18 ఏళ్లు నిండిన మహిళలకు భారీ శుభవార్త! నెలకు రూ.7వేలు డైరెక్ట్ గా అకౌంట్లోకే!

Header Banner

18 ఏళ్లు నిండిన మహిళలకు భారీ శుభవార్త! నెలకు రూ.7వేలు డైరెక్ట్ గా అకౌంట్లోకే!

  Tue Jan 14, 2025 15:08        Business

గృహిణులుగా, ఉద్యోగినులుగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఆర్థికంగా ఎదగాలని చాలామంది మహిళలు ఆశిస్తారు. సొంత కాళ్లపై నిలబడాలని కోరుకుంటారు. అయితే వారి కలలను నెరవేర్చేందుకు LIC ఓ అదిరిపోయే స్కీమ్ తీసుకొచ్చింది. అదే "బీమా సఖి యోజన". ఈ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2024, డిసెంబర్ 9న ప్రారంభించారు. ప్రారంభించిన నెల రోజుల్లోనే 52,000 మందికి పైగా మహిళలు రిజిస్టర్ చేసుకోవడం విశేషం. 

 

బీమా సఖి అవ్వడానికి కొన్ని అర్హతలు ఉండాలి. వయస్సు 18 నుంచి 70 ఏళ్ల మధ్య ఉండాలి. అలాగే కనీసం 10వ తరగతి పాసై ఉండాలి. ఎల్ఐసీ ఉద్యోగులు లేదా ఏజెంట్ల తక్షణ బంధువులు అంటే భార్య, భర్త, పిల్లలు, తల్లిదండ్రులు, తోబుట్టువులు లేదా అత్తామామలు.. అలాగే రిటైర్డ్ ఎల్ఐసీ ఉద్యోగులు, మాజీ ఏజెంట్లు, ప్రస్తుతం పనిచేస్తున్న ఏజెంట్లు ఈ పథకానికి అర్హులు కాదు.

 

ఇంకా చదవండిఏపీ ప్రభుత్వం వారికి మరో అదనపు సెలవు ప్రకటించింది! జీవో 73తో ఉద్యోగులకు రిలీఫ్! 

 

ఇంకా చదవండిపండగ వేళ ప్రజలకు గుడ్ న్యూస్.. కొత్త రేషన్ కార్డులపై బిగ్ అప్డేట్! దరఖాస్తూలకు డేట్ ఫిక్స్ చేసిన కూటమి?

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

బీమా సఖి పథకం మహిళలకు శిక్షణ ఇవ్వడంతో పాటు ఆర్థికంగా చేయూతనిస్తుంది. వారికి మూడేళ్ల పాటు మంత్లీ స్టైఫండ్ అందుతుంది. మొదటి సంవత్సరంలో నెలకు రూ.7,000; రెండవ సంవత్సరంలో నెలకు రూ.6,000, మూడవ సంవత్సరంలో నెలకు రూ.5,000 చొప్పున చెల్లిస్తారు.

 

అయితే, ఈ స్టైపెండ్ పొందడానికి కొన్ని షరతులు వర్తిస్తాయి. మీరు గత సంవత్సరం అమ్మిన పాలసీలలో కనీసం 65% నిలుపుదల రేటు ఉండాలి. అంటే, పాలసీ తీసుకున్నవారు కనీసం 65% మంది పాలసీని కొనసాగించాలి. ఇది మీ పనితీరును, నిబద్ధతను తెలియజేస్తుంది. ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లో చేరిన మహిళలు ఈ 65% పాలసీ రిటెన్షన్ రేట్ కండిషన్ మీట్ అవ్వకుండానే మొదటి సంవత్సరం స్టైఫండ్ అందుకోవచ్చు. రెండో సంవత్సరం నుంచి కండిషన్ వర్తిస్తుంది.

 

ఎంత ఆదాయం వస్తుంది?
స్టైఫండ్‌ మాత్రమే కాకుండా ప్రతిభకు తగ్గట్టు సంపాదించే అవకాశం కూడా LIC కల్పిస్తోంది. మీరు అమ్మే పాలసీలపై ఆకర్షణీయమైన కమీషన్లు అందుకోవచ్చు. ఉదాహరణకు, మొదటి సంవత్సరంలో విక్రయించిన పాలసీలపై బోనస్‌లు కాకుండానే దాదాపు రూ.48,000 వరకు సంపాదించవచ్చు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

అమెరికాలో కార్చిచ్చు వేళ అందినకాడికి దోచుకుంటున్న దొంగలు! 29 మంది అరెస్ట్‌!

 

ఏపీ కో-ఆపరేటివ్ బ్యాంక్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల! దరఖాస్తు వివరాలు తెలసుకోండి!

 

దొంగ నోట్ల కలకలం! నకిలీ రూ. 500 నోటును ఎలా గుర్తించాలి! ఇవి లేకపోతే నకిలీనే!

 

వందల నుంచి లక్షల వరకు బెట్టింగులు.. కోడి పందేల హవా నెక్స్ట్ లెవల్! పోలీసుల ఆంక్షలపై లైట్..!

 

వారెవ్వా.. ఆ జిల్లాలో కోడిపందెం గెలిస్తే 'మహీంద్రా థార్'.. సందడి ఏ రేంజిలో ఉంటుందో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Politics #TDP #JSP #YCP #PawanKalyan #Janasena #AP #AndhraPradesh #YSJagan #Assembly #BJP #NaraLokesh #PawanKalyan #PSPK #HighCourt #Amaravathi #BJP