యాత్ర తరంగిణి 6: దేవాలయాల ఎప్పుడు? ఎక్కడ ప్రతీష్టించాలి? శాస్త్రం ఏం చెబుతుంది?

Header Banner

యాత్ర తరంగిణి 6: దేవాలయాల ఎప్పుడు? ఎక్కడ ప్రతీష్టించాలి? శాస్త్రం ఏం చెబుతుంది?

  Wed Jan 17, 2024 18:11        Devotional, యాత్రా తరంగిణి

ఆలయ నిర్మాణం

భగవంతుడు లేకుండా మానవుడు జీవించలేడననీ, శివుని అజ్ఞ లేనిదే చీమైనాకుట్టందనీ, అందుకనే భగవన్మూర్తిని ఒకచోట ప్రతిష్ఠించి ఆరాధిస్తున్నాము. భగవత్ సాక్షాత్కారం కోసమే ప్రతి హిందువు తపన పడతాడు. ప్రయత్నిస్తాడు. అదే పవిత్ర స్థలం. అదే దేవాలయం. ఇది భౌతిక శరీరం (ఫిజికల్ బాడీ) మానసిక శరీరం (సైకిక్ బాడీ), తైజసిక శరీరాలను (సూపర్ కాన్ షియస్ బాడీ) ప్రతిబింబిచే ఒక ప్రతీక. అందువల్లనే దేవాలయం భగవంతుడికి మానవుడికి ఉన్న ఒక కొక్కీ (లింక్) అని విజ్ఞుల అభిప్రాయం.

 

దేవాలయ నిర్మాణం ఎప్పుడు, ఎక్కడ ఆరంభింపబడిందో చెప్పడం కష్టం. వేదకాలాల్లో దేవాలయాలు లేవనీ, విగ్రహారాధనా పద్ధతి, దేవాలయాల నిర్మాణం వేదకాలపు చివరిదశలో, రామాయణ, మహాభారత కాలల్లో ఆరంభమైందనీ, వేదకాలపు యాగశాలలే కాలక్రంగా దేవాలయాలుగా రూపొందాయని పలువురి అభిప్రాయం.

 

‘దేవాలయాలు వైదికయుగంలో నిర్మితములైనట్లు కనబడదు. దేవతా స్వరూపము, దేవతల వాహనములు, ప్రతిమా వర్ణనము మొదలైన విషయములకు సంబంధించిన వాక్యములు వేదములందు కొన్ని ఉన్నాయి కానీ, విగ్రహారాధన ఆచరణ లోనికి వచ్చిన తర్వాత గాని, దేవాలయ నిర్మాణమునకు అవకాశం ఉండదు. విగ్రహారాధన ఏర్పడిన వెంటనే దేవాలయ నిర్మాణము కూడా ప్రారంభింపబడింది. బ్రహ్మస్వరూపమైన ఆత్మకు దేహము నిలయమైనట్లుగా, దేవతా విగ్రహానికి దేవాలయం నిలయముగా భావించి, దేవాలయ నిర్మాణము శరీర నిర్మణమును అనుసరించి చేశారని చెప్పవచ్చు.

 

సింగపూర్ లో తెలుగు వారికి శుభవార్త! హైదరాబాద్ లో పెట్టుబడి అవకాశం మీ ముంగిట్లోకే! ఈ నెల 20 - 21 తేదీలలో! మరిన్ని వివరాల కోసం Click Here

 

దేవాలయ నిర్మాణంలో మొట్టమొదటి అంశం ఆలయ నిర్మాణానికి భూమిని ఎన్నుకోవడం.

పవిత్రములైన దేవాలయాలు సాధారణంగా నదీతీరాల్లోకాని, నీటి బుగ్గలు ఉన్న పర్వతాగ్రాల మీద కానీ కట్టబడి ఉండడాన్ని మనం గమనించవచ్చు.

 

పుణ్యక్షేత్ర సమీపంలోను, నదీ తీరంలోను సముద్రతీరంలోను, నదీసంగమస్థానంలోను, పర్వతాగ్రంలోను, పర్వతపార్శ్వంలోను, వనంలోను, ఉపవనంలోను, ఉద్యానవనంలోను, సిధ్ధదుల ఆశ్రమంలోను, గొప్ప గ్రామంలోను, పురంలోను, పట్టణంలోను, రమ్య ప్రదేశాలలోను, దేవాలయాలను కట్టాడానికి సంకల్పించాలట.

 

ఈ ప్రదేశాలన్నీ ప్రకృతి పరిసరాలు, దేవాలయ నిర్మాణానికి అనువైన ప్రదేశాలు. అందు వల్లనే బృహత్సంహీత ఇలా చెప్తుంది. నదీ, శైల, నిర్ఘర, ప్రదేశాలలోని వనాల్లోను, పట్టన ఉద్యానవనాల్లోను దేవతలు విహరిస్తారు. ఇవి భగవంతుడి వాసస్థానలే కాకుండా శుభం, శాంతిని కలిగించే ప్రదేశాలు.

 

సింగపూర్ లో తెలుగు వారికి శుభవార్త! హైదరాబాద్ లో పెట్టుబడి అవకాశం మీ ముంగిట్లోకే! ఈ నెల 20 - 21 తేదీలలో! మరిన్ని వివరాల కోసం Click Here

 


అలాగే “శిల్ప ప్రకాశ” ఇలా చెప్తోంది.

నదీ రహితమైన భూమి, పాషాణంతో కూడుకొన్న నేల దేవాలయ నిర్మాణానికి పనికిరావు. ఇసుకతో కూడుకొన్న భూమి అనువైనది, బురదగానున్న భూమిని, స్మశాన భూమిని పరిత్యజించాలి.

 

దేవాలయ నిర్మాణానికి ఉపకరించే రాయి, రప్ప, శిల, లోహం ఇత్యాదులు మనుష్యరూపాన్ని నిర్మించే అస్తిపంజరాన్ని పోలి ఉంటాయి. ఈ శరీరానికెలా అలంకార ప్రాయంగా వస్థాభరణాలు అవసరమో, ఆలయానికి, విగ్రహానికి కూడ అలంకార ప్రాయమైన రచన అంతే అవసరం.

 

ఆలయానికి అనువైన ప్రదేశాన్ని ఎంపిక చేసుకొన్న తర్వాత ఆలయ నిర్మాణం ఆరంభమవుతుంది.
దేవాలయ నిర్మాణంలో అతి ముఖ్యమైన అంశం వాస్తు పురుష మండలాన్ని రచించడం. వాస్తు పురుషుడి చిత్రాన్ని వ్రాసి పూజించడంవల్ల, ఆ పురుషుడు మరియు అతనితో ఉన్న దేవతలు అక్కడే నెలకొని ఆలయ నిర్మాణ కార్యాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తారట. భూమిని 81 లేక 64 చతురస్రాకార విభాగాలుగా విభజించి మధ్యలో స్తంభాన్ని కాని, అగ్నిని కాని స్తాపించి, పూజ చేస్తారు. మధ్యలో ఉన్న ఈ చదరాన్ని బ్రహ్మస్థాన మంటారు.

 

సింగపూర్ లో తెలుగు వారికి శుభవార్త! హైదరాబాద్ లో పెట్టుబడి అవకాశం మీ ముంగిట్లోకే! ఈ నెల 20 - 21 తేదీలలో! మరిన్ని వివరాల కోసం Click Here

 

ఒక్కొక్క చతురస్రాకార విభాగంలోను ఒక్కొక్క దేవతను ఆవాహన చేస్తారు. మధ్యనున్న చద రమే వాస్తు యొక్క కేంద్ర స్థానం. ఇక్కడే వాస్తు పురుషుడుంటాడు. వాస్తుపురుషమండలాన్ని స్థాపించిన తర్వాత “గర్భన్యాసం” అనే విధిని మానవుల్లో గర్భాదానానికి సమానంగా పూర్వులు విధించారు. భూమాత – అనుగ్రహం కోసం ఈ కర్మను ఆచరిస్తారు.

 

గర్భగృహ ద్వారం వచ్చే ప్రదేశానికి వెనుక నిర్దిష్టస్థానంలో 25 చతురస్రాకార పల్లలు (తగ్గులు) ఉన్న రాగిపాత్రలో వివిధ శాస్త్ర సమ్మతాలైన వస్తువులను నేలలో పుడ్చడమే గర్భన్యాస కర్మం. నిర్మాణానికి ఉపయోగపడే వస్తోపకరణాలకు పూజ జరిగిన అనంతరం నిర్మాణ కార్యక్రమం సాగుతుంది.

 


దేవాలయం అంటే లక్షోపలక్షల భక్తుల పుణ్యధామం. ఆగమశాస్త్రబద్ధంగా దేవాలయాలను నిర్మించవలసి వుంటుంది.

ఆలయనిర్మాణం దేవుడు పడుకున్నట్లు శయనరీతిలో నిర్మిస్తారు. ఆలయ గోపురమే భగవంతుని పాదాలు. గర్భగుడి భగవంతుని శిరస్సు. ఆలయ మంటపం భగవంతుని కడుపు. దైవదర్శనం అంటే గుడిలోకి వెళ్ళి స్వామిని చూచి గంటకొట్టి నమస్కరించాలి అనుకొంటుంటాం. ఆ పద్ధతినే పాతిస్తుంటాం. కాని దూరంగా వుండి కూడా ఆలయగోపురానికి నమస్కరించినా స్వామి పాదాలకు నమస్కరించినట్లే అవుతుంది. కాబట్టి ఆలయగోపురం ఎత్తుగా వుండాలి అంతేకాకుండా, దేవాలయం ఒక వ్యక్తికీ ఒక కుటుంబానికీ సంబంధించి వుండదు. సార్వజనిక ఆస్థిగా పరిగణింపబడుతూ, పోషింపబడుతూ, రక్షింపబడుతూ, దర్శింపబడుతూ వుండాలి. దాతలేవరైనా దేవాలయానికి దానాదికాలను చేయవచ్చు. పోషకులుగా వుండవచ్చు. వేశ్యలు కూడ దేవాలయాలను కట్టించి దాఖలాలు ఎన్నో వున్నాయి.

 

సింగపూర్ లో తెలుగు వారికి శుభవార్త! హైదరాబాద్ లో పెట్టుబడి అవకాశం మీ ముంగిట్లోకే! ఈ నెల 20 - 21 తేదీలలో! మరిన్ని వివరాల కోసం Click Here

 


సర్వజనానీకానికీ, పొరుగువూరివారికీ, పరదేశ వాసులకూ, క్రొత్తగా వచ్చినవారికీ దేవాలయం ఎక్కడ వున్నదో సులభంగా తెలుసుకోవటానికి బాగుటుంది. కాబట్టి ఆలయగోపురం ఎత్తుగా వుండాలి. దేవాలయ గోపురమే కాదు దేవాలయం కూడా ఎత్తుమీద వుండటం హితదాయకం. అందుకే ఎన్నో దేవాలయాలు కొండలు గుట్టలు చూచుకొని మరీ నిర్మిస్తారు. ఎందుకంటే, మానవుడెంతటి తెలివికలవాడైనా ప్రకృతిని జయించగల శక్తివంతుడు కాలేదు! కాలేడు! వరదబీభత్సాల తుఫానులు మొదలైన ప్రకృతి వైపరీత్యాలకు మనిషి భయపడి తీరవలసిందే. అటువంటి ప్రకృతి ప్రళయసమయాలలో ప్రాణాలు కాపాడగల్గిన స్థలం దేవాలయమే!

 


దేవుడు సర్వోన్నతుడు! ఈ సర్వోన్నత భావం దేవాలయాన్ని దర్శించిన ప్రతిసారీ మనిషికి, మనస్సుకీ బోధపడటానికి దేవాలయాన్నీ దేవాలయగోపురాన్నీ ఎంత వీలైతే అంతగా ఎత్తుకి నిర్మిస్తారు. హిందూదేవాలయాలేకాదు. మసీదుకి కూడా పొడవైన స్తంభం నిర్మిస్తారు. చర్చికి కూడా ముందుభాగంలో ఎత్తుగా దూరానికి కన్పించే విధంగా అంతస్థు నిర్మించి గంటను కడతారు.

 

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

 

 

యాత్రా తరంగిణి - దేవాలయాలకు ఎందుకు వెళ్ళాలి? దర్శనం చేసుకునే సమయం లో చేయవలసినది ఏమిటి? ప్రముఖ దేవాలయాల ప్రాముఖ్యత, విశిష్టత, విశేషాలు... వారం వారం మీకోసం...

 

యాత్రా తరంగిణి 5: ప్రతి దేవాలయం ఎందుకు అలా ఉంటుంది? సైన్స్ దాగుందా?

 

యాత్రా తరంగిణి 4: దేవాలయాల నిర్మాణం వెనుక ఉన్న అసలు కారణం

 

యాత్ర తరంగణి 3: దేవాలయం లోపల పాటించవలసిన కనీస నియమ నిబంధనలు

 

యాత్ర తరంగణి 2: దేవాలయాలు ఎన్ని రకాలు, వాటి నిర్మాణాలు ఎలా ఉంటాయి, ఉపయోగాలు ఏమిటి...

 

యాత్రా తరంగిణి 1 -గుడి లో సాష్టాంగ నమస్కారం, ప్రదక్షిణం తప్పనిసరా...

 

 

 


   #andhrapravasi #YatraTarangini #Devotional #TemplesOfIndia #IndianTemples #TruthBehindTemples #TypesOfTemples #TempleConstruction #TempleVisits #HolyTemples #Spirtuality