ఏపీ మహిళలకు రెండు శుభవార్తలు! 18 ఏళ్ల నుంచి 59 ఏళ్ల మహిళలకు అకౌంట్లలోకి రూ.1,500 - సున్నా వడ్డీతో రుణాలు!

Header Banner

ఏపీ మహిళలకు రెండు శుభవార్తలు! 18 ఏళ్ల నుంచి 59 ఏళ్ల మహిళలకు అకౌంట్లలోకి రూ.1,500 - సున్నా వడ్డీతో రుణాలు!

  Sat Sep 21, 2024 07:00        Politics

ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వానికి ఇవాళ్టితో 100 రోజులు పూర్తవుతున్నాయి. ఈ సందర్భంగా.. సీఎం చంద్రబాబు.. ప్రకాశం జిల్లా, నాగులుప్పలపాడు మండలంలో జరిగే ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో పాల్గొంటారు. 100 రోజుల పాలనలో తీసుకున్న నిర్ణయాలు, చేసిన ప్రక్షాళన, చేయబోయే పనులను ప్రజలకు వివరిస్తారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా కూటమి ఎమ్మెల్యేలు వారి వారి నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. ఇలా ఆరు రోజులపాటు ఇది ఉంటుంది. ఐతే.. ఈ సందర్భంగా.. ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు చెప్పలేదు. కానీ అప్‌డేట్ వేరే ఉంది. మీకు గుర్తుండే ఉంటుంది.. ఏపీలో తాము అధికారంలోకి వస్తే.. ఆడబిడ్డ నిధి పథకం కింద 18 ఏళ్ల నుంచి 59 ఏళ్ల మహిళలకు ప్రతి నెలా వారి బ్యాంక్ అకౌంట్‌లో రూ.1,500 చొప్పున జమ చేస్తామని కూటమి పార్టీలు చెప్పాయి. ఉమ్మడి మేనిఫెస్టోలో కూడా 6 గ్యారెంటీ పథకాల్లో దీన్ని ఒకటిగా చేర్చాయి.

 

ఇంకా చదవండి: చంద్రబాబు: ఆ ముఖ్యమంత్రి వస్తున్నాడంటే నాకే ఆశ్చర్యం వేసేది! చరిత్రలో ఎన్నడూ చూడనంత

 

ఇప్పుడు దీన్ని అమలు చేసేందుకు అడుగులు పడుతున్నాయి. ఆడబిడ్డ నిధి పథకం అమలు కోసం మార్గదర్శకాలు రెడీ చెయ్యాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్‌లో గ్రామాల్లో పేదరికాన్ని తొలగించేందుకు ఉద్దేశించిన సంస్థ సెర్ప్ (SERP) కార్యక్రమాలను చంద్రబాబు సమీక్షించారు. ఈ సందర్భంగా.. ఆడబిడ్డ నిధి కోసం ఆదేశాలు ఇచ్చారు. అందువల్ల త్వరలోనే ఈ పథకం అమలవుతుందని స్పష్టమైంది. దీపావళి నుంచి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లను అమలు చేస్తామన్నారు కాబట్టి.. అడబిడ్డ నిధి పథకాన్ని దీపావళి తర్వాత అమలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ పథకం కోసం గైడ్‌లైన్స్ రూపొందించే అధికారులు.. కుటుంబ వార్షిక ఆదాయాన్ని లెక్కలోకి తీసుకుంటారని సమాచారం. అలాగే.. పేద మహిళలకు మాత్రమే దీన్ని ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. తప్పనిసరిగా ఈ మనీ అవసరం అనిపించే వారికి ఈ పథకాన్ని అమలు చెయ్యడం వల్ల ప్రయోజనం ఉంటుందని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. ఏది ఏమైనా గైడ్‌లైన్స్ వచ్చాక గానీ.. మనకు క్లారిటీ రాదు. సీఎం చంద్రబాబు మరో నిర్ణయం కూడా తీసుకున్నారు. డ్వాక్రా సంఘాలకు రూ.10 లక్షల వరకు సున్నా వడ్డీ రుణాలు ఇచ్చేలా విధి విధానాలు రూపొందించాలని ఆదేశించారు. అందువల్ల త్వరలో డ్వాక్రా మహిళలు కూడా సున్నా వడ్డీకే రుణం తీసుకునే ఛాన్స్ రాబోతోందని అనుకోవచ్చు.

 

ఇంకా చదవండి: గల్ఫ్ లో ఏజెంట్ మాయమాటలు విని మోసపోయిన తెలంగాణ యువతి! కఠినమైన చట్టాలు లేకనే! ప్రభుత్వ సహాయం కోసం! 9

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఎదురుదాడి చేస్తే భయపడతాననుకుంటున్నారా.. తాట తీస్తా! చంద్రబాబు వార్నింగ్! ఈ సైకోలకు ప్రభుత్వం అంటే!

 

వైసీపీ మాజీ మంత్రి కొన్ని కోట్లు వసూలు! ఎవరి దగ్గర - ఎంతంటే! ఫిర్యాదుతో బయటపడ్డ అసలు నిజాలు!

 

సీఎం చంద్రబాబు శ్రీకాకుళం జిల్లా పర్యటన రద్దు.! ప్రకాశం పర్యటన ఖరారు! ఎందుకో తెలుసా?

 

ఉండేదెవరు..? పోయేదెవరు..? జిల్లాల వారీగా నేతలతో జగన్ వరుస భేటీలు! మరికొందరు నేతలు కూడా పక్కచూపులు!

 

ఏపీ స్కూళ్లకు దసరా సెలవుల ప్రకటన! ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే..?

 

నిరుద్యోగులకు ప్రభుత్వం వరం.. ఉచితంగా నెలకు 3 వేలు! ప్రభుత్వం కీలక నిర్ణయం!

 

పవన్ తో భేటీ తర్వాత బాలినేని సంచలన వ్యాఖ్యలు! వైసీపీకి వార్నింగ్ - కూటమికీ ముందస్తుగా!

 

వీసా గొడవ లేదు! పాస్‌ పోర్ట్‌ ఉంటే చాలు.. మూడు గంటల జర్నీ! ఈ దేశానికి పోటెత్తుతున్న భారతీయ టూరిస్టులు!

 

ఏపీ ఎక్కడ బాగుపడిపోతుందా అన్న దిగులు మొదలైంది సైకోకి! సంతోషించాల్సిన సమయంలో జగన్ ఏడుపు!

 

కూటమి ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు హెచ్చరిక! దాని జోలికి వెళ్లొద్దు అని సూచన! ఎందుకంటే..!

 

నేటి నుంచి ఏపీలో ఫ్రీ ఇసుక - బుకింగ్ ఇలా..! అధికారులు నుంచి ఇసుక రవాణా!

 

వైసీపీకి భారీ షాకులు తప్పడం లేదు! బాలినేనితో పాటు జనసేనలో చేరనున్న మరో జగన్ సన్నిహితుడు?

 

మరో పథకానికి పేరు మార్చిన ఏపీ ప్రభుత్వం! జగన్ హయాంలో పథకాలకు! మరో కీలక నిర్ణయం!

 

ఏపీ మహిళలకు చంద్రబాబు గుడ్ న్యూస్! ఆరోజు నుంచే ఉచిత గ్యాస్ సిలిండర్లు!

 

కుటుంబంలో 18 ఏళ్లలోపు పిల్లలు ఉన్నవారికి శుభవార్త! రేపే ప్రారంభం! ఇది అన్ని ఆర్థిక నేపథ్యాల కుటుంబాలకు అందుబాటులో!

 

బీఆర్ఎస్ కు హైకోర్టులో ఊహించని షాక్! పార్టీ ఆఫీసు కూల్చివేయాలని ఆదేశాలు జారీ!

 

కొత్త మద్యం పాలసీకి కేబినెట్ ఆమోదం! బీసీల రిజర్వేషన్ పై కీలక చర్చ!

 

.

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #AndhraPradesh #APPolitics #Jagan #GovernmentJobs #Saraly #Amaravati #Pinchalu