వాళ్లు జగన్ ఫ్యాన్స్ కాదు! వాళ్లు మా వాళ్లు! కాంగ్రెస్ బలహీనంగా ఉండడంతో.. షర్మిల

Header Banner

వాళ్లు జగన్ ఫ్యాన్స్ కాదు! వాళ్లు మా వాళ్లు! కాంగ్రెస్ బలహీనంగా ఉండడంతో.. షర్మిల

  Sat Jul 13, 2024 08:30        Politics

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ఇవాళ మీడియా సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మొన్నటి ఎన్నికల్లో వైసీపీకి 39 శాతం ఓటింగ్ వచ్చిందని, వాళ్లంతా చంద్రబాబు సీఎం కాకూడదని ఓటు వేసినవారేనని షర్మిల పేర్కొన్నారు. ఇటీవలి ఎన్నికలు... చంద్రబాబు ముఖ్యమంత్రిగా కావాలా? చంద్రబాబు ముఖ్యమంత్రిగా కాకూడదా? అనే అంశంపైనే జరిగాయని అన్నారు. "ముఖ్యమంత్రిగా చంద్రబాబు వద్దు అనుకున్న వాళ్లంతా వైసీపీకి ఓటేశారు. ఎందుకంటే... కాంగ్రెస్ చాలా బలహీనంగా ఉంది కాబట్టి వాళ్లంతా వైసీపీ వైపు మొగ్గు చూపారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు వద్దు అనుకున్న వారు జగన్ మోహన్ రెడ్డికి ఓటేశారు. అంతే తప్ప... వాళ్లంతా జగన్ మోహన్ రెడ్డి ఫ్యాన్స్ కాదు. వాళ్లంతా కాంగ్రెస్ పార్టీ నుంచి అటువైపు వెళ్లిన వాళ్లే. వాళ్లంతా మా వాళ్ళు. మా వాళ్లను మేం రాబట్టుకోవడంలో తప్పేముంది? కచ్చితంగా రాబట్టుకుంటాం! వైసీపీకి ఓటు వేసిన 39 శాతం మంది వాస్తవానికి కాంగ్రెస్ పార్టీకి చెందినవారు. అది మా ఓటు బ్యాంకు. 2029లో ఆ విషయం స్పష్టంగా చూపిస్తాం" అంటూ షర్మిల వివరించారు.


ఇంకా చదవండి: రాజధాని నిర్మాణంపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! ఆ సంస్థలకు బాధ్యతలు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

రైల్వే జిఎం అరుణ్ కుమార్ ని కలిసి పలు సమస్యలను వివరించిన ఎంపి శ్రీకృష్ణదేవరాయలు! పల్నాడులో ఆర్ ఓబీలు, ఆర్యుబిలు నిర్మాణ!

 

ఏపీ ఐఏఎస్ బదిలీలపై కీలకమైన మార్పులు ! 19 మంది కొత్త పాత్రల్లో !

 

వామ్మో.. వాయ్యో... ఏమిటి ఈ "వాట్స్ అప్" వినతుల వెల్లువ! తట్టుకో లేక పోతున్న సిబ్బంది! పర్సనల్ మెయిల్ ఐడీని ప్రకటించిన లోకేశ్!

 

ఒకేరోజు నాలుగు ఎత్తిపోతల పథకాలు ప్రారంభం ! కృష్ణమ్మకు పూజలు, నీటి ప్రవాహం!

 

46 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న పూరీ జగన్నాథుడి భాండాగారం! ఏకగ్రీవంగా తీర్మానించిన 16 మంది సభ్యుల కమిటీ!

 

ఊహించని మలుపు తిరిగిన రాజ్‌తరుణ్ వివాదం! బాంబు పేల్చిన మాల్వీ!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

             


   #AndhraPravasi #Sharmila #YCP #Jagan #AndhraPradesh #Meeting #APnews #Sharmilaspeech