ఏపీ లో అధ్వాన్నంగా ఉన్న రోడ్డులపై సీఎం చంద్రబాబు దృష్టి! అధికారులకు కీలక ఆదేశాలు!

Header Banner

ఏపీ లో అధ్వాన్నంగా ఉన్న రోడ్డులపై సీఎం చంద్రబాబు దృష్టి! అధికారులకు కీలక ఆదేశాలు!

  Fri Jul 12, 2024 20:31        Politics

ఏపీలో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉందని 5,141 కిలోమీటర్ల మేర రోడ్లు గుంతలతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమీక్ష సమావేశంలో అధికారులు వెల్లడించారు. తక్షణం ఈ గుంతల పడ్డ రోడ్లను పూడ్చాలని సీఎం ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించారు. సచివాలయంలో ఆర్అండ్ బీ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో రోడ్ల దుస్థితి, నిధుల అవసరం, ప్రస్తుతం ఉన్న సమస్యలపై సీఎంకు అధికారులు వివరించారు. రాష్ట్రంలో 4,151 కిలోమీటర్ల మేర రోడ్లపై గుంతలు ఉన్నాయని, తక్షణమే మరమ్మతులు చేయాల్సిన రోడ్లు మరో 2,936 కిలోమీటర్లు మేర ఉన్నాయని వివరించారు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

మొత్తంగా రాష్ట్రంలో 7,087 కిలోమీటర్ల పరిధిలో తక్షణం పనులు చేపట్టాల్సిన అవసరం ఉందని, వీటి కోసం కనీసం రూ.300 కోట్ల నిధులు అవసరం అని తెలిపారు. గుంతలు పూడ్చే పనులు వెంటనే చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. అత్యవసరంగా బాగు చేయాల్సిన రోడ్లపైనా దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. రోడ్ల మరమ్మతులు, నిర్మాణంలో కొత్త, మెరుగైన సాంకేతికతను వినియోగించే విషయంపై తిరుపతి ఐఐటి, ఎస్ఆర్ఎం యూనివర్సిటీలకు చెందిన ప్రొఫెసర్లు, ప్రభుత్వ అధికారులు, నిర్మాణ రంగ నిపుణులతో చర్చించారు. ఆర్ అండ్ బీ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి, ఆ శాఖ అధికారులు, నిర్మాణ రంగ నిపుణులు సమీక్షలో పాల్గొన్నారు.

 

ఇవి కూడా చదవండి 

పంచాయతీ రాజ్ శాఖకు మాస్టర్ ప్లాన్ రూపొందిస్తాం! డిప్యూటీ సీఎం హామీ! 

 

సైకో జగన్ పై హత్యాయత్నం కేసు నమోదు! డాక్టర్ ప్రభావతి తోపాటు మరో ముగ్గురు పై కూడా! RRR కంప్లైంట్ పై కేసు ఫైల్ చేసిన పోలీసులు! 

 

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం! కేజ్రీవాల్ కు భారీ ఊరట! 

 

కవిత డిఫాల్ట్ బెయిల్ పేటీషన్ పై నేడు విచారణ! బెయిల్ వస్తుందా రాదా! 

   

టీ-టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా బ్రాహ్మణి! తెలంగాణపై బాబు ప్రత్యేక ఫోకస్! 

             

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group 


   #AndhraPravasi #Politics #TDP #CBN #YCP #AndhraPradesh #AP #APGovernment #APRoads #RoadTransport