వేలు డైరెక్ట్ గా అకౌంట్లోకే!

 

పులివెందుల డీఎస్పీ ను బహిరంగంగా బెదిరించిన జగన్! మా కార్యకర్తలపై కేసులు పెడతావా! తర్వాత మీ కథ ఉంటుంది!

 

ఏపీ కో-ఆపరేటివ్ బ్యాంక్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల! దరఖాస్తు వివరాలు తెలసుకోండి!

 

జగన్ వి పగటి కలలా లేక రాత్రి కలలా? వైసీపీ ఎందుకు ఖాళీ అవుతోందో ఇప్పుడు అర్థం అవుతుంది!

 

జగన్ వి పగటి కలలా లేక రాత్రి కలలా? వైసీపీ ఎందుకు ఖాళీ అవుతోందో ఇప్పుడు అర్థం అవుతుంది!

 

ఏపీ ప్రభుత్వం వారికి మరో అదనపు సెలవు ప్రకటించింది! జీవో 73తో ఉద్యోగులకు రిలీఫ్!

 

అమెరికాలో కార్చిచ్చు వేళ అందినకాడికి దోచుకుంటున్న దొంగలు! 29 మంది అరెస్ట్‌!

 

ఏపీ కో-ఆపరేటివ్ బ్యాంక్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల! దరఖాస్తు వివరాలు తెలసుకోండి!

 

దొంగ నోట్ల కలకలం! నకిలీ రూ. 500 నోటును ఎలా గుర్తించాలి! ఇవి లేకపోతే నకిలీనే!

 

వందల నుంచి లక్షల వరకు బెట్టింగులు.. కోడి పందేల హవా నెక్స్ట్ లెవల్! పోలీసుల ఆంక్షలపై లైట్..!

 

వారెవ్వా.. జిల్లాలో కోడిపందెం గెలిస్తే 'మహీంద్రా థార్'.. సందడి రేంజిలో ఉంటుందో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Chandrababu #Chandrababuyagam #Familyfunction #AndhraPradesh #APNews