ఈ ట్రాన్సాక్షన్లు చేస్తున్నారా? ఐటీ నోటీసులస్తాయ్! పెనాల్టీ కూడా కట్టాల్సిందే?
Mon Jan 13, 2025 14:23 Businessప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024-25 కు సంబంధించి పన్ను మినహాయింపు పొందేందుకు పెట్టుబడులు పెడుతున్నారా? మరో 3 నెలలే గడువు ఉంది. దీంతో ఇప్పటి నుంచే ఈ పథకాల్ని ఎంచుకోవాలి. ఏమాత్రం పొరపాట్లు చేయొద్దు. టాక్స్ పేయర్లు ముఖ్యంగా పెద్ద మొత్తంలో నగదు ట్రాన్సాక్షన్లపై ఆంక్షలు ఉన్నాయన్న విషయం గుర్తుంచుకోవాలి. కొన్ని క్యాష్ ట్రాన్సాక్షన్లపై పెనాల్టీ పడొచ్చు. ఐటీ నోటీసులు వస్తాయి. ఇవేంటో చూద్దాం.
మన దేశంలో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పెద్ద ఎత్తున జరుగుతున్నప్పటికీ.. ఇప్పటికీ నగదు లావాదేవీలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. ఇక్కడ మరీ ముఖ్యంగా పెద్ద మొత్తంలో లావాదేవీలపైన ఆంక్షలు ఉన్నప్పటికీ.. నిఘా కొరవడిన నేపథ్యంలో యథేచ్ఛగా సాగుతున్నాయి. ఇటీవల ప్రధానంగా వీటిపై దృష్టి సారించింది. ముఖ్యంగా ఇందులో రూ. 2 లక్షలపైన నగదు లావాదేవీలు జరిగితే ఆ వివరాల్ని ఆర్థిక సంస్థలకు నివేదించాల్సి ఉంటుంది. అయినా నిబంధనలు అతిక్రమిస్తున్నట్లు కేంద్ర ప్రత్యేక్ష పన్నుల బోర్డు గుర్తించింది. ముఖ్యంగా ఇప్పుడు మరో 3 నెలల తర్వాత ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఐటీఆర్ ఫైలింగ్ చేయాల్సి ఉంటుందన్న సంగతి తెలిసిందే. దీంతో వీటి గురించి ఆలోచించాలి. కొన్ని ట్రాన్సాక్షన్లు చేస్తే.. పెద్ద మొత్తంలో పెనాల్టీ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంకా ఐటీ నోటీసులు, కాల్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 269ST సహా మరికొన్ని సెక్షన్ల కింద నగదు లావాదేవీలు పరిమితికి మించి చేస్తే నోటీసులు సహా పెనాల్టీ పడుతుందని టాక్స్2విన్ కోఫౌండర్, సీఈఓ అభిషేక్ సోనీ చెప్పారు. జులై 31లోగా ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ఫైలింగ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి 100 శాతం వరకు పెనాల్టీ పడేందుకు దారి తీసే ట్రాన్సాక్షన్స్ ఏమేం ఉన్నాయో చూద్దాం.
ఇంకా చదవండి: మీకు పీఎఫ్ ఖాతా ఉందా! ఫ్రీగా మీ అకౌంట్‌లోకి రూ.50 వేలు వచ్చేస్తాయి!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
సెక్షన్ 269SS (లోన్స్, డిపాజిట్స్, అడ్వా్న్సెస్)- బంధువులు లేదా స్నేహితులకు రూ. 20 వేల కంటే ఎక్కువ రుణం ఇవ్వాలనుకుంటే చెక్ లేదా బ్యాంక్ డ్రాఫ్ట్ లేదా బ్యాంక్ అకౌంట్ ద్వారా ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫర్ విధానం ఎంచుకోవడమే మేలు. రూ. 20 వేల కంటే ఎక్కువ రుణం నగదు రూపంలో ఇవ్వకూడదు. రుణం తీసుకునేటప్పుడు కూడా ఇదే నియమాలు వర్తిస్తాయి. ఇక్కడ సెక్షన్ 269SS కింద అంతే మొత్తం పెనాల్టీ పడుతుంది.
లోన్ అండ్ డిపాజిట్స్ రీపేమెంట్ (సెక్షన్ 269T)- లోన్లు, డిపాజిట్లు, అడ్వాన్సుల కింద తీసుకున్న మొత్తం తిరిగి చెల్లించేటప్పుడు రూ. 20 వేలు పరిమితిగా ఉంది. ఇక్కడ కూడా చెక్, బ్యాంక్ డ్రాఫ్ట్ లేదా ఇతర ఎలక్ట్రానిక్ మోడ్స్ ద్వారా తిరిగి చెల్లించాలి. ఇక్కడ కూడా నిబంధనల ఉల్లంఘన జరిగితే సెక్షన్ 269T కింద పన్ను అధికారికి లోన్ మొత్తంపై 100 శాతం జరిమానా విధించేందుకు అధికారం ఉంది.
సెక్షన్ 269ST (రూ. 2 లక్షల కంటే ఎక్కువ నగదు స్వీకరణ)- ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 269 ST ప్రకారం రూ. 2 లక్షలకు మించి నగదు రూపంలో చెల్లింపులు చేయడం స్వీకరించేందుకు వీల్లేదు. ఎక్కువగా ఇలాంటి ట్రాన్సాక్షన్స్ హోటల్స్, బ్యాంకెట్ హాల్స్, లగ్జరీ బ్రాండ్ రీటైలర్స్, ఐవీఎఫ్ క్లినిక్స్, హాస్పిటల్స్, మెడికల్ కాలేజీ సీట్ల కొనుగోళ్లు వంటి చోట్ల జరుగుతున్నట్లు గుర్తించారు. కాబట్టి ఇలాంటి వాటి పట్ల జాగ్రత్త వహించాలి. ఇక్కడ కూడా పెనాల్టీ మీరు పంపిన లేదా స్వీకరించిన దానికి సమానంగా పడుతుంది.
బిజినెస్ ఎక్స్‌పెండిచర్స్ (సెక్షన్ 40A(3))- వ్యాపారాల్లో కూడా పరిమితికి మించి నగదు రూపంలో తీసుకోకూడదు. ఒక వ్యాపార యజమాని రూ. 10000 కంటే ఎక్కువ నగదు లావాదేవీలు చేస్తే.. అతను ఆ మొత్తాన్ని ఖర్చుగా, తరుగుదలగా (డిప్రిసియేషన్) క్లెయిమ్ చేయలేడు.
డొనేషన్స్ (సెక్షన్ 80G)- రూ. 2 వేలకుపైగా నగదు రూపంలో డొనేషన్స్ చేస్తే.. అవి తిరిగి క్లెయిమ్ చేసుకోలేరు. ఇలాంటి సమయాల్లో నోటీసులు రావడం సహా పెనాల్టీ కట్టాల్సి వస్తుంది.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
అమరావతి సచివాలయంలో కీలక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల! రాత పరీక్షలు లేకుండానే ఎంపిక!
టాలీవుడ్ కి షాక్.. దగ్గుబాటి కుటుంబంపై కేసు నమోదు... ఏ2గా విక్టరీ వెంకటేశ్! ఎందుకు అంటే!
మరో వివాదంలో చిక్కుకున్న తిరువూరు ఎమ్మెల్యే! వివరణ కోరిన సీఎం చంద్రబాబు!
క్రెడిట్ కార్డు బిల్లు కట్టడం పెద్ద సమస్య ఏమి కాదు! ఈ చిన్న ట్రిక్ తెలిస్తే చాలు!
పట్టణాల నుంచి పల్లెలకు వచ్చేవారు ఆ బస్సులను ఉపయోగించుకోండి...! చంద్రబాబు ప్రత్యేక ఆదేశాలు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #Business #Transactions #Online
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.