కొంపముంచిన వీసీ సార్ వీడియో! ఏయూలో ఏం జరుగుతుంది!

Header Banner

కొంపముంచిన వీసీ సార్ వీడియో! ఏయూలో ఏం జరుగుతుంది!

  Fri Jul 12, 2024 22:25        Politics

ఆంధ్ర విశ్వవిద్యాలయం కొత్త వీసీగా పలువురు సీనియర్ ప్రొఫెసర్ల ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ గతంలో వారు మాజీ వీసీ ప్రసాద్ రెడ్డికి చేసిన భజన పెద్ద ఆటంకంగా మారింది. హార్టీ కంగ్రాట్యులేషన్స్ వీసి సార్ అంటూ ఐదు నెలల క్రితం ప్రసాద్ రెడ్డి రెండో పర్యాయం వీసీ అయిన తర్వాత పోటాపోటీగా సీనియర్ ప్రొఫెసర్లంతా ఏయూ గేట్ల ముందు, రిజిస్టర్ ఆఫీస్ ముందు నిలబడి వీడియోలు చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఇప్పుడు వీరిలో ఎవరు వీసీకి ప్రయత్నం చేద్దాం అన్న వీరు హార్డ్ కోర్ ప్రసాద్ రెడ్డి గ్యాంగ్ అంటూ తిరస్కరణకు గురవుతున్నారు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

గుమ్మడికాయల దొంగ భుజాలు తడుము కుంటున్నట్లు, ప్రసాద రెడ్డితో ఎక్కువగా అంటకాగిన ఆచార్యులు, డీన్ లు అధికారుల పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలలా తయారయ్యింది. ప్రసాద రెడ్డి జమానాలో విర్రవీగిన కొందరు డీన్ లు, ఇతర అధికారులు కొందరు 'పతివ్రత'ల అవతారమెత్తి, కొత్త సర్కారులో సైతం తమ హోదాలను కాపాడుకోవడం కోసం అమరావతి లో తిష్ట వేశారు. అవసరం అయితే సరెండర్ అయిపోయి, కనీసం ఇంచార్జిల గానైనా కుర్చీల్లో కూర్చోవాలని ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు సమాచారం. ఏ ఎండకు ఆ గొడుగు" లాగా అమరావతిలో గిరికీలు కొడుతున్నారని వీరి కదలికలను గమనిస్తున్న ఉద్యమకారులంతా వారి పాత వీడియోలు బయటకు తీస్తున్నారు. వాటిని వైరల్ చేస్తున్నారు. దీంతో వారి ఆశల మీద నీళ్లు చల్లుతున్నట్లు అయింది.

 

ఇంకా చదవండి: జగన్ కు షాక్! ఏపీలో 9 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ! ఆ ఇద్దరు డీజీపీ ఆఫీస్​కి రిపోర్టు చేయాలని ఆదేశాలు!

 

ఇదంతా 'రెడ్డి గారి' వ్యూహంలో భాగమేనని కొందరు అభిప్రాయపడుతున్నారు. కూటమి సర్కార్ ఇలాంటి వారిని నమ్మితే నట్టేట మునిగినట్టేనని కూడా వారు వ్యాఖ్యానిస్తున్నారు. గత పాలనలో అడ్డగోలు వ్యవహారాలకు 'తందానా'అంటూ వత్తాసు పలికిన కొందరు డీన్లు, అధికారులు ఇప్పుడు పాతివ్రత్యం' ముసుగులో లోపలికి దూరాలని మకాం వేశారని సమాచారం. వీళ్ళ వ్యూహాలు ఫలిస్తే రెడ్డి గారి పాలన మళ్లీ కొనసాగినట్లు.. తస్మాత్ జాగ్రత్త!! వీరు ప్రసాద రెడ్డిని పొగుడుతూ పెట్టిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.

 

ఇవి కూడా చదవండి 

ఏపీ లో అధ్వాన్నంగా ఉన్న రోడ్డులపై సీఎం చంద్రబాబు దృష్టి! అధికారులకు కీలక ఆదేశాలు! 

 

పంచాయతీ రాజ్ శాఖకు మాస్టర్ ప్లాన్ రూపొందిస్తాం! డిప్యూటీ సీఎం హామీ! 

 

సైకో జగన్ పై హత్యాయత్నం కేసు నమోదు! డాక్టర్ ప్రభావతి తోపాటు మరో ముగ్గురు పై కూడా! RRR కంప్లైంట్ పై కేసు ఫైల్ చేసిన పోలీసులు! 

 

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం! కేజ్రీవాల్ కు భారీ ఊరట! 

 

కవిత డిఫాల్ట్ బెయిల్ పేటీషన్ పై నేడు విచారణ! బెయిల్ వస్తుందా రాదా! 

   

టీ-టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా బ్రాహ్మణి! తెలంగాణపై బాబు ప్రత్యేక ఫోకస్! 

             

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group 


   #AndhraPravasi #Politics #AndhraPradesh #AndhraUniversity #AU #AP #