సంక్రాంతి కానుక.. జగన్ బంధువుకు వేగంగా కదిలిన లీజు ఫైల్! వైకాపా టాప్ లీడర్ హస్తం.. !
Wed Jan 29, 2025 09:59 Politicsవైకాపా అధినేత జగన్‌కు వరుసకు సోదరుడు, పులివెందులకు చెందిన వైఎస్ వెంకటరెడ్డికి.. సంక్రాంతి పండుగ సమయంలో లీజు రూపంలో భారీ కానుక ఇచ్చింది రాష్ట్ర గనుల శాఖ. వైఎస్సార్ జిల్లా వేములలో దాదాపు రూ.100 కోట్లకు పైగా విలువైన ముగ్గురాయి (బెరైటీస్) నిల్వలున్న లీజును కట్టబెట్టింది. సెలవు రోజుల్లో, ఈనెల 15న కనుమ పండుగ నాడు లీజు కేటాయిస్తూ గనులశాఖ ఉత్తర్వులిచ్చింది. ఈ ఫైలు ఆగమేఘాలపై కదలడం వెనుక వైఎస్సార్ జిల్లాకు చెందిన తెదేపా ముఖ్యనేత ఒకరి సహకారం ఉన్నట్లు సమాచారం. వేములలో సర్వే నంబర్లు 1021/26, 43ల్లో 11.6 హెక్టార్లలో ముగ్గురాయి ఖనిజ లీజుకు వెంకటరెడ్డి 2016లో దరఖాస్తు చేసుకున్నారు. వైకాపా అధికారంలోకి వచ్చాక ఆ దస్త్రం వేగంగా కదిలింది. 9.55 హెక్టార్లలో ముగ్గురాయి లీజుకు గనులశాఖ ఎర్రగుంట్ల సహాయ సంచాలకులు 2020 మార్చిలో ప్రతిపాదన పంపారు. గనులశాఖ అప్పటి సంచాలకుడు వీజీ వెంకటరెడ్డి ఈ లీజు ఫైల్‌పై ప్రత్యేక శ్రద్ధ చూపారు. తాజాగా వైఎస్ వెంకటరెడ్డికి 9.55 హెక్టార్లలో 20 ఏళ్ల కాల వ్యవధితో లీజు మంజూరుచేస్తూ ఈనెల 15న డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ ఉత్తర్వు జారీచేశారు.
ఇంకా చదవండి: నామినేటెడ్ పదవుల భర్తీకి కూటమి ప్రభుత్వం కీలక చర్యలు! ఇవాళ రెపట్లో జాబితా విడుదల!
ఇక్కడి ఖనిజానికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఈ లీజులో ఏటా 1,390 టన్నుల చొప్పున ముగ్గురాయిని వెలికి తీయనున్నారు. దీని ప్రస్తుత మార్కెట్ విలువ టన్ను రూ.30-35 వేల వరకు ఉంది.
జగన్‌తో వెంకటరెడ్డి బంధుత్వమిదీ..
• వైఎస్ రాజారెడ్డి, చినకొండారెడ్డి సోదరులు.
• రాజారెడ్డికి రాజశేఖరరెడ్డి, వివేకానందరెడ్డి సహా ఆరుగురు సంతానం. వీరిలో రాజశేఖరరెడ్డి కుమారుడే మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి.
• చినకొండారెడ్డికి ప్రకాష్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, జోసఫెడ్డి.. ఇలా ఆరుగురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు కలిపి 11 మంది సంతానం. వీరిలో ప్రతాప్‌రెడ్డి కుమారుడే వెంకటరెడ్డి. ఇక, భాస్కర్‌రెడ్డి కుమారుడు అవినాష్‌రెడ్డి కడప ఎంపీగా ఉన్నారు.
• రాజారెడ్డి మనవడైన జగన్, చినకొండారెడ్డి మనవడైన వెంకటరెడ్డి వరుసకు సోదరులు. ఎంపీ అవినాష్‌రెడ్డికి వెంకటరెడ్డి సొంత పెదనాన్న కుమారుడు అవుతారు.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
విజయసాయిరెడ్డి రాజీనామా వెనుక కారణాలు వెల్లడించిన కేతిరెడ్డి! ఆ సమయంలో కొన్ని తప్పులు..!
తీవ్ర ఉద్రిక్తత.. వైసీపీ, టీడీపీ నేతల మధ్య ఘర్షణ.. రెండు కార్లు, నాలుగు ద్విచక్ర వాహనాలు!
డ్వాక్రా మహిళల కోసం సర్కార్ భారీ ప్రణాళిక! లక్షల కుటుంబాలకు సోలార్ రూఫ్ టాప్ సౌకర్యం!
దిమ్మతిరిగే ఆఫర్.. రూ.15 వేల స్మార్ట్‌ఫోన్ ఎంత తక్కువకి వస్తుందో.. లక్కీ ఛాన్స్ గురు..
షాక్ షాక్ షాక్... జగన్ గూబగుయ్యుమనిపించిన నంబర్ టు, నంబర్ త్రీ! రాజకీయాల నుంచి అవుట్!
శుభవార్త చెప్పిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం! ఫిబ్రవరి 1న కొత్త పథకం ప్రారంభం!
కేంద్ర ప్రభుత్వం 139 మందికి పద్మ పురస్కారాలు.. ఆ వివరాలు మీకోసం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#andhrapravasi #jagan #scam #fruad #todaynews
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.