ఈక్విటీ మార్కెట్లకు ఊపునిచ్చిన ట్రంప్ గెలుపు! 80 వేల మార్క్ దాటిన సెన్సెక్స్!

Header Banner

ఈక్విటీ మార్కెట్లకు ఊపునిచ్చిన ట్రంప్ గెలుపు! 80 వేల మార్క్ దాటిన సెన్సెక్స్!

  Wed Nov 06, 2024 19:46        Business

దేశీయ ఈక్విటీ మార్కెట్లకు ట్రంప్ జోష్ కలిసొచ్చింది. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి డొనాల్డ్ ట్రంప్ ఎన్నికవ్వడం ఖాయంగా కనిపించడంతో దేశీయ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. ఫలితంగా బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ ఒక్కో శాతానికి పైగా వృద్ధి చెందాయి.

 

ఇంకా చదవండిఏపీకి అదిరిపోయే శుభవార్త.. మన సీఎం ఐడియా వారెవ్వా! కేంద్రం మరో ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్! ఆ జిల్లా ప్రజలు ఎగిరి గంతేయాల్సిందే! 

 

బీఎస్ఈ సెన్సెక్స్ 901.50 పాయింట్లు (1.13 శాతం) లాభంతో 80,378.13 పాయింట్లకు చేరుకున్నది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 270.74 పాయింట్లు (1.12 శాతం) వృద్ధి చెంది 24,484.05 పాయింట్ల వద్ద స్థిర పడింది. ఎన్ఎస్ఈ-50లో 41 స్టాక్స్ లాభాలు గడించాయి. భారత్ ఎలక్ట్రానిక్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), హెచ్‌సీఎల్ టెక్, విప్రో 5.33 శాతం వరకూ పుంజుకున్నాయి. 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మరోవైపు ఎస్బీఐ లైఫ్, టైటాన్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ట్రెంట్‌తోపాటు తొమ్మిది స్టాక్స్ నష్టపోయాయి. బ్రాడ్ ఇండెక్సులు నిఫ్టీ మిడ్ క్యాప్-100, నిఫ్టీ స్మాల్ క్యాప్-100 రెండు శాతానికి పైగా వృద్ధి చెందాయి. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 3.99 శాతం వృద్ధి చెందితే, కేంద్ర ముడి చమురు సంస్థలు, కన్జూమర్ డ్యూరబుల్స్, రియాల్టీ ఇండెక్స్‌లు రెండు శాతానికి పైగా లాభ పడ్డాయి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నేడు ఢిల్లీలో అమిత్ షాను కలవనున్న పవన్ కల్యాణ్! ఎందుకో తెలుసా! కేబినెట్ భేటీ ముగిసిన వెంటనే!

 

ఆమెకు ఆ అరబి కుటుంబం దేవుడుతో సమానం! పొగడ్తల తో ముంచేత్తుతున్న తెలుగు ఆడ పడుచు! ఇంతకీ ఆమెకు ఏమి జరిగిందంటే! 14

 

విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం! విద్యావిధానంలో మరియు ఆ విషయంలో కీలక మార్పులు.. ఇక పండగే!

 

మీరు స్కూటీ కొనాలనుకుంటున్నారా..? అదిరిపోయే ఫీచర్లతో - అతి తక్కువ ధరకే ఎలక్ట్రిక్ స్కూటీ!

 

గత ఐదేళ్లలో తప్పులు జరిగిన మాట నిజమే! సంచలన వ్యాఖ్యలు చేసిన డీజీపీ! ఇక వారికి మోతే!

 

బీఎస్‌ఎన్‌ఎల్‌ స్పెషల్‌ రీఛార్జ్‌ ఆఫర్‌! అన్‌లిమిటెడ్‌ కాల్స్‌... 600 జీబీ డేటా!

 

ఆ న్యూస్ వెబ్సైట్ కి భారీ షాక్! కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ! ఎందుకంటే..  

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #Business #Stocks #StockMarkets #MarketCrash